జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లైఫ్‌లోకి జీప్ కంపాస్

Written By:
Recommended Video - Watch Now!
Fire Accident In Chengicherla, Telangana | Petrol Tanker Blast

బాలీవుడ్ అందాల తార, శ్రీలంక నుండి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనదైన నటనా శైలితో కుర్రకారు మతి పోగొడుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జీప్ కంపాస్ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

కోట్ల రుపాయలు ఆర్జించే సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే భలే క్రేజ్. కానీ ఈ శ్రీలంక భామ ఫెర్నాండెజ్ మాత్రం లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జీప్ విడుదల చేసిన సరసమైన కంపాస్‌ను ఎంతో ఇష్టంగా ఇంటికి తీసుకెళ్లింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

కానీ జాక్వెలిన్ మాత్రం లగ్జరీ కార్ల జోలికెళ్లకుండా ఈ సారి హాట్ లుక్‌లో కంపాస్ ఎస్‌యూవీని సొంతం చేసుకుంది. జీప్ కంపాస్ కొనుగోలు చేసిన అనంతరం హాట్ హాట్‌గా కంపాస్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

వైట్ కలర్ మరియు వైట్, గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉన్న డ్రెస్సుల్లో రెడ్ కలర్ కంపాస్‌తో కుర్ర కారును మత్తెక్కించే ఫోజుల్లో సెల్ఫీలు దిగింది ఈ భామ. జాక్వెలిన్ ఫోటోలు దిగిన తీరును చూస్తే కంపాస్‌ను కొన్నట్లు లేదు, జీప్ ఇండియానే జాక్వెలిన్‌కు గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

జీప్ ఇండియా కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కంపాస్ ఎస్‌యూవీని కొనుగోలు చేసినట్లు తమ అధికారిక సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. ఎరుపు రంగులో ఉన్న కంపాస్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ఎస్‌యూవీని అని తెలిసింది.

Trending On DriveSpark Telugu:

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

బేబీ డాల్ సన్నీలియోన్ హాట్ కార్ కలెక్షన్

మాల్యా పాపం పండిన రోజు: కోట్లు విలువ చేసే అరుదైన కార్లు వేలం

ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా ?

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

అమెరికాకు చెందిన జీప్ ఇండియన్ మార్కెట్లోకి 2017లో కంపాస్ ఎస్‌యూవీని పోటితత్వమున్న ధరల శ్రేణిలో లాంచ్ చేసింది. విడుదలైన అనతి కాలంలోనే జీప్ ఇండియాకు కంపాస్ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

ఈ సెగ్మెంట్లో ఇప్పటికీ జీప్ కంపాస్ సెగ్మెంట్ లీడర్‌గా రాణిస్తోంది. జీప్ కంపాస్ విపణిలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500, హ్యుందాయ్ టక్సన్ మరియు టాటా హెక్సా ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

సాంకేతికంగా జీప్ కంపాస్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. 2-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

పెట్రోల్ వెర్షన్ కంపాస్ ఎస్‌యూవీలో 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 1.4-లీటర్ కెపాసిటి గల టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

భారత్‌ రైట్-హ్యాండ్-డ్రైవ్ కంపాస్ వాహనాలకు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా నిలిచింది. దేశీయంగా తయారైన జీప్ కంపాస్ అత్యంత పోటీతత్వమున్న ధరలతో విపణిలో కీలక పాత్ర పోషిస్తోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

జీప్ ఇండియా కుడిచేతి వైపు డ్రైవింగ్ సిస్టమ్ ఉన్న కంపాస్ ఎస్‌యూవీని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ రంజన్ గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. మరియు ఈ వాహనాలను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అమెరికా లగ్జరీ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ జీప్‌కు ఇండియన్ మార్కెట్లో కంపాస్ ఎస్‌యూవీ మోస్ట్ సక్సెస్‌‍ఫుల్ మోడల్. ఇప్పుడు జీప్ కంపాస్ ఓనర్ల జాబితాలోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వచ్చింది. జీప్ ఇండియా బ్రాండ్‌కు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారే అవకాశం కూడా ఉంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖాతాలో జీప్ కంపాస్

జీప్ కంపాస్ అద్వితీయమైన పనితీరు మరియు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం జీప్ కంపాస్ ధరల శ్రేణి రూ. 15.16 లక్షల నుండి రూ. 21.91 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Actor Jacqueline Fernandez’s New Ride Is A Jeep Compass SUV. Read In Telugu

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark