లక్షల ఖరీదైన కారు కొన్న నటుడు - ఫోటోలు వైరల్

ప్రముఖ నటుడు మరియు హోస్ట్ 'మనీష్ పాల్' ఇటీవల సరికొత్త 'మినీ కంట్రీమ్యాన్' కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మనీష్ కొనుగోలు చేసిన ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మనీష్ పాల్ తన భార్య సంయుక్తతో కలిసి కొత్త కారును డెలివెరీ చేసుకోవడం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా కొత్త బిడ్డ ఇల్లు అంటూ పోస్ట్ చేశారు. మనీష్ పాల్ కొనుగోలు చేసిన కారు బ్రిటిష్ గ్రీన్ షేడ్‌లో బానెట్‌పై బ్లాక్ రేసింగ్ స్ట్రిప్స్‌తో పూర్తి చేయబడి ఉండటం చూడవచ్చు. ఈ కారు ధర రూ. 48.10 లక్షలు (ఎక్స్ షోరూమ్).

Maniesh Paul Buys Mini Countryman

నిజానికి భారతీయ మార్కెట్లో మినీ కంట్రీమ్యాన్ మరియు మినీ కూపర్ రెండూ అత్యధిక ప్రజాదరణ పొందిన మినీ బ్రాండ్ కార్లు. అయితే వీటిని బీఎండబ్ల్యూ సీబీయూ మార్గం ద్వారా విక్రయిస్తుంది. మినీ కంట్రీమ్యాన్ 4 డోర్స్ కలిగిన కాంపాక్ట్ SUV. ఇది కంపెనీ విక్రయిస్తున్న 3 డోర్స్ వెర్షన్ కంటే కొంత ఎక్కువ పొడవు మరియు వెడల్పుగా ఉంటుంది. కాబట్టి ఇది వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

మినీ కంట్రీమ్యాన్ ఎక్కువమందికి ఇష్టమైన మినీ బ్రాండ్ కారు. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని హెడ్‌ల్యాంప్ కొంత ట్వీక్ చేయబడి ఉంటుంది. ఓవెల్ ఆకారానికి బదులుగా కొంత స్క్వేర్డ్ డిజైన్ పొందుతుంది. హెడ్‌ల్యాంప్‌ చుట్టూ నల్లటి అంచు కూడా ఉంటుంది. హెడ్‌ల్యాంప్‌లు ప్రొజెక్టర్ ఎల్ఈడీ యూనిట్లు. వాటిలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉంటుంది. మినీ బ్యాడ్జ్‌ని బానెట్ మధ్యలో ఫ్రంట్ గ్రిల్‌కు కొంతపై భాగంలో ఉంచారు.

Maniesh Paul Buys Mini Countryman

మినీ కంట్రీమ్యాన్ ఫ్రంట్ గ్రిల్ అనేది ఎస్ బ్రాండింగ్‌తో కూడిన విస్తృత యూనిట్. మినీ కంట్రీమ్యాన్ దిగువ భాగంలో ఎయిర్ వెంట్స్ మరియు ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన మస్క్యులర్ బంపర్‌ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ బీప్ ఆఫ్ వెర్షన్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ కారులో ఎల్ఈడీ టెయిల్ లాంప్ ఉంటుంది. టెయిల్‌గేట్‌పై కూడా కంట్రీమ్యాన్ బ్యాడ్జ్ ఉంటుంది. మినీ కంట్రీమ్యాన్ కేవలం JCW వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మినీ కంట్రీమ్యాన్ 2.0 సిలిండర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 180 Bhp పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో స్పోర్ట్స్ మరియు గ్రీన్ డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. పనితీరుపరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

మినీ కంట్రీమ్యాన్ SUVలో రౌండ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. మనీష్ పాల్ మినీ కంట్రీమ్యాన్ మాత్రమే కాకుండా.. మెర్సిడెస్ బెంజ్ జీఎస్ఎస్ 400డీ లగ్జరీ SUVని కూడా కలిగి ఉన్నారు. ఈ కారును ఇప్పటికే హుమా ఖురేషీ, ప్రతీక్ గాంధీ మొదలైన వారు కూడా ఈ బెంజ్ కారును కలిగి ఉన్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, April 29, 2024, 15:00 [IST]
English summary
Actor maniesh paul buys mini countryman details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+