ఇంధ్రభవనం లాంటి లగ్జరీ కారును కొన్న కమల్ హాసన్.. దీంతో రోడ్డుపై వెళ్తుంటే ఆ మజాయే వేరు!
భారతీయ సినిమా పరిశ్రమలో అగ్ర నటుడు కమల్ హాసన్(kamal haasan) ఒకవైపు సినిమాలు చేస్తూనే అటూ రాజకీయాల్లో కూడా తిరుగుతున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళంతో పాటు ఇతర భాషల్లో నటించి దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించారు. సినిమాలు, రాజకీయాల గురించి ప్రక్కన పెడితే కమల్ హాసన్‌కు ప్రత్యేకంగా లగ్జరీ కార్లంటే అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో కోట్లు విలువ చేసే చాలా కార్లు ఉన్నాయి. తాజాగా ఈ అగ్ర నటుడు మరో అధునాతన విలాసవంతమైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.
తన ప్రయాణాల కోసం కమల్ హాసన్ లెక్సస్ LM 350h MPV మోడల్‌ను కొన్నారు. ఇది భారతీయ మార్కెట్లో ఖరీదైన మోడల్. తాజాగా ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో యాక్టర్ కమల్ హాసన్ న్యూ లెక్సస్ కారు అని క్యాప్షన్‌ను కూడా పైన జోడించారు. రోడ్డుపై ఈ కారు వెళ్తుంటే ఒక తెల్లటి ఇంద్రభవనం వెళ్తున్నట్లు అనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ కారు గురించి ఆటో ఔత్సాహికులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమలో లగ్జరీ కార్లు విడుదల చేయడంలో లెక్సస్ (Lexus) చాలా ప్రసిద్ధి చెందిన కంపెనీ. ఇప్పుడు కమల్ హాసన్ కొత్త కారు విలాసవంతంగా, డజన్ల కొద్ది లగ్జరీ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ లెక్సస్ LM 350h MPV ధర భారతీయ మార్కెట్లో దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలుకు లభిస్తుంది.
పన్నులు, బీమా ఖర్చులు వంటి వాటితో కలిపి మొత్తంగా ఆన్‌రోడ్ వచ్చేసరికి దాదాపు రూ. 2.63 కోట్ల నుంచి రూ. 3.29 కోట్ల వరకు ఉంది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ లగ్జరీ కారును కొనుగోలు చేశారంటే కమల్ హాసన్‌కు కార్లు అంటే ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. ఈ నటుడు కారు గురించిన ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.5-లీటర్, 4-సిలిండర్ల బలమైన హైబ్రిడ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

ఈ కారులో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. 250 bhp పవర్, 239 గరిష్ట టార్కును దీని ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ లెక్సస్ లగ్జరీ MPVలో eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. దీని మైలేజ్ విషయానికి వస్తే, 19 కి.మీల వరకు అందిస్తుందని కంపెనీ తెలిపింది. లగ్జరీ పేరుకు తగ్గట్టుగానే లోపల అధునాతన ఫీచర్స్ ఉంటాయి. రీడింగ్ లైట్లు, వానిటీ మిర్రర్లు, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు వంటి వాటిని అందించారు.
ఇంకా ఫోల్డ్-అవుట్ టేబుల్స్, USB పోర్ట్‌లు, డ్యూయల్ సన్‌రూఫ్, 48-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, HVAC టచ్‌స్క్రీన్ కంట్రోలర్, చిన్న ఫ్రిజ్, అంబ్రెల్లా హోల్డర్, ఇంటీరియర్‌ను అందంగా చూపించే ప్రత్యేక లైటింగ్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 23-స్పీకర్ ఆడియో సిస్టమ్, రియర్ కంపార్ట్‌మెంట్ పార్టిషన్, సేఫ్టీకి ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ADAS టెక్, ABS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ కారు VIP,అల్ట్రా లగ్జరీ అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. కమల్ హాసన్ 4-సీట్ల వెర్షన్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దీన్ని పూర్తిగా విదేశాలలో తయారు చేయబడి దిగుమతి చేసినట్లు సమాచారం. ఈ ఎంపీవీ ఎక్స్‌టీరియ్ డిజైన్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సరికొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, LED టెయిల్ లైట్లు వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








