స్మగ్లింగ్ కేసులో దుల్కర్ సల్మాన్ లగ్జరీ కార్లు స్వాధీనం.. ఇళ్లపై కస్టమ్స్ దాడులు
దేశంలో లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చి, ఇక్కడ రోడ్లపై నడుపుతున్నారనే అనుమానాలపై కస్టమ్స్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ నుమకూర్ అనే పేరు పెట్టి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 23న కేరళలోనే సుమారు 30 ప్రాంతాల్లో అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున సినీ ప్రముఖుల ఇళ్లు కూడా చేరాయి. ముఖ్యంగా మళయాళ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, అమిత్ చొక్కాలకల్ నివాసాలు సోదా చేసిన ప్రాంతాల్లో ఉన్నాయి.
వారి ఇళ్లను తనిఖీ చేయడం వల్ల ఈ విషయంపై ఆసక్తి మరింతగా పెరిగింది. అధికారులు ఇప్పటికే దుల్కర్ సల్మాన్‌కి చెందిన రెండు కార్లను గుర్తించినట్లు తెలిపారు. అయితే పృథ్వీరాజ్ విషయంలో మాత్రం ఎలాంటి వాహనం స్వాధీనం కాలేదని స్పష్టంచేశారు. దుల్కర్ సల్మాన్‌కి చెందిన లగ్జరీ కార్లలో ఒకటి ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ అని తెలుస్తుంది.

ఈ రెండు కార్లు భూటాన్ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. సినీ తారలతో పాటు కొన్ని రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖుల పేర్లు కూడా ఈ కేసులో వినిపించడం మరింత సంచలనం సృష్టిస్తోంది. భూటాన్ నుంచి లగ్జరీ వాహనాల స్మగ్లింగ్ కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది. అసలు విషయం ఏమిటంటే, భూటాన్ సైన్యం వాడి వదిలేసిన వాహనాలను స్థానిక డీలర్లు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
ఆ తరువాత వాటిని ఇండియాకు అక్రమ మార్గాల్లో రవాణా చేసి, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, వ్యాపార వర్గాలకు విక్రయిస్తున్నారని సమాచారం బయటపడింది. ఈ వాహనాలపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండానే, వాటిని స్మగ్లింగ్ చేసి భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చారని అధికారులు చెబుతున్నారు. దీనికోసం హిమాచల్ ప్రదేశ్ మీదుగా దేశంలోకి తాత్కాలిక చిరునామాలు సృష్టించి, ఆ అడ్రస్‌ల పేర్లపై వాహనాలను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా చట్టబద్ధత కలిగిన వాహనాల్లా మారుస్తూ, విశ్వసనీయ కస్టమర్లకు మాత్రమే విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం ప్రకారం, ఈ స్మగ్లింగ్ రాకెట్‌లో కీలకంగా కొందరు డీలర్లు, మధ్యవర్తులు పనిచేస్తున్నారు. వీరు ప్రత్యేకంగా సినీ తారలు, వ్యాపార వర్గాలపై దృష్టి పెట్టి, వారిని టార్గెట్ చేస్తూ కార్లను డీలింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ వాహనాలు అరుదైన మోడల్స్ కావడంతో పాటు, తక్కువ ధరలో లభించడం వల్ల కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో, అధికారులు ఇప్పుడు పెద్ద ఎత్తున విచారణ జరుపుతున్నారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఇలాంటి స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఉందా? మరెన్ని లగ్జరీ వాహనాలు అక్రమంగా వచ్చాయా? అన్న దానిపై కూడా కస్టమ్స్ విభాగం దృష్టి పెట్టింది. ఇప్పటికే మళయాళ సినీ తారల పేర్లు బయటకు రావడం వల్ల ఈ కేసు చుట్టూ ఆసక్తి, ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.

ఇక దుల్కర్ సల్మాన్ వద్ద లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. ఆయన గ్యారేజీలో మయామి బ్లూ పోర్స్చే 911 GT 3, దీని ధర రూ. 3 కోట్ల వరకు ఉంటుంది., ఫెరారీ 296 GTB ధర రూ.5.44 కోట్ల ఎక్స్-షోరూమ్. 2002 BMW M3. రూ.2.54 కోట్ల విలువ కలిగిన మెర్సిడెస్-బెంజ్ SLS AMG, మెర్సిడెస్-AMG G63,VW పోలో GTI వంటి ఇతర కార్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








