అభిమాన హీరో పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్‌.. ఫ్యాన్‌ సర్‌ప్రైజ్‌కు నటుడు ఫిదా.!!

సినిమా హిట్‌ అయితే హీరోలకి దర్శకుడు లేదా నిర్మాత కార్లు ఇంకా ఇతర వాహనాలు గిఫ్ట్‌ ఇవ్వడం చూస్తుంటాం. అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలను కేక్‌లు కట్‌ చేసి, రక్తదానాలు చేసి ఫ్యాన్స్‌ సంబరాలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ అభిమాని మాత్రం కొత్త పంథాలో తన ఫేవరెట్‌ హీరో(Kannada Hero Darshan)కి బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

ఇటీవల కన్నడ భాషలో విడుదలైన కాటేరా(Kaatera) ఘన విజయం సాధించి.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దర్శన్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు తరుణ్‌ సుధీర్‌ దర్శకతం వహించారు. రైతులకు మద్దతుగా నిలబడి పోరాటం చేసే పాత్రలో దర్శన్‌ నటించడంతో.. నటుడికి కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం దర్శనానికి 'భూమిపుత్ర' బిరుదు ఇచ్చి గౌరవించింది.

A-Fan-Gifts-Tractor-To-Darshan

కాగా కన్నడ అభిమానులు ది బాస్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌.. తాజాగా 47 వ పడిలోకి అడుగుపెట్టాడు. బెంగళూరులోని ఆర్‌ఆర్‌ నగర్‌లో నటుడు దర్శన్‌ ఇంట్లో వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రముఖులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి దర్శన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో దర్శన్‌కు పుట్టినరోజు కానుకగా ఓ అభిమాని ట్రాక్టర్‌ను కానుకగా ఇచ్చారు. ఆ కానుకతో దర్శన్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఆకుపచ్చ శాలువా ధరించి, తన నివాసం ముందు తన అభిమానులతో కలిసి దర్శన్‌ ట్రాక్టర్‌ను నడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యాయి. బహుమతి కింద కార్లు, బైక్‌లు, ఇతరత్రా వస్తువులు కాకుండా ఇలా ట్రాక్టర్‌ను బహుమతిగా ఇచ్చి రైతుల గొప్పతనాన్ని వివరించడం నిజంగా అభినందనీయమైని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

A-Fan-Gifts-Tractor-To-Darshan

ఇక దర్శన్‌(Darshan Birthday)కు అభిమాని కానుకగా ఇచ్చిన ఈ ట్రాక్టర్ విషయానికి వస్తే, ఇది ACE కంపెనీకి చెందిన DI-550 STAR మోడల్‌. భారత మార్కెట్లో దీని ధర రూ. 6.70 లక్షల నుంచి రూ. 7.10 లక్షల వరకు ఉంది. ఇంజిన్‌ విషయానికొస్తే ఇందులో 8 ఫార్వర్డ్, 2 రివర్స్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో 50 HP 3 సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఈ ACE DI-550 STAR ట్రాక్టర్ ఫార్వర్డ్ స్పీడ్ గంటకు 34.0 కి.మీ కాగా.. రివర్స్ స్పీడ్ 14.3 కి.మీ వేగంతో ఉంది. ఇది 1800 కిలోల మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. 2,140 మి.మీ కొలతతో వీల్ బేస్‌తో వస్తుంది. ఇది డ్రై డిస్క్ బ్రేక్/ఆయిల్ ఇమ్మర్జ్డ్ బ్రేక్ మరియు డ్యూయల్ క్లచ్ ఆప్షన్‌ను కలిగి ఉంది.

కాగా నటుడు దర్శన్‌ గ్యారేజ్‌లో ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. లగ్జరీ టయోటా వెల్‌ఫైర్ కారు ధర రూ.1.20 నుండి రూ.1.30 కోట్ల మధ్య ఉంటుంది. ఇందులో అధునాతనమైన ఫీచర్లు ఉన్నాయి. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, డిఫెండర్, మినీ కూపర్, హమ్మర్, లంబోర్ఘిని, ఫార్చ్యూనర్,, జాగ్వార్, పోర్షే, ఆడి క్యూ7, మరియు బిఎమ్‌డబ్ల్యూ కార్లు దర్శన్‌ సొంతం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 16, 2024, 11:49 [IST]
English summary
Actor darshan birthday celebrations a fan gifted a tractor to him viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+