మహీంద్రా XUV700 కారును కొనుగోలు చేసిన నటుడు ఆశిష్ విద్యార్థి.. తన జీవితంలో తొలి కారంటూ కీలక వ్యాఖ్యలు..!
భారత సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖ నటుల్లో ఆశిష్ విద్యార్థి ఒకరు. ఎక్కువగా విలన్, నెగటివ్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు.
ఆయా ప్రాంతాల విశేషాలు, ఆహార అలవాట్లు, సంస్కృతిని తన యూబ్యూబ్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ జిందగీ (Fifty puls zindagi)లో ఫోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆశిష్ విద్యార్థి (Actor ashish vidyarthi) మహీంద్రా XUV700 కారును డెలివరీ తీసుకున్నారు. వీడియోను తన యూబ్యూబ్ ఛానల్‌లో షేర్‌చేశారు. అయితే ఆశిష్ విద్యార్థి డెలివరీ తీసుకున్న కారు కొత్తగా కాదని తెలుస్తోంది. ఈ కారు మహీంద్రా XUV700 AX7 వేరియంట్‌గా తెలుస్తోంది.

ఈ కారును డెలివరీ తీసుకున్న తర్వాత పూజ చేయడం వీడియోలో గమనించవచ్చు. అనంతరం తన భార్యతో కలిగి డ్రైవ్ చేయడం గమనించవచ్చు. ఈ కారును తన భార్య చాలా ఇష్టపడిందని, తన జీవితంలో కొనుగోలు చేసిన తొలి ఆటోమేటెడ్ కారు ఇదేనని నటుడు ఆశిష్ విద్యా్ర్థి ఈ వీడియోలో చెప్పడం గమనించవచ్చు.
నటుడు ఆశిష్ విద్యార్థి కొనుగోలు చేసిన మహీంద్రా XUV700 కారును 2021 విడుదల అయింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీగా ఆదరణ పొందింది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ 200hp శక్తి, 380Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే 2.2 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జడ్ డీజిల్ ఇంజిన్ 155hp శక్తి, 360Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే ఆశిష్ విద్యార్థి పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఏ కారును కొనుగోలు చేశారో తెలియలేదు.
భద్రతపరంగా ఈ కారు అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది. గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దాంతోపాటు ADAS- అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సహా ఎమర్జెన్సీ బ్రేకింగ్ సహా 7 ఎయిర్‌బ్యాగ్, ABS - యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ESP- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రాం, ISOFIX యాంకర్లు, TPMS- టైర్ ప్రజర్ మోనిటరింగ్ సిస్టమ్ వంటి అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది.

మహీంద్రా XUV700 కారు ఇంటీరియర్ కూడా కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 10.25 అంగుళాల ట్విన్ డిజిటల్ స్క్రీన్‌లు, అడ్వాన్సడ్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్రైమేట్ కంట్రోల్, లెథెరెట్ అప్హోల్స్టరీ, వెనుక ఏసీ వెంట్‌లు, సోనీ స్పీకర్లు వంటి ఆకట్టుకొనే ఫీచర్లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








