నేనొక్కడినే ఫేమ్ క్రితి సనన్ ఖాతాలో అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ
ఢిల్లీలో పుట్టి పెరిగిన క్రితి సనన్ సినీ రంగానికి పరిచయం అయ్యింది మన తెలుగు సినీ పరిశ్రమ ద్వారానే. మహేష్ బాబు సరసన వన్ సినిమాలో నటించిన క్రితి సనన్ ఇప్పుడు ఖరీదీన ఆడి క్యూ7 లగ్జరీ ఓనర్ల జాబితాలోకి చేర
Recommended Video

ఇండియాలో పెద్ద పెద్ద లగ్జరీ ఎస్‌యూవీలకు ఇండియన్ సెలబ్రిటీలు వీరాభిమానులు. ఈ కారణంతోనే ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీల వృద్ది ప్రతి ఏడాది అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మన ఇండియాలో సెలబ్రిటీలంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది బాలీవుడ్ గురించి. ఒకటి రెండు సినిమాలతోనే స్టార్‌డమ్ సంపాదించేసుకుంటారు. అందులో ఒకటి క్రితి సనన్.

ఢిల్లీలో పుట్టి పెరిగిన క్రితి సనన్ సినీ రంగానికి పరిచయం అయ్యింది మన తెలుగు సినీ పరిశ్రమ ద్వారానే. మహేష్ బాబు సరసన వన్ సినిమాలో నటించిన క్రితి సనన్ ఇప్పుడు ఖరీదీన ఆడి క్యూ7 లగ్జరీ ఓనర్ల జాబితాలోకి చేరిపోయింది.

ఏ సెలబ్రిటీ ఇంటిలో చూసినా జర్మన్ దిగ్గజం ఆడి విక్రయించే ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ఎస్‌యూవీ క్యూ7 ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. సినీ సెలబ్రిటీలు, క్రికెట్ ప్లేయర్లు, బిజినెస్‌మ్యాన్‌ల నుండి పొలిటీషియన్స్ వరకు ఇలా ఎంతో మంది ఫేవరెట్ ఎస్‌యూవీ ఆడి క్యూ7.

మొదటిసారిగా తెలుగు చిత్రంతో కెరీర్ ప్రారంభించి, తరువాత బాలీవుడ్‌లో దిల్‌వాలే మరియు హీరోపంతి సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ బాలీవుడ్ నటీమణి మరియు ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద క్యూ7 ఎస్‌యూవీతో దిగిన ఫోటోలను షేర్ చేసారు.

ఆడి క్యూ7 విషయానికి వస్తే, ప్రస్తుతం దేశీయంగా మరియు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడుపోతున్న ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ 2015లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. ఆడి క్యూ7 ఎస్‌యూవీలో లెథర్ సీట్లు, ప్యానోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ7 పెద్ద ఎస్‌యూవీ కావడంతో ఇరుకైన రోడ్లలో పార్కింగ్ చేయడం ఎంతో శ్రమతో కూడుకున్నది. అందుకే ఇందులో పార్కింగ్ సులభతరం చేసేందుకు ఆటానమస్ పార్క్ అసిస్ట్ ఫీచర్ అందివ్వడం జరిగింది. అన్ని రకాల రహదారుల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు అడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది.
- భర్తకు భలే కానుకిచ్చిన జెనీలియా

ఆడి క్యూ7లో భద్రత ఇందులో కీలకం. సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్‌లో ఫోర్-స్పోక్ లెథర్ స్టీరింగ్ వీల్, క్రికెట్ లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే, మల్టీ ఫంక్షన్ డిస్ల్పే మరియు ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

బాలీవుడు హీరోయిన్ క్రితి సనన్ ఎంచుకున్న ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీలో సాంకేతికంగా 3-లీటర్ కెపాసిటి గల వి6 డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 245బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఆడి క్యూ7 కేవలం 7.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 234కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం ఆడి క్యూ7 ప్రారంభ ప్రీమియమ్ వేరియంట్ ధర రూ. 70.12 లక్షలు మరియు టాప్ ఎండ్ టెక్నాలజీ వేరియంట్ ధర రూ. 77.84 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
బాలీవుడ్ హీరోయిన్‌లు లగ్జరీ ఎస్‌యూవీలు కొనుగోలు చేయడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో ఆలియా భట్ రేంజ్ రోవర్ వోగ్ ఎస్‌యూవీ మరియు ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జీప్ కంపాస్ కొనుగోలు చేశారు. ఆడి క్యూ7 ఫ్లాగ్‌షిప్ అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీ ఇంకా ఎంత మంది సెలబ్రిటీల మదిని దోచేస్తుందో చూడాలి మరి.
సెలబ్రిటీలు మరియు వారి ఖరీదైన లగ్జరీ కార్లు...
Trending DriveSpark YouTube Videos


Click it and Unblock the Notifications








