అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

హీరోలు చాలా వరకు విలాసవంతమైన జీవితాలను గడుపుతారని దాదాపు అందరికి తెలుసు. ఉండటానికి రాజమందిరం లాంటి ఇళ్ళు, తిరగటానికి స్వర్గదామం లాంటి వాహనాలని ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో హీరోలకు కారావాన్ లు చాలా అవసరంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో చిన్న హీరోల నుంచి, పెద్ద హీరోల వరకు దాదాపు కారావ్యాన్ లు వాడతారు.

అద్భుతంగా ఉన్న శ్రీమంతుని కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

ఇంతకు ముందు సైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కోసం 8 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక సదుపాయాలతో ఒక కారావ్యాన్ తయారుచేయించుకున్నాడు. అల్లు అర్జున్ కారావ్యాన్ గురించి అందరికి తెలుసు. ఇప్పుడు ఇదే రూట్ లో మన శ్రీమంతుడు మహేష్ బాబు కూడా అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటి తరానికి సరిపడే విధంగా చాలా లేటెస్ట్ ఫీచర్స్ తో ఒక కారావ్యాన్ తయారుచేయించుకున్నారు. ఈ కొత్త కారావ్యాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అద్భుతంగా ఉన్న శ్రీమంతుని కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

దూకుడు, శ్రీమంతుడు వంటి సినిమాలలో ఎంతోమంది మనసుదోచుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పుడు సర్కారివారి పాటు మూవీలో నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్ లో షూటింగ్ ముగించుకుని ఇండియా వచ్చారు.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

అద్భుతంగా ఉన్న శ్రీమంతుని కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

ఇక సూపర్ స్టార్కారావ్యాన్ విషయానికి వస్తే ముంబై బేస్డ్ కంపెనీ దీనిని రూపొందించింది. ఇంతకు ముందు ఉన్న కారా వ్యాన్ కూడా మంచి సదుపాయాలు ఉన్నప్పటికీ మారుతున్న కాలానికి అనుకూలంగా మరిన్ని హంగులతో ఈ కారా వ్యాన్ రూపుదిద్దుకుంది.

అద్భుతంగా ఉన్న శ్రీమంతుని కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

ఈ కారా వ్యాన్ చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. దీనిని మహేష్ బాబు స్టైల్ కి అనుగుణంగా తయారైన ఈ కారా వ్యాన్ చోడటానికి అద్భుతంగా ఉండటమే కాదు, భారీ మొత్తంలో ఖర్చు కూడా అయింది. కొన్ని వర్గాల నివేదికల ప్రకారం దీనికయిన ఖర్చు దాదాపు 10 కోట్లకు పైగానే ఉంటుంది.

MOST READ:సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

అద్భుతంగా ఉన్న శ్రీమంతుని కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబు కారావ్యాన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కూడా ఒక విశేషమేమంటే ఈ కారావ్యాన్ మహేష్ లక్కీ నెంబర్ 4005 తో రిజిస్టర్ చేయబడింది. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

అద్భుతంగా ఉన్న శ్రీమంతుని కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

మహేష్ బాబు ఇకపై జరిగే అన్ని షూటింగులకు ఈ కారావ్యాన్ ఉపయోగించనున్నారు. ఈ కారావ్యాన్ లో రెండు బెడ్ రూమ్ లు, హోమ్ థియటర్లు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా వీటన్నింటిని ఐ ప్యాడ్ కంట్రోల్ చేసే సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. ఏది ఏమైనా శ్రీమంతుని వాహనం ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది.

MOST READ:మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి

Most Read Articles

English summary
Mahesh Buys A Swanky New Caravan. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X