రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

సాధారణంగా కార్లు మరియు బైకులంటే అందరికి ఇష్టమే. కానీ ఆ ఇష్టం కాస్త సెలబ్రెటీలకు మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లను మరియు బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ 'పంచాయత్' వెబ్ సిరీస్‌ నటుడు జితేంద్ర కుమార్ కొత్త మిని కంట్రీమ్యాన్ కారుని కొనుగోలు చేసాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

'పంచాయత్' వెబ్ సిరీస్‌ ద్వారా బాగా పాపులర్ అయిన 'జితేంద్ర కుమార్' ఇటీవల మినీ కంపెనీకి చెందిన కంట్రీమ్యాన్ కారు కొనుగోలు చేశారు. జితేంద్ర కుమార్ కొనుగోలు చేసిన ఈ కొత్త కారు ధర రూ. 42 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇతడు 2022 మినీ కంట్రీమ్యాన్ ఎడిషన్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

జితేంద్ర కుమార్ కొనుగోలు చేసిన మినీ కంట్రీమ్యాన్ కారు వైట్ సిల్వర్ కలర్ స్కీమ్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారుని అతడు ముంబైలోని మినీ మరియు బిఎండబ్ల్యు యొక్క డీలర్ షిప్ ఇన్ఫినిటీ కార్స్ ద్వారా డెలివరీ చేసుకున్నాడు.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

జీతూ భయ్యాగా పిలువబడే 'జితేంద్ర కుమార్' ది వైరల్ ఫీవర్ (TVF) తో ప్రసిద్ధి చెందిన తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క 'పంచాయత్' వెబ్ సిరీస్‌ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ యొక్క రాబోయే చిత్రం మెజీషియన్‌లో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

మినీ కంపెనీ యొక్క కంట్రీమ్యాన్ భారతదేశంలో మినీ కూపర్ 3 డోర్ హాచ్, మినీ కూపర్ ఎస్ఈ 3 డోర్, మినీ కన్వర్టిబుల్, మినీ ఎలక్ట్రిక్ మరియు మినీ జాన్ కూపర్ వర్క్స్ వంటి వేరియంట్‌లలో విక్రయించబడుతోంది. అయితే ఈ వేరియంట్లలో మినీ కంట్రీమ్యాన్ అనేది పెద్దది మరియు 5-డోర్ సెటప్‌ను పొందుతుంది. కావున ఇది మునుపటి వేరియంట్లకంటే కూడా పెద్దదిగా ఉండటమే కాకుండా వహా వినియోగదారులకు మరింత అనుకూలంగా ఉంటుంది.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

మినీ కంట్రీమ్యాన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ మోటిఫ్‌తో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌ వంటి వాటిని పొందుతుంది. స్టాండర్డ్ 17-ఇంచెస్ వీల్స్‌తో పోలిస్తే మినీ జాన్ కూపర్ వర్క్స్ ఇన్‌స్పైర్డ్ వేరియంట్ స్పోర్టియర్ బంపర్‌లు, రియర్ స్పాయిలర్ మరియు పెద్ద 18-ఇంచెస్ వీల్స్‌తో స్పోర్టియర్ లుక్‌ను పొందుతుంది.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

మినీ కంట్రీమ్యాన్ కారు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 192 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 7.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

మినీ కంట్రీమ్యాన్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి సేజ్ గ్రీన్, వైట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, చిల్లీ రెడ్ మరియు ఐలాండ్ బ్లూ కలర్స్. ఐలాండ్ బ్లూ కలర్స్ అనేది కేవలం JCW ఇన్‌స్పైర్డ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

ఇదిలా ఉండగా ఇటీవల మినీ కంపెనీ తన 'మినీ కూపర్ ఎస్ఇ' ఎలక్ట్రిక్ కారు యొక్క సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభించింది. రెండవ బ్యాచ్ లో 40 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. కావున ఈ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. మిని ఇండియా విడుదల చేసిన 'మినీ కూపర్ ఎస్ఇ' ధర విడుదల సమయంలో రూ. 47.20 లక్షలు.

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మినీ కంపెనీకి చెందిన ఈ కంట్రీమ్యాన్ అనేది ఎక్కువమంది సెలబ్రెటీలు కొనుగోలు చేసే బ్రాండ్ కారు. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, మంచి పనితీరుని అందిస్తుంది. ప్రస్తుతం జితేంద్ర కుమార్ కొనుగోలు చేసిన ఈ కారుని, గతంలో ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా కొనుగోలు చేశారు.

Article Published On: Saturday, July 9, 2022, 15:32 [IST]
English summary
Actor jitendra kumar buys mini countryman price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+