యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు, అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ చేతిలో డబ్బులు తీసుకువెళ్లటమే మానేశారు, బదులుగా స్మార్ట్‌ఫోన్లు, క్రెడిట్/డెబిట్ కార్డులను తమ వెంట తీసుకెళ్లి చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఓ రకంగా మనకు మేలు చేసినప్పటికీ, వీటి వలన ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉంది. మనం అప్రమత్తంగా లేకపోతే, మోసగాళ్లు మన అకౌంట్లలోని డబ్బులన్నింటినీ మాయం చేసేస్తారు. అసలు, ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెబుతున్నానంటే..

హోండా యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు.. అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

స్కూటర్‌లో పెట్రోల్ కొట్టిద్దామని ఓ పెట్రోల్ బంకుకు వెళ్లిన యజమానికి రూ.550 చార్జ్ చేయాల్సింది పోయి, అతడి అకౌండ్ నుండి ఏకంగా రూ.55,000 చార్జ్ చేసేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఓ షెల్ పెట్రోల్ బంకులో జరిగింది. ఐదు లీటర్లు కూడా పెట్రోల్ పట్టని తన యాక్టివా స్కూటర్ కోసం యాభైఐదు వేలు చార్జ్ చేయడంతో సదరు స్కూటర్ యజమాని షాక్ అయ్యాడు. ఆ సంఘటనకు సంబంధించి వివరాలను, తన పేమెంట్ స్క్రీన్‌షాట్స్‌ను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారింది.

హోండా యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు.. అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

ప్రస్తుతం, అనేక మొబైల్ పేమెంట్ చెల్లింపుల విషయంలో కొనుగోలుదారులు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత తామే స్వయంగా చెల్లించాల్సిన మొత్తాన్ని తమ ఫోనులో నమోదు చేసి చెల్లింపు చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో కూడా పొరపాట్లు జరుగుతాయని, కానీ అవి చాలా అరుదుగా ఉంటాయి. అలాగే, కొన్ని దుకాణాలలో ఆటోమేటిక్‌గా షాపింగ్ చేసిన మొత్తం పేమెంట్ చెల్లింపు మెషీన్‌పై కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకూ పొరపాటు జరిగే అవకాశం లేదు.

హోండా యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు.. అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

అయితే, కొన్ని సందర్భాలలో మాత్రం షాపు యజమానులే స్వయంగా కార్డ్/పేమెంట్ చెల్లింపు మెషీన్‌పై మ్యాన్యువల్‌గా చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేస్తారు. ఇలా నమోదు చేసేటప్పుడు ఓ రెండు నెంబర్లు ఎక్కువగా టైప్ చేస్తే, మనం చెల్లించాల్సిన దాని కన్నా వంద రెట్లు ఎక్కువ చెల్లించే ప్రమాదం ఉంటుంది. షెల్ పెట్రోల్ బంకు ఘటనలో కూడా ఇదే జరిగింది. యాక్టివా స్కూటర్ యజమాని చెల్లించాల్సిన మొత్తం రూ.550 అయితే, అక్కడ పనిచేసే వ్యక్తి ఈ నెంబర్ (550) పక్కన అదనంగా మరో సున్నాలు (00) జోడించి రూ.55,000 చార్జ్ చేశాడు.

హోండా యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు.. అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

ఆ తర్వాత తాను చేసిన పొరపాటుకి నాలుక కరుచుకున్నాయి. అయితే, అప్పటికే జరగాల్సిన గొడవంతా జరిగిపోయింది. సదరు యాక్టివా స్కూటర్ యజమాని షెల్ పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని సంప్రదించడంతో వారు తిరిగి తాము అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి నగదరు రూపంలో ఇచ్చేశారు. అయితే, ఇప్పుడు తాను ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడం కోసం తమ సమయాన్ని వెచ్చించాలని, సరైన శిక్షణ లేకుండానే ఉద్యోగులను పనిలో పెడుతున్నారని వాదించాడు.

హోండా యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు.. అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

సాధారణంగా హార్డ్ క్యాష్‌తో ఎదుర్కొనే సమస్యలలో చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్ల కొరత, నకిలీ నోట్లు, చిరిగిన/చెల్లని నోట్లు మొదలైనవి ఉన్నాయి. అయితే, డిజిటల్ చెల్లింపులు అటువంటి సమస్యలన్నింటినీ తొలగించాయి, కానీ అదే సమయంలో ఇలాంటి కొత్త సమస్యలు సృష్టించబడ్డాయి. డిజిటల్ చెల్లింపులు మధ్యలోనే నిలిచిపోవడం, ఖాతా నుండి నగదు డెబిట్ చేయబడినప్పటికీ తర్వాత క్రెడిట్ చేయబడకపోవడం మరియు నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడం కారణంగా పేమెంట్స్ యాప్స్ పనిచేయకపోవడం వంటి కారణాలు చాలానే ఉన్నాయి.

హోండా యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు.. అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

డిజిటల్ పేమెంట్లను మాన్యువల్‌గా నమోదు చేయాల్సిన లొకేషన్‌లలో మానవ తప్పిదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు కావాలని కూడా ఇలా చేస్తుంటారు. పెట్రోల్ పంపుల వద్ద అటెండెంట్లు ప్రతిరోజూ వందల సంఖ్యలో చెల్లింపులను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్‌ను బట్టి వీటిలో గణనీయమైన శాతం డిజిటల్ చెల్లింపులే ఉండే అవకాశం ఉంటుంది. చాలా పెట్రోల్ బంకులలో హ్యాండ్‌హెల్డ్ POS (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్‌లో మొత్తాన్ని మాన్యువల్‌గా నమోదు చేయాల్సి ఉంటుంది.

హోండా యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు.. అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

అలాంటి పెట్రోల్ బంకులలో లావాదేవీల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నందున, అప్పుడప్పుడూ మానవ తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, అటెండర్లు గంటల తరబడి నిలుచుకొని పనిచేయడం వలన కూడా ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వారు మెషీన్ పై ఖచ్చితమైన మొత్తం నమోదు చేయబడిందో లేదో నిర్ధారించుకోరు. పిఓఎస్ మెషీన్‌లో తప్పు మొత్తాన్ని నమోదు చేయడం అనేది వాటి గురించి సరైన శిక్షణ మరియు అవగాహన లేకపోవడం వల్ల కూడా జరగవచ్చు.

హోండా యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్‌కి రూ.55.000 చార్జ్ చేశారు.. అట్లుంటది డిజిటల్ పేమెంట్‌తోని..

చెల్లింపు చేయడానికి QR కోడ్‌ని ప్రదర్శించే కొత్త మెషీన్‌లు పాత వెర్షన్‌లతో పోలిస్తే ఉపయోగించడం చాలా సులభంగా ఉంటాయి. పాత తరం POS మెషీన్‌ల బటన్ కీలతో పోలిస్తే, కొత్త తరం POS మెషీన్‌లు కెపాసిటివ్ టచ్‌స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ కొత్త పిఓఎస్ మెషీన్లు పెద్ద మరియు స్పష్టమైన డిస్ప్లేలను కూడా కలిగి ఉంటాయి. చెల్లింపులు చేసేటప్పుడు / స్వీకరించేటప్పుడు కొనుగోలుదారులు మరియు విక్రయదారులు ఇద్దరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నమోదు చేసిన మొత్తాన్ని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మొత్తం గురించి కస్టమర్‌కు వివరంగా చెప్పడం లేదా చూపించడం చేయాల్సి ఉంటుంది.

Source: Rushlane

Most Read Articles

English summary
Activa owner charged rs 55000 at petrol filling station instead of rs 550 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X