కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

'దిలీప్ జోషి' ఈ పేరు బాలీవుడ్ చలన చిత్ర సీమలో సుపరిచయమే. ప్రధానంగా 'తారక్ మెహతా కా ఊల్తా చష్మా' అనే కామెడీ టీవీ సీరియల్‌లో జెతలాల్ పాత్ర పోషించి మంచి ప్రజాదరణ పొందాడు. అయితే నటుడు 'దిలీప్ జోషి' ఇటీవల దీపావళి శుభ సందర్భంగా కియా (Kia) బ్రాండ్ యొక్క సోనెట్ కారును కొనుగోలు చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

'దిలీప్ జోషి' దీపావళి పండుగ సందర్భంగా తన కుటుంబ సమేతంగా కియా డీలర్‌షిప్‌కి వెళ్లి కొత్త కియా సోనెట్ కారును డెలివరీ తీసుకున్నాడు. అతడు కొనుగోలు చేసిన Kia Sonnet సబ్-కాంపాక్ట్ SUV యొక్క GTX+ ట్రిమ్‌. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 12.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దిలీప్ జోషి కియా సోనెట్ తో ఉన్న ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

దిలీప్ జోషి తన 20 సంవత్సరాల కెరీర్‌లో చిన్న స్క్రీన్ నుండి అనేక బాలీవుడ్ చిత్రాలలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు. బాలీవుడ్ బాద్షా సల్మాన్‌ నుంచి షారుక్‌ ఖాన్ వరకు ప్రతి పెద్ద స్టార్‌తో కూడా కలిసి పనిచేశారు. ఇది నిజంగా అభినందనీయం.

కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

కియా సొనెట్ సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు, అంతే కాకుండా కియా యొక్క సెల్టోస్ తర్వాత భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్ ఈ కియా సోనెట్. కియా సొనెట్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికలరను కలిగి ఉంటుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

కియా సొనెట్ యొక్క విభిన్న వేరియంట్‌లు ఇప్పటికే టెక్‌లైన్ మరియు GT లైన్‌లో తీసుకురాబడ్డాయి. టెక్‌లైన్ ఐదు వేరియంట్‌లను కలిగి ఉంది. అవి HTE, HTK, HTK+, HTS మరియు HTS ప్లస్. ఇక GT లైన్‌లో ఒక వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది GTX ప్లస్.

కియా సొనెట్ మోనోటోన్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్సన్స్ GTX+ మరియు HTX+ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇఇ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి.

కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

కియా సొనెట్ అనేది దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కంపెనీ యొక్క మూడవ మోడల్. అంతే కాదు ఇది ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ SUV కూడా. కియా సొనెట్ ధర రూ. 6.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కాగా, టాప్-ఎండ్ వేరియంట్ (జిటిఎక్స్+ డీజిల్ ఎటి) రూ. 13.55 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది.

కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

కియా సొనెట్‌కి చాలా స్టైలిష్ మరియు స్పోర్టీ లుక్‌తో చాలా ఫీచర్లు మరియు పరికరాలను పొందుతుంది. కియా సొనెట్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, ఫాగ్ ల్యాంప్స్, సిగ్నేచర్ 'టైగర్ నోస్' గ్రిల్, 16-ఇంచెస్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్, రిఫ్లెక్టర్ స్ట్రిప్ మరియు ఫాక్స్ డిఫ్యూజర్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

కియా సొనెట్ మొత్తం మూడు ఇంజన్ ఎంపికలను పొందుతుంది. ఇందులో 1.2-లీటర్ మరియు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇక 1.0-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్ మరియు 172 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ IMT, 7-స్పీడ్ DCT మరియు టార్క్ కన్వర్టర్ ఉన్నాయి. కియా సోనెట్ దాని విభాగంలో డీజిల్ ఇంజిన్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను అందించే ఏకైక ఆఫర్.

కొత్త కారు కొన్న దిలీప్ జోషి: ధర రూ. 12.29 లక్షలు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి కియా మోటార్స్. కియా కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి కూడా మంచి అమ్మకాలతో నిరాఘాటంగా ముందుకు సాగుతోంది. దీనికి ప్రధాన కారణం కంపెనీ అందిస్తున్న ఆధునిక ఫీచర్స్ మరియు డిజైన్ అనే చెప్పాలి.ముందు ముందు కూడా ఈ ఆధునిక SUV మరిన్ని అమ్మకాలతో ముందుకు సాగుతుంది అని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Actor dilip joshi buys kia sonet suv in diwali details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X