ఫేమస్ యాక్టర్ 'దర్శన్' భార్య కొన్న కొత్త కారు ఇదే.. ధర ఎంతో తెలుసా?
కన్నడ స్టార్ హీరో 'దర్శన్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డి-బాస్ అనే పేరుతో పిలువబడుతున్న ఈయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపారీతంగా ఉంది. ఇటీవల దర్శన్ భార్య 'విజయలక్ష్మి' ఖరీదైన కారు కొనుగోలు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఛాలెంజింగ్ స్టార్ 'దర్శన్' (Darshan) ఆటోమొబైల్ ఔత్సాహికుడు. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన దేశీయ కార్లు మరియు అన్య దేశ్య కార్లు ఉన్నాయి. ఇందులో ల్యాండ్ రోవర్ డిఫెండర్, జాగ్వార్, పోర్స్చే, ఆడి క్యూ7, రేంజ్ రోవర్, మినీ కూపర్, లంబోర్ఘిని, జీప్ మరియు బీఎండబ్ల్యూ వంటి కార్లతో పాటు టయోటా వెల్‌ఫైర్ మొదలైనవి ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆయన భార్య విజయలక్ష్మి మరో కారు కొనుగోలు చేసింది.

దర్శన్ భార్య విజయలక్ష్మి కొనుగోలు చేసిన కొత్త కారు రేంజ్ రోవర్ ఎవోక్ అని తెలుస్తోంది. డెలివరీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు అభిమానులు కొత్త కారు కొన్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సరికొత్త రేంజ్ రోవర్ ఎకోవ్ కారు ధర రూ. 67 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఆన్ రోడ్ ధర నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
ఇక విజయలక్ష్మి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ ఎవోక్ విషయానికి వస్తే.. ఈ SUV కేవలం ఒకే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. కానీ పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ యూనిట్ 247 హార్స్ పవర్ మరియు 365 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా ఉత్తంగా ఉంటుంది.
డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులోని 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 201 హార్స్ పవర్ మరియు 403 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రేంజ్ రోవర్ ఎవోక్ యొక్క రెండు ఇంజిన్లు 48 వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతాయి. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. రెండు ఇంజిన్లు అద్భుతమైన పర్ఫామెన్స్ అందించేలా రూపొందించబడి ఉన్నాయని తెలుస్తోంది.
చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ కారు రీడిజైన్డ్ గ్రిల్, ఎల్ఈడీ రన్నింగ్ ల్యాంప్ సిగ్నేచర్‌లతో కూడిన కొత్త సూపర్ స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు వంటి వాటితో పాటు రెడ్ బ్రేక్ కాలిపర్లు మరియు ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు లెదర్ సీట్స్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ మరియు కోల్డ్ అండ్ హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

పైన పేర్కొన్న ఫీచర్స్ మాత్రమే కాకుండా 11.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఓటీఏ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో పాటు పీఎమ్2.5 ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టం మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








