రూ.2.03 కోట్ల సూపర్ కారును కొనుగోలు చేసిన హీరో కిచ్చా సుదీప్.. కారులో ఎన్నో ప్రత్యేకతలు!
కిచ్చా సుదీప్ (Actor kichcha sudeep) పరిచయం అవసరం లేని పేరు. కన్నడ సినిమా పరిశ్రమ సహా ఇతర భాషల సినిమాల్లో తనదైన శైలి నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి నటుడిగా కొనసాగుతున్నారు. కిచ్చా సుదీప్ మంచి నటుడుగానే కాకుండా గాయకుడిగానూ గుర్తింపు పొందారు.
చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే హీరో సుదీప్‌కు కార్లంటే చాలా ఇష్టం. తాజాగా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పోర్షే పనామెరా జీటీఎస్ (Porsche panamera GTS) కారును ఇటీవల కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ.2.03 కోట్లుగా (ఎక్స్‌షోరూం)గా ఉంది. ప్రస్తుతం ఈ కారు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

గంటకు 300 కి.మీ వేగం: సుదీప్ కొనుగోలు చేసిన కారు పోర్షే పనామెరా GTS (kichcha sudeep new car) 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 473bhp శక్తి, 620Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.9 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ సూపర్ కారు గరిష్ఠ వేగం గంటకు 300 కి.మీగా ఉంది.
ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పొడవాటి వీల్‌బేస్ సహా క్యాబిన్‌లో కూర్చొనేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతోపాటు ఈ కారు 20 లేదా 21 అంగుళాల టైర్లను కలిగి ఉంటుంది. ఈ సూపర్ కారు ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

స్పోర్టియర్ లుక్ కోసం ఫ్రంట్ ఆప్రాన్‌కు ట్వీక్‌లు, ప్రత్యేకంగా రూపొందించిన టెయిల్‌లైట్లు మరియు ఫ్రంట్ డోర్‌లపై ప్రత్యేత లోగోలతో మరింత భిన్నంగా ఉంటుంది. మ్యాట్రిక్ ఫక్షనాలిటీతో కూడిన LED లైట్ల ఆప్షనల్‌గా వస్తుంది. దీంతోపాటు పోర్షే డైనమిక్ లైట్ సిస్టమ్ ప్లస్‌తో వస్తుంది. ఈ కారు అడాప్టివ్ రియర్ స్పాయిలర్ GTSను రెండుగా విభజిస్తుంది.
ఈ కారు ఇంటీరియల్ చాలా విలాసవంతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అడాప్టివ్ సీటింగ్ సిస్టమ్, అనేక పర్సనలైజేషన్ ఆప్షన్లతో వస్తుంది. బ్లాక్ యానోడైజడ్ డోర్ స్టిల్స్ మరియు అల్కంటారా లెదర్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు భారీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

లగ్జరీ సహా స్పోర్ట్స్ మోడల్ కార్లను ఇష్టపడే హీరో కిచ్చా సుదీప్ గ్యారేజీలో ఇప్పటికే BMW M5 కాంపిటేషన్, టయోటా వెల్‌ఫైర్ సహా వోల్వో XC90 SUV కార్లను కలిగి ఉన్నారు. తాజాగా ఈ గ్యారేజీలో పోర్షే కారు వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








