లగ్జరీ బెంజ్ కారును కొనుగోలు చేసిన నటుడు ఫహద్ ఫాసిల్.. ఈ కారు ప్రత్యేకతలు తెలుసా?
ఫహద్ ఫాసిల్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. తనదైన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫహద్ ఫాసిల్ సతీమణి నజ్రియా కూడా ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు.
సోషల్ మీడియాలో : తాజాగా నటుడు ఫాసిల్ (Actor Fahadh Faasil) లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ GLS 450 SUVను (Mercedes Benz GLS 450) కొనుగోలు చేశారు. ఫహద్ ఫాసిల్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఈ నటుడు గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా కొనుగోలు చేసిన బెంజ్ GLS 450 SUV ఫోటోను ఫహద్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఫాసిల్ కార్ కలెక్షన్ : అల్లప్పుజాలోని ఫాసిల్ ఇంటికి ఈ కొత్త కారు ఇటీవలే డెలివరీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నటుడు గ్యారేజీలో లంబోర్ఘిని ఉరుస్, రేంజ్ రోవర్, టయోటా వెల్‌ఫైర్, పోర్షే 911 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మరియు ఇటీవలే ఫాసిల్ BMW 740i లగ్జరీ కారును కొనుగోలు చేశారు.
ఆన్‌రోడ్ ధర రూ.1.60 కోట్లు : మెర్సిడెస్ బెంజ్ GLS 450 కారు ధర రూ.1.23 కోట్లు (ఎక్స్‌షోరూం- కేరళ)గా ఉంది. అయితే ఈ కారు ఆఫ్ రోడ్ ధర సుమారుగా రూ.1.60 కోట్లుగా ఉంది. ఈ కారు 3.0 లీటర్ టర్బో ఛార్జడ్ ఇన్‌లైన్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ GLS ఇంజిన్ 367 bhp శక్తి, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది. దీంతోపాటు ఈ SUV 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ కారు మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఫీచర్లు : మెర్సిడెస్ బెంజ్ GLS 450 SUV డ్యాష్‌బోర్డ్ 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌తో మెర్సిడెస్ MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు టచ్‌ప్యాడ్‌లతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ మరియు సెంటర్ కన్సోల్‌లో టచ్‌ప్యాడ్‌లున్నాయి. వీటితోపాటు అడ్జస్టబుల్ ఎయిర్ సస్పెన్షన్ సహా ఇతర కీలక ఫీచర్లున్నాయి.

ఈ కారు పెద్ద ఫ్రంట్ గ్రిల్ లుక్, న్యూ ఏజ్ స్టైలింగ్, ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లు, ఫ్రంట్ గ్రిల్ అప్లికేషన్లు, ఎగ్జాస్ట్ సరౌండ్ మరియు టెయిల్ గేట్ బార్‌లు సహా ఇతర భాగాలు క్రోమ్ ఫినిషింగ్‌తో వస్తాయి. దీంతోపాటు 21 అంగుళాల 5 ట్రిపుల్ స్పోక్ లైట్ అల్లాయ్ వీల్స్ మరింత మెరుగైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








