వ్యాపార రంగంలోకి హీరో అజిత్‌కుమార్‌.. సంస్థ పేరు ప్రకటన.. అక్టోబర్ 23 నుంచే సేవలు..!

హీరో అజిత్‌కుమార్‌ పరిచయం అవసరం లేని పేరు. నటనతోపాటు కారు, బైక్‌లంటే అజిత్‌కు (Actor Ajithkumar) ఎంతో ఇష్టం. ఎన్నో బైక్‌ రేస్‌లలో పాల్గొన్నారు. దాంతోపాటు అనేక ప్రాంతాల్లో బైక్‌ టూర్‌లో స్వయంగా పాల్గొన్నారు. తాజాగా హీరో అజిత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆసక్తిని వ్యాపారంగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై కీలక ప్రకటన వెలువడింది.

వీనస్‌ మోటార్‌ సైకిల్‌ టూర్స్‌ (Venus Motorcycle Tours) పేరుతో అజిత్‌ బైక్‌ టూరింగ్‌ సంస్థను ప్రారంభించారు. భారత్‌, యూఏఈ, ఒమన్‌, థాయ్‌లాండ్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తుందని ప్రకటించారు. హీరో అజిత్‌ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. తనకు ఆసక్తి ఉన్న బైక్‌ రైడింగ్‌పై ఎక్కువ సమయం వెచ్చించారు. టూరింగ్ సంస్థ ఏర్పాటుచేస్తానని అజిత్‌ గతంలోనే ప్రకటించారు.

actor ajithkumar touring Company

వీనస్‌ మోటార్‌సైకిల్‌ టూర్స్ పేరుతో సంస్థ ఏర్పాటుచేస్తున్నట్లు హీరో అజిత్ మేనేజర్‌ అధికారికంగా ప్రకటన చేశారు. నటుడు అజిత్‌ తన రైడింగ్‌ అనుభవాన్ని వ్యాపారంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. బైక్‌ రైడర్‌లు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు ఈ సంస్థ సాయం చేస్తుందని వెల్లడించారు.

బైక్‌ టూర్లకు వెళ్లాలనుకొనే వారికి వీనస్‌ మోటార్‌సైకిల్‌ టూర్స్ సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం రాజస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, థాయ్‌లాండ్‌, న్యూజిలాండ్ దేశాల్లో బైక్‌ రైడింగ్‌ ప్రోగ్రాంలు ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ ప్రోగ్రాంలో బైక్ రైడర్‌లతోపాటు సంస్థ ఉద్యోగులు కూడా పాల్గొంటారు.

venus motorcycle tours company

వీనస్‌ మోటార్‌ సైకిల్‌ టూర్స్‌ సంస్థ.. రైడర్‌లకు ప్రపంచంలోనే అందమైన ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తుంది. మరియు రైడ్‌ర్‌లకు మెరుగైన శిక్షణ ఇస్తుంది. రైడ్‌లకు మంచి మార్గాలను ఎంపికచేసి, ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంతిమంగా మెరుగైన రైడింగ్ అనుభూతిని పొందేలా ఏర్పాట్లు చేస్తుంది. సంస్థ తరఫున అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుంది.

బైక్‌ రైడర్‌లకు మోటార్‌సైకిళ్లు అద్దెకు తీసుకోవడం, పర్యాటనలకు అవసరమైన అంతర్జాతీయ అనుమతుల పొందేందుకు, అవసరమైన పత్రాలు పొందేందుకు ఈ సంస్థ సాయం చేస్తుంది. ఈ అక్టోబర్‌ 23 నుంచి బైక్‌ టూరింగ్‌ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది.

actor ajithkumar

వీనస్‌ మోటార్‌సైకిల్‌ టూర్స్‌ సంస్థ తన తొలి టూరింగ్‌ సర్వీస్‌గా ఒమన్‌, యూఏఈలను కనెక్ట్‌ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. టూర్‌లో భాగంగా పర్వతాలు, బీచ్‌లు, నగరాలు వంటి అందమైన ప్రాంతాల గుండా రైడర్లు వెళ్లేలా చూస్తోంది. ఈ రైడ్‌లో రైడింగ్‌ అనుభవం ఉన్నా లేకున్నా పాల్గొనవచ్చని సంస్థ చెబుతోంది.

ఫీజు చెల్లింపు అనంతరం టూరింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. బైక్‌ రైడింగ్‌కు వెళ్లాలనుకొనే వారి కోసం సంస్థ వెబ్‌సైట్‌, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, సోషల్‌ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా పంచుకుంది. అక్టోబర్‌ 23 నుంచి తొలి టూరింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

actor ajithkumar started venus motorcycle tours

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, October 6, 2023, 19:11 [IST]
English summary
Actor ajitkumar launched venus motorcycle tours company
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+