ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్..ఎలా జరిగిందంటే ?

తెలుగు సినిమా రంగంలో అత్యధిక అభిమానులు కలిగి ఉన్న హీరోలలో ఒకరు, స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్'. ఆర్య, బద్రినాధ్ వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచిన ఈ నటుడు, ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్.. బన్నీ సేఫ్

ఇటీవల అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ ముగించుకుని వస్తున్న సందర్భంలో అతని కారావ్యాన్ కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అయితే ఈ ప్రమాద సమయంలో అల్లు అర్జున్ ఆ కారా వ్యాన్ లో లేదని సమాచారం. అల్లు అర్జున్ కారావ్యాన్ లో కేవలం మేకప్ టీమ్ మాత్రమే ఉన్నట్లు తెలిసింది.

ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్.. బన్నీ సేఫ్

ఖమ్మం రూరల్ సత్యనారాయణపురం వద్ద అల్లు అర్జున్ కారావ్యాన్ ప్రమాదానికి గురైంది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండడంతో అక్కడున్నవారు హీరోకు గాయాలు అయి ఉంటాయనుకుని హుటా హుటిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. కాని ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

MOST READ:ఇక తప్పనిసరే.. పొడగింపులు ఉండవ్..: ఫాస్టాగ్‌పై నితిన్ గడ్కరీ స్టేట్‌మెంట్

ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్.. బన్నీ సేఫ్

ఇక అల్లు అర్జున్ యొక్క కారావ్యాన్ విషయానికి వస్తే, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ మొత్తంలో అత్యంత విలాసవంతమైన కారా వాన్ లో అల్లు అర్జున్ కారావాన్ కూడా ఒకటి. దాన్ని అందరూ కారవాన్ అని పిలవకుండా ఉండడానికి ఫల్కన్ పేరు కూడా పెట్టారు.

ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్.. బన్నీ సేఫ్

అల్లు అర్జున్ ఎంతగానో ఇష్టపడి తాయారు చేయించుకున్న ఈ కారా వ్యాన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అనేక లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ వ్యాన్ ధర వచ్చేసి రూ.7 కోట్లు. సిల్వర్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న ఈ వాహనం అదరగొడుతోంది. అధునాతన హంగులు, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

MOST READ:సరికొత్త రూపంలోకి మారిన బెంట్లీ కాంటినెంటల్ జిటి [వీడియో]

ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్.. బన్నీ సేఫ్

ఈ వాహనం యొక్క లోపలి భాగం గమనిస్తే 5-స్టార్ హోటెల్లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసేందుకు వీలుగా బెడ్, సోఫా కలిసి ఉండి సౌకర్యవంతంగా టీవీ చూడవచ్చు. యాంబియంట్ లైటింగ్ తో సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఈ వ్యానిటీ వ్యాన్ లోనే టాయిలెట్, షవర్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.

ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్.. బన్నీ సేఫ్

ఈ ప్రమాదంలో అల్లు అర్జున్ కారావ్యాన్ పాల్కన్, వెనుక యాగం కొంత దెబ్బతింది. అయితే ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు.

MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

Most Read Articles

English summary
Telugu Actor Allu Arjun's Caravan 'Falcon' Meets With An Accident. Read in Telugu.
Story first published: Monday, February 8, 2021, 9:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X