'అమర్ దీప్' కొన్న కొత్త కారు ఇదే.. ధర ఎంతో తెలుసా?

ఆధునిక కాలంలో సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఇందులో సినీతారలు మాత్రమే కాకుండా బుల్లితెర నటులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల సీరియల్ నటుడు 'అమర్ దీప్' ఓ కొత్త టాటా కారు కొన్నారు.

అమర్ దీప్ కొత్త కారు కొనుగోలుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో అమర్ భార్య తేజస్విని ఎంట్రీ.. కేక్ కట్ చేయడం మరియు కారు డెలివరీకి సంబంధించిన సన్నివేశాలు చూడవచ్చు. కొత్త కారు కొనుగోలుతో తేజస్విని కారు దగ్గర ఫోటోలకు పోజులివ్వడం కూడా వీడియోలో చూడవచ్చు. మొత్తం మీద ఈమె ఆనందానికి అవధులు లేదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.

Actor Amardeep Buy New Tata Safari

కారు డెలివరీ తీసుకున్న తరువాత తేజస్విని డ్రైవింగ్ సీటులో కూర్చుంటుంది. అమర్ డ్రైవర్ పక్క సీటులో కూర్చుంటాడు. ఆ తరువాత తేజస్విని కారు డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లడంతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియోను తేజస్విని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు పెద్ద సంఖ్యలో వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

అమర్ కొనుగోలు చేసిన కారు విషయానికి వస్తే.. ఇది టాటా మోటార్స్ కంపెనీకి చెందిన సఫారీ అని తెలుస్తోంది. నలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ కారు ధర మార్కెట్లో రూ.16 లక్షల నుంచి రూ.27 లక్షల మధ్య ఉంది. అయితే ఇది ఏ వేరియంట్ అనే వివరాలు ఇక్కడ వెల్లడి కాలేదు. బహుశా ఇది సెవెన్ సీటర్ అని అనిపిస్తోంది. దీనిపై కూడా స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

Actor Amardeep Buy New Tata Safari

టాటా సఫారీ విషయానికి వస్తే.. ఇది దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బ్రాండ్ కారు. ఇది మంచి డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. పనితీరు పరంగా కూడా టాటా సఫారీ ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

టాటా సఫారీ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది ఎకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. సఫారీ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. సేఫ్టీలో ఇది 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది.

నిజానికి బిగ్‌బాస్ సీజన్ 7 ద్వారా ఎంతోమంది అభిమానవుల మనసుదోచిన 'అమర్ దీప్' ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. నటి సురేఖా వాని కూతురు సుప్రీతతో అమర్ దీప్ నటిస్తున్నారు. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే గతంలో మాస్ మహారాజ్ రవితేజ్ తన సినిమాలో అమర్ దీప్‌కు ఛాన్స్ ఇస్తానని పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం అమర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, May 13, 2024, 18:21 [IST]
English summary
Actor amardeep buy new tata safari details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+