ఆడి క్యూ3 సెలబ్రిటీల జాబితాలోకి షర్మిలా నికోల్లెట్
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎస్ గోల్ఫర్ షర్మిలా నికోల్లెట్ తాజాగా ఆడి సెలబ్రిటీ ఓనర్ల జాబితాలో చేరిపోయారు. ఇటీవలే ఈమె ఓ ఆడి క్యూ3 లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారును కొనుగోలు చేసిన వారిలో ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఈ సందర్భంగా, షర్మిలా నికోల్లెట్ గురించి, అలాగే ఆడి క్యూ3 కారు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..!
షర్మిలా 2009లో ఓ ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా ఎదిగాది. అప్పటికి ఆమెకు 18 సంవత్సరాలు. మహిళ యూరోపియన్ పోటీల్లో పాల్గొన్న అతి తక్కువ వయస్కురాలిగా భారత గోల్ఫర్ నికొల్లెట్ చరిత్ర సృష్టించింది. 2009-10 లో జరిగిన అనేక ఇతరత్ర టోర్నీలలో నికోల్లెట్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచి పలు పతకాలు సాధించింది. 2012లో జరిగిన హిరో కేజిఏ టోర్నమెంట్‌లో ఆమె చాంపియన్‌గా నిలిచింది.
ఆడి క్యూ3 విషయానికి వస్తే, జూన్ 2012లో ఇది భారత మార్కెట్లోకి విడుదలైంది. ప్రస్తుతం ఇది ఆడి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. సరసమైన ధర, విశిష్టమైన డిజైన్, ఆడి బ్రాండ్ ఇమేజ్‌లు ఈ మోడల్ సక్సెస్‌కు కారణం. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఆడి క్యూ3 కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ హైలైట్స్:
* 2.0 లీటర్ టిడిఐ క్వాట్రో ఇంజన్ - 130 కి.వా. (177 హెచ్‌పి) శక్తి
* ప్రారంభ ధర కేవలం రూ.26 లక్షలు (ఎక్స్-షోరూమ్)
* ఆడి క్యూ3 ఈ సెగ్మెంట్లో క్వాట్రో డ్రైవ్‌ట్రైన్‌తో కూడిన మొదటి ఎస్‌యూవీ

ఆడి క్యూ3 ఎక్స్‌టీరియర్స్:
* 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, 7-ఆర్మ్ డిజైన్, సైజ్ 6.5జే x 16
* రూఫ్ రెయిల్స్
* హీట్-ఇన్సులేటింగ్ గ్లాస్
* ట్రిమ్ స్ట్రైప్స్, బ్లాక్
* పూర్తి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ (హీటింగ్ సౌకర్యంతో పాటు)
* ప్రత్యేకమైన డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హ్యాలోజెన్ హెడ్‌లైట్స్
* హెడ్‌లైడ్ రేంజ్ (దూరం) అడ్జస్ట్‌మెంట్

ఆడి క్యూ3 ఎక్స్‌టీరియర్స్:
* ఎల్-గ్రెయిమ్/లెథరెట్టే బి-గ్రెయిమ్ సీటింగ్
* ఇంటీరియర్ లైటింగ్ ప్యాకేజ్
* ముందు, వెనుక సీట్లలో ఫ్లోర్ మ్యాట్స్
* 4-స్పోక్ డిజైన్ కలిగిన లెథర్-కవర్డ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్
* మోనోమెటాలిక్ లేదా టఫ్ఫల్ బీజ్ (ఇంటీరియర్ కలర్‌ను బట్టి)లో ఇన్‌లేస్
* హెడ్‌లైనింగ్ ఇన్ క్లాత్
* లగేజ్ కంపార్ట్‌మెంట్ మ్యాట్
* ప్లాస్టిక్ డోర్ సిల్ ట్రిమ్స్

ఆడి క్యూ3 సేఫ్టీ ఫీచర్లు:
* ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి)
* స్థలాన్ని ఆదా చేసే అధనపు చక్రం (స్పేస్-సేవింగ్ స్పేర్ వీల్)
* ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు వార్నింగ్ ట్రయాంగిల్, కార్ జాక్
* ఫుల్ సైజ్ ఎయిర్‌బ్యాగ్ (హెడ్ ఎయిర్‌బ్యాగ్‌తో పాటుగా ముందు వైపు, వెనుక వైపు సైడ్ ఎయిర్‌బ్యాగ్స్)
* ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజేషన్ డివైజ్
* ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్

ఆడి క్యూ3 బేస్ వేరియంట్ - కంఫర్ట్ ఫీచర్లు:
* మ్యాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్
* హిల్ స్టార్ట్ అసిస్ట్
* ఎలక్ట్రోమెకానికల్ పార్కింగ్ బ్రేక్
* రివర్సబల్ లోడ్ ఫ్లోర్
* ముందు వైపు 4-వే లూంబర్ సపోర్ట్‌తో కూడిన స్టాండర్డ్ ఫ్రంట్ సీట్
* కుడివైపు సీట్ కోసం ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎడమవైపు సీట్ కోసం మ్యాన్యువల్ హైట్ అడ్జస్ట్
* మడుచుకునేందుకు వీలైన వెనుక (రియర్) సీట్
* రేడియో రిమోట్ కంట్రోల్ * ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్
* రియర్ పార్కింగ్ ఎయిడ్ * క్రూయిజ్ కంట్రోల్

ఆడి క్యూ3 బేస్ వేరియంట్ - ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు:
* కాన్సెర్ట్ రేడియో
* ప్యాసివ్ స్పీకర్స్
* డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్
* ఆడి మ్యూజిక్ ఇంటర్‌ఫేస్
* వాయిస్ డైలాగ్ సిస్టమ్
* బ్లూటూత్ ఇంటర్‌ఫేస్


Click it and Unblock the Notifications








