తన మొదటి కారు గురించి పెదవి విప్పిన 'కార్తిక్ ఆర్యన్'.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ నటుడు 'కార్తీక్ ఆర్యన్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే 'ప్యార్ కా పంచనామా' సినిమాతో బాలీవుడ్ చిత్రసీమలో అడుగుపెట్టిన ఇతడు ఈ రోజు అగ్ర కథానాయకుల్లో ఒకరుగా ఉన్నారు. అంతే కాకుండా మనం గతంలో కూడా కార్తిక్ ఆర్యన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అయితే ఈ రోజు కార్తిక్ ఆర్యన్ గురించి చాలామందికి తెలియని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

నిజానికి ఈ రోజు కార్తిక్ ఆర్యన్ అగ్రస్థాన కథానాయకులో ఒకరుగా ఉన్నప్పటికీ, తన ప్రారంభం దశలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు ఇటీవల బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మొదటిసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని సినిమాలలో నటించిన తరువాత ఒక థర్డ్ హ్యాండ్ కారు కొన్నట్లు తెలిపాడు. అప్పుడు ఆ కారు ధర రూ. 60,000 నుంచి రూ. 65,000 వరకు ఉంది. దీనిని కొనడానికి చాలా కట్సపడ్డానని చెప్పుకొచ్చాడు.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

అంతకు ముందు కార్తిక్ ఆర్యన్ కి సొంతంగా కారు లేదు. కాబట్టి ఎక్కువగా బస్సుల్లో లేదా ప్రజారవాణాలో ప్రయాణించేవాడినని, అప్పుడప్పుడు ఎవరిదగ్గరైనా బైక్ తీసుకుని రెడ్ కార్పెట్ ఫంక్షన్లకు వెళ్ళేవాడినని కూడా చెప్పాడు. అప్పుడు కొనుగోలు చేసిన కారుకి డ్రైవర్ కూడా లేదు, సొంతంగా డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాడినని తెలిపాడు. కారు కొనడానికి ముందు ఆటోలో లేదా ఎవరినైనా లిఫ్ట్ అడిగి రెడ్ కార్పెట్ ఈవెంట్లకు వెళ్ళేవాడిని.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

ఆ థర్డ్ హ్యాండ్ కారుకి డ్రైవర్ వైపు ఉన్న డోర్ కూడా పనిచేసేది కాదు, కాబట్టి ప్యాసింజెర్ వైపు ఉన్న డోర్ ద్వారా బయటకు, లోపలకు వెళ్ళేవాడిని. అయితే నేను దానికే అలవాటు పడిపోయాను. అందులోనే వర్షం కురిసినప్పుడు డ్రైవర్ సీటుపైన నీరు కారేదని తన గతాన్ని చెప్పుకొచ్చాడు.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

అయితే కార్తీక్ ఆర్యన్ 2021 ఏప్రిల్ నెలలో 'లంబోర్ఘిని ఉరుస్' కారును కొనుగోలు చేసాడు. కార్తీక్ ఆర్యన్ కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరుస్ కారు ధర రూ. 3.1 కోట్లు. కార్తీక్ కొనుగోలు చేసిన ఈ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ బ్లాక్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కొత్త కారుతో ఉన్న వీడియోను కూడా ఆర్యన్ షేర్ చేసాడు. ఈ వీడియోలో అతను చాలా సరదాగా ఉన్నట్లు చూడవచ్చు.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని కలిగి ఉన్న బాలీవుడ్ ప్రముఖుల జాబితాలో చేరాడు. కార్తీక్ ఆర్యన్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కొత్త మినీ కూపర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

ఇదిలా ఉండగా కార్తిక్ ఆర్యన్ ఇటీవల అత్యంత ఖరీదైన 'మెక్‌లారెన్ జిటి' (McLaren GT) సూపర్ కారుని టి-సిరీస్ చైర్‌పర్సన్ భూషణ్ కుమార్ నుంచి గిఫ్ట్ గా పొందాడు. ఈ సూపర్ కార్ ధర రూ. 3.73 కోట్లు. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా 2 సినిమా భారీ విజయాన్ని సాధించి రూ. 180 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ కారణంగానే కార్తీక్ ఆర్యన్ ఖరీదైన కారు గిఫ్ట్ గా లభించింది.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

కార్తీక్ ఆర్యన్ తాను గిఫ్ట్ గా పొందిన ఈ 'మెక్‌లారెన్ జిటి' (McLaren GT) కారుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ చైనీస్ ఫుడ్ తినడానికి కొత్త టేబుల్‌ గిఫ్ట్ గా లభించిందని, కష్టానికి ప్రతిఫలం ఇంత ఖరీదైనదిగా ఉంటుందని తానూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. నెక్స్ట్ టైమ్ ప్రైవేట్‌ జెట్‌ గిఫ్ట్‌ ఇవ్వండి సర్‌ అంటూ రాసాడు. మొత్తానికి కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు ఇండియాలోనే మొట్టమొదటి మెక్‌లారెన్‌ జీటీ ఓనర్ అయ్యాడు.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

మెక్‌లారెన్ జిటి సూపర్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కలిగి ఉంది. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌ పొందుతుంది. ఇంజిన్ 611 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో పవర్ ఓపెన్ డిఫరెన్షియల్ ద్వారా పవర్ వెనుక చక్రాలకు మళ్లించబడుతుంది. కావున ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది.

తన మొదటి కారు గురించి పెదవి విప్పిన కార్తిక్ ఆర్యన్.. ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కార్తిక్ ఆర్యన్ తాను కొనుగోలు చేసిన కారు గురించి ప్రస్తావించాడు, కానీ అది ఏ కారు అనేది మాత్రం తెలియజేయలేదు. అయితే ఒకప్పుడు థర్డ్ హ్యాండ్ కారు కొన్న ఈ నటుడు ఈ రోజు ఆధునిక లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన సెలబ్రెటీలలో ఒకరుగా ఉన్నారు. ఇలాంటి ఆసక్తికమైన విషయాలను మరియు కొత్త కార్లు & బైకులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2022, 8:00 [IST]
English summary
Actor kartik aaryan revealed about his first car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+