BMW లగ్జరీ కారును కొనుగోలు చేసిన హీరో దుల్కర్ సల్మాన్.. సెలబ్రిటీలకు ఈ కారు అంత ఇష్టమా?
సెలబ్రిటీలు ఎక్కువగా లగ్జరీ కార్లంటే మక్కువ చూపిస్తారు. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ ఎక్కువగా పెద్ద కార్లను ఇష్టపడతారు. ఇప్పటికే తన గ్యారేజీలో క్లాసిక్ సహా అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. తాజాగా కొత్త లగ్జరీ BMW సూపర్ కారును కొనుగోలు చేశారు.
టాప్‌గేర్ మ్యాగజైన్ : దుల్కర్ సల్మాన్.. బీబీసీ టాప్‌గేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన తొలి సౌత్ ఇండియన్ నటుడిగా నిలిచాడు. తాజాగా దుల్కర్ సల్మాన్ విలాసవంతమైన BMW 7 సిరీస్ 740i M sport కారును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ కారు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆన్‌రోడ్ ధర రూ.2.18 కోట్లు: దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేసిన BMW 7 సిరీస్ 740i M స్పోర్ట్స్ కారు ధర రూ.1.70 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌లో నటుడు దుల్కర్ సల్మాన్‌కు ఇష్టమైన నంబర్ 369ను గమనించవచ్చు.
ఈ వాహనం నంబర్ TN 06 AH 0369 గా ఉంది. బీఎండబ్ల్యూ BMW 740i అనేది చాలా మంది సెలబ్రిటీలా ఫేవరెట్ మోడల్‌గా మారింది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర 1.70 కోట్లుగా ఉంది. అయితే ఆన్‌రోడ్ ధర రూ.2.18 కోట్లుగా ఉంటుంది.

దుల్కర్ సల్మాన్ ఈ లగ్జరీ కారును చెన్నైలో రిజిస్ట్రేషన్ చేశారు. దీని ద్వారా కొంత నగదును ఆదా చేశారు. నటులు ఆసిఫ్, నివిన్, ఫహద్ నటులు ఈ కారును కేరళలో రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఈ కారు ఆన్‌రోడ్ ధర రూ.2.30 కోట్లుగా ఉంది. చాలా మంది సెలబ్రిటీలు ఎక్కువగా సెడాన్‌లను కొనుగోలు చేస్తారు. ఈ కారు విలాసవంతమైన అనుభూతి సహా రాయల్ లుక్‌ను అందిస్తుంది.
బీఎండబ్ల్యూ 740i M స్పోర్ట్స్ కారు స్ప్లిట్ LED హెడ్‌లైట్ సెటప్ సహా కిడ్ని గ్రిల్ సహా ఇల్యూమినేడెట్ లైట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. సాంప్రదాయక హ్యాండిల్స్‌కు బదులుగా అంతర్గత టచ్‌ప్యాడ్ మరియు ఎలక్ట్రానిక్ మెకానిజంతో కూడిన ఫ్లష్ డోర్ హ్యాండిల్‌ను కలిగి ఉంటుంది.

ఈ లగ్జరీ కారు 19 అంగుళాల స్టాండర్డ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అయితే 22 అంగుళాలకు వీల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకొనే అవకాశాన్ని బీఎండబ్ల్యూ అందిస్తోంది. ఈ కారులో అత్యంత ఆకర్షవంతమైన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంటాయి.
5.4 సెకన్లలో 0-100 kmph వేగం: దుల్కర్ సల్మాన్ తాజాగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 740i M స్పోర్ట్స్ సెడాన్ 3.0 లీటర్, ఇన్‌లైన్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ మరియు 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇంజిన్ 380bhp శక్తి, 520Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








