ధర్మేంద్ర–ఫియట్ 1100 కారు 65 ఏళ్ల అనుబంధం.. అరుదైన జ్ఞాపకాలు, అమూల్యమైన క్షణాలు!
బాలీవుడ్‌కి ఓ తరం గుర్తుగా నిలిచిన ధర్మేంద్ర (Dharmendra) ఇక లేరు. నిన్న ముంబైలోని తన నివాసంలో చివరి శ్వాస తీసుకున్న ఈ అంతర్జాతీయ క్రేజ్ ఉన్న స్టార్ డిసెంబర్ 8న తన 90వ పుట్టినరోజు జరుపుకునే ముందువారంలోనే మన అందర్ని వదిలి వెళ్లిపోయారు. 1960ల్లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ధర్మేంద్ర, ఆ తర్వాతి ఆరు దశాబ్దాల్లో 300కు పైగా చిత్రాల్లో నటిస్తూ హిందీ సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశారు. తెరపై ఆయన చూపించిన ఆకర్షణ, సరళమైన స్వభావం, ప్రేక్షకులను వెంటాడే వ్యక్తిత్వం ఎంత ప్రత్యేకమో... ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే భావోద్వేగాలతో నిండిపోయి ఉండేది.
ఇదంతా చెప్పుకుంటున్న సందర్భంలో, ధర్మేంద్ర మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కారు ఒకటుంది అదే ఫియట్ 1100. నేటి విలాసవంతమైన కార్ల ర్యాలీలో ఆయన దగ్గర ఎన్నో ఖరీదైన వాహనాలు ఉన్నప్పటికీ, ఈ ఫియట్ 1100 మాత్రం ఆయనకు ఎంతో ప్రియమైనది. ఇది ధర్మేంద్ర జీవితంలో మొదటిసారి స్వంతంగా కొనుగోలు చేసిన కారు. 1960లో, కెరీర్ మొదటిదశలో ఉన్నప్పుడు, ఎంతో శ్రమించి సంపాదించిన డబ్బుతో ఈ కారును కొనుగోలు చేశారు.

ఆ రోజుల్లో ఓ కార్ అనేది సాధారణమైన వస్తువు కాదు. ఒక కల. ఒక విజయానికి సంకేతం. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకునే వస్తువు. ఆ కాలంలో కళాకారుడిగా ఎదుగుతున్న ధర్మేంద్రకు ఈ ఫియట్ 1100 కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు... జీవితం మార్చిన మైలురాయి, తన స్వప్నాల బాటలో మొదటి పెద్ద అడుగు. 65 సంవత్సరాలు గడిచినా ఆయన ఆ కారుని మరచిపోలేదు.
కాలం ఎంత మారినా, సాంకేతికత ఎంత ముందుకెళ్లినా, ఈ ఫియట్ 1100 ఆయనకు గుండెల్లో నిలిచిపోయిన ఓ జ్ఞాపకం. ధర్మేంద్ర తన మొదటి కారైన ఫియట్ 1100 ను ఎంత ప్రేమతో చూసుకున్నాడో ఆయన చెప్పిన ఒక చిన్న సంఘటన ఇప్పటికీ అభిమానులను ఎంతో కదిలిస్తుంది. 1960లో ఆయన ఈ కారును కొనుగోలు చేసిన ధర కేవలం రూ. 18,000 మాత్రమే. అప్పుడు ఆయన కెరీర్ మొదలవుతుండేది.

తాను ఎంతకాలం సినిమాలో నిలదొక్కుకోగలనో ఆయనకే అర్థం కాదు. కాబట్టి, ఈ కారును కొనడం వెనుక ఆయన మనసులో మరో ప్రణాళిక కూడా ఉండేది. సినిమా ఆఫర్లు తగ్గిపోయినా, జీవనోపాధి కోసం ముంబైలో టాక్సీ డ్రైవర్‌గా అయినా పనిచేయొచ్చని ధర్మేంద్ర అనుకున్నారు. ఆ దశలో, ఈ చిన్న ఫియట్ 1100 ఆయనకు ఒక కలల గడియారం, ఒక ఆశాకిరణం, భవిష్యత్తుపై ఒక భరోసా.
సినిమా అవకశాలు లభించకపోతే, ఇదే నా జీవనాధారం అవుతుంది అని ఆయన తన మనసులో ఎన్నిసార్లో అనుకున్నారు. కాని అదృష్టం ఆయనతో ఉంది. ఆయన ఊహించినట్లుగానో, భయపడ్డట్లుగానో పరిస్థితి ఏదీ రాలేదు. పాత్రలు వరుసగా వచ్చాయి, స్టార్‌డమ్ దొరికింది, అభిమానుల ప్రేమ పెరిగింది. సినిమా ప్రపంచంలో ఆయన ఎదగడం వేగంగా జరిగింది. ఆ కారణంగా, తన హృదయానికి దగ్గరైన ఆ ఫియట్ 1100 ను ఆయన ఎప్పుడూ వదులుకోలేదు.
ఒకసారి ధర్మేంద్ర తన ముంబై ఇంటి ముందు నిలబెట్టిన ఆ పాత ఫియట్ 1100తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో ఆయన ఈ కారుతో ఉన్న అనుబంధాన్ని ఎంతో మనోహరంగా వివరించారు. నా బంధువులు కాదు... నా స్నేహితులు కాదు... ఈ కారు మాత్రమే నా జీవితం లోని ఎత్తుపల్లాలను నిజంగా చూసింది అని ఆయన ప్రేమగా చెప్పిన మాటలు అప్పట్లో దేశమంతా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications








