కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

సాధారణంగా ఎవరికైనా వాహనాలంటే చాలా ఇష్టం. కానీ ఈ ఇష్టం అనేది సెలబ్రెటీలకు మరికాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వారు ఎప్పటికప్పుడు తమకు ఇష్టమైన వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు.

Recommended Video

భారత్‌లో విడుదలైన 2022 Hyundai Tucson | వివరాలు

ఇందులో భాగంగానే బాలీవుడ్ యాక్టర్ 'కరణ్ కుంద్రా' (Karan Kundrra) అమెరికన్ బ్రాండ్ అయిన జీప్ కంపెనీ యొక్క 'వ్రాంగ్లర్ రూబికాన్' (Wrangler Rubicon) ను ఇటీవల కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు దీనికి మరిన్ని హంగులు జోడించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

సాధారణంగా ఆఫ్ రోడింగ్ సామర్థ్యం ఎక్కువగా ఉన్న వాహనాల్లో జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ఒకటి. ఈ కారణంగానే ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే 'కరణ్ కుంద్రా' కొనుగోలు చేసిన ఈ ఆఫ్ రోడర్ వ్రాంగ్లర్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్. కావున దీని ధర రూ. 60.30 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

కరణ్ కుంద్రా కొనుగోలు చేసిన ఈ ఆఫ్ రోడర్ SUV సర్జ్ గ్రీన్ కలర్ లో చూడచక్కగా ఉంది. కాగా ఇప్పుడు ఈ కారులో కొన్ని ఎక్స్టీరియర్ అప్డేట్స్ చేసుకున్నాడు. ఇవన్నీ ఈ SUV ని మరింత ఆధునికంగా చూపిస్తాయి.

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

ఇందులో స్టాక్ బంపర్ తొలగించబడింది. ఇది ఆఫ్టర్ మార్కెట్ ఆఫ్-రోడ్ బంపర్ తో భర్తీ చేయబడింది. ఇది మెటల్ బంపర్ లాగా కనిపించదు. అయితే, దీనిలో ఒక మెటల్ బార్ ఇంటిగ్రేట్ చేయబడింది. ఫ్రంట్ బంపర్ పై హుక్స్ ఉంచబడ్డాయి. ఫాగ్ ల్యాంప్ లు కొత్త బంపర్ లో ఇంటిగ్రేట్ చేయబడతాయి. ఇందులో ఇప్పుడు ఒక మెటల్ స్కిడ్ ప్లేట్ మరియు రిట్రాక్టబుల్ ఫుట్ బోర్డు వంటివి ఉన్నాయి. కావున ముందు నుంచి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

ఈ జీప్ వ్రాంగ్లర్ లో ఎక్కువగా ఆకర్శించేవి దాని చక్రాలు. ఇందులో ఉండే స్టాక్ అల్లాయ్ వీల్స్ ఆఫ్టర్ మార్కెట్ యూనిట్ తో రీప్లేస్ చేయబడ్డాయి. వీటి సైజ్ సాధారణంగా ఉండేదానికంటే కొంత పెద్దగా ఉందనిపిస్తుంది. అల్లాయ్ వీల్స్ బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడతాయి. అదే సమయంలో ఇందులో వీల్స్ చంకీ ఆఫ్-రోడ్ స్పెక్ టైర్లను పొందుతాయి. ఇవి కాకూండా ఇందులో పెద్దగా మార్పులు జరగలేదు.

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

జీప్ వ్రాంగ్లర్ యొక్క రూబికాన్ విషయానికి వస్తే, ఇందులో అన్లిమిటెడ్ వేరియంట్ ధర రూ. 56.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే రూబికాన్ ధర రూ. 60.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇవి రెండు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది మొత్తమ్ 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి బ్లాక్, గ్రానైట్ క్రిస్టల్, స్టింగ్ గ్రే, ఫైర్ క్రాకర్ రెడ్ మరియు బ్రైట్ వైట్ కలర్స్.

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

జీప్ వ్రాంగ్లర్ 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో అందించబడతాయి. ఇది 268 పిఎస్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4డబ్ల్యుడి సిస్టమ్ తో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడింది. కావున పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో జీప్ వ్రాంగ్లర్ యొక్క 5-డోర్ వెర్షన్ మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంది.

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

జీప్ వ్రాంగ్లర్ SUV లో ఆల్-ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ లో 8.4 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా ఇందులో పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ అపోల్స్ట్రే వంటివి కూడా ఉన్నాయి. ఇందులో రిమూవబుల్ డోర్ సిస్టమ్‌మాత్రమే కాకుండా హార్డ్ టాప్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్ వంటివి ఉన్నాయి.

కరణ్ కుంద్రా 'జీప్ వ్రాంగ్లర్' ఇప్పుడు మరింత కొత్తగా మారింది.. చూసారా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

జీప్ రాంగ్లర్ అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUV లలో ఒకటి. కావున ఎక్కువమంది సెలబ్రెటీలు కొనుగోలు చేస్తూ ఉంటారు. కరణ్ కుంద్రా జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ కాకుండా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ మరియు పాత తరం ఫోర్డ్ ఎండీవర్ SUV వంటివి కూడా కలిగి ఉన్నాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మరియు ఎప్పటికప్పుడు కొత్త బైకులు & కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 20, 2022, 12:44 [IST]
English summary
Actor karan kundrra shared images of his jeep wrangler rubicon with modifications details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+