లగ్జరీ BMW 7 సిరీస్‌ కారును కొనుగోలు చేసిన నటుడు ధనుష్‌.. ధర ఎంతంటే..

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ సెడాన్‌ BMW 7-సిరీస్. సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు, ప్రముఖులు ఎక్కువగా ఈ కారును ఇష్టపడుతుంటారు. ఇప్పటికీ బీఎండబ్ల్యూ సెడాన్‌ లగ్జరీ సెడాన్‌ను మునుపటి తరం మోడళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారంటే ఈ కారుకు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రముఖ నటుడు ఈ లగ్జరీ సెడాన్‌ను కొనుగోలు చేశారు.

మార్కెట్లో BMW 7 సిరీస్‌ ప్రస్తుతం ICE, ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో అఅందుబాటులో ఉంది. కాగా ధనుష్‌ కొనుగోలు చేసిన BMW 7 సిరీస్‌ లగ్జరీ కారు విలువ రూ. 1.78 కోట్లు(ఎక్స్‌ షోరూమ్‌) గా ఉంది. దీంతో ధనుష్‌.. ఈ లగ్జరీ సెడాన్‌ను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో చేరిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Dhanush-Buys-BMW-7-Series

క్రేజీ కార్స్‌ చెన్నై.. ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియోను అప్‌లోడ్‌ చేసింది. కాగా ధనుష్‌ కొనుగోలు చేసిన BMW 7 సిరీస్‌.. ఆకర్షణీయమైన ఆక్సైడ్ గ్రే మెటాలిక్ షేడ్‌లో ఉంది. ధనుష్‌ ఈ కారులో వెళ్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. చాలా మంది ప్రముఖులు ఈ కలర్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు..

ధనుష్‌ నడుపుతున్న BMW 7 సిరీస్‌ అప్‌డేటెడ్‌ 2023 మోడల్ సెడాన్‌. ఈ కారు ముందు భాగంలో LED బార్‌లతో కూడిన పెద్ద కిడ్నీ గ్రిల్‌ను చూడవచ్చు. ఈ కారు ఎక్స్‌టరీయర్‌ ఫ్రంట్‌ పరిశీలిస్తే.. హెడ్‌ల్యాంప్ స్ప్లిట్ యూనిట్, కారులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఆల్-LED లైట్లు, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Dhanush-Buys-BMW-7-Series

BMW 7 సిరీస్‌ ఇంటీరియర్‌ విషయానికొస్తే ఉందులో ఆకర్షణీయంగా కనిపిస్తున్న కర్వ్‌డ్‌ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను చూడవచ్చు. మోడ్రన్‌ BMW కార్లలో ఇది మెయిన్‌ ఫీచర్.. కర్వ్డ్ డిస్‌ప్లే 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో వస్తుంది.

BMW i7 మాదిరిగానే, BMW 7- సిరీస్‌ ICE వెర్షన్‌లో రూఫ్-మౌంటెడ్ 31.3-అంగుళాల 8K సినిమా స్క్రీన్ ఉంది. ఇంకా వెనుక డోర్ ప్యాడ్‌లపై 5.5-అంగుళాల టచ్‌స్క్రీన్‌లు ఉన్నాయి. అంతే కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్స్‌, యాంబియంట్ లైటింగ్ సహా అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Dhanush-Buys-BMW-7-Series

ధనుష్‌ కొనుగోలు చేసిన కారు వేరియంట్‌ BMW 7-సిరీస్ 740i M స్పోర్ట్ వేరియంట్. దీని ధర రూ. 1.78 కోట్లుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఈ కారు 3.0-లీటర్, ఇన్-లైన్ సిక్స్-సిలిండర్, ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 375 Bhp, 520 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ లగ్జరీ సెడాన్‌లోని ఇంజిన్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో స్టాండర్డ్‌ ఫీచర్‌గా జత చేయబడి ఉంది. ఈ BMW 7- సిరీస్‌ కారు కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంంది. గరిష్ఠంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

Dhanush-Buys-BMW-7-Series

ధనుష్‌ గ్యారేజ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన BMW 7-సిరీస్‌తో పాటు, రోల్స్ రాయిస్ ఘోస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, ఆడి A8 లగ్జరీ సెడాన్, బ్లాక్ కలర్ ఫోర్డ్ ముస్టాంగ్ GT వంటి అధునాతన లగ్జరీ కార్లు అతని సొంతం.

More from DriveSpark

Article Published On: Thursday, November 23, 2023, 11:05 [IST]
English summary
Actor dhanush buys a brand new luxury sedan bmw 7 series 740i m price features are here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+