కూతురు కళ్ళలో ఆనందం కోసం.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
సినీరంగంలోని వారికి రెమ్యునరేషన్స్ భారీగానే ఉంటాయని అందరికి తెలుసు. దీంతో వారు ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే తమిళ సినీపరిశ్రమకు చెందిన 'కొట్టాచి' తన కూతురికి కారు గిఫ్ట్ ఇచ్చారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొట్టాచి తన కూతురు 'మనస్వి కొట్టాచి'కి కియా కంపెనీకి చెందిన సోనెట్ SUVని గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొట్టాచి ఫ్యామిలీ కారును డెలివరీ తీసుకోవడం వంటివి చూడవచ్చు. నెటిజన్లు వీరికి పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వీడియోను మనస్వి తండ్రి కొట్టాచి షేర్ చేశారు.

ఇమైక్క నొడిగళ్ అనే సినిమాలో నయనతార కుమార్తెగా నటించిన మనస్వి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. ఈమె తండ్రికి పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ.. మనస్వి మాత్రం పెద్ద హీరోలతో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకులను అలరిస్తోంది. ఎప్పటి నుంచి పెద్ద కారును సొంతం చేసుకోవాలనుకుంటున్న మనస్వి కలను.. ఈమె తండ్రి కొట్టాచి నిజం చేశారు.
వీడియోలో గమనించినట్లయితే.. కొట్టాచి ఫ్యామిలీ కారును కొనుగోలు చేయడానికి డీలర్‌షిప్‌కు రావడం చూడవచ్చు. మనస్వి డీలర్‌షిప్ సిబ్బందితో మాట్లాడటం చూడవచ్చు. కారు కొనుగోలు సంబంధించిన డాక్యుమెంట్ వర్క్ మొత్తం పూర్తయిన తరువాత మనస్వి ఫ్యామిలీ కారుపైన కప్పి ఉంచిన గుడ్డను తొలగించి, కారును ఆవిష్కరిస్తారు. వీరు నలుపు రంగులో ఉన్న కియా సోనెట్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మనస్వి ఫ్యామిలీ కొన్న కారు కియా సోనెట్ టెక్ లైన్ వెర్షన్ అని తెలుస్తోంది. బంపర్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. అయితే జీటీ లైన్ వేరియంట్స్ స్కిడ్ ప్లేట్ కోసం భిన్నమైన డిజైన్ పొందుతాయి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణపొందిన సబ్ 4 మీటర్స్ కార్ల విభాగంలో సోనెట్ చెప్పుకోదగ్గ మోడల్. ఇది ఈ ఏడాది ప్రారంభంలోనే అప్డేట్స్ పొందింది. కాబట్టి ఈ SUV చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
కొత్త కియా సోనెట్ చూడటానికి అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు ఇప్పుడు మరింత స్పోర్టీ డిజైన్ పొందుతుంది. టెయిల్‌గేట్‌లో కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ లైట్ బార్ ఇందులో గమనించవచ్చు. ఇవి కాకుండా మిగిలిన డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే కొంత అప్డేటెడ్ డిజైన్ మాత్రం కనిపిస్తుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. కియా సోనెట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్రిక్ సన్‌రూఫ్, లెథెరెట్ అపోల్స్ట్రే, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లు, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి మరెన్నో ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి మరియు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్ విషయంలో ఎటువంటి మార్పు లేదు. అదే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. కియా సోనెట్ ధరలు రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.75 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








