పుట్టినరోజున మోహన్‌లాల్‌కు సర్‌ఫ్రైజ్‌ ఇచ్చిన ఫ్రెండ్‌.. ధోనీ వద్ద కూడా..

మలయాళం సహా పలు భాషా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు కార్లు అంటే ఎంతో ఇష్టం. అత్యంత విలాసవంతమైన క్లాసిక్‌, ఆధునిక కార్లు మోహన్‌లాల్‌ గ్యారేజీలో ఉన్నాయి. నిన్న (మే 21) ఆయన పుట్టినరోజు సందర్భంగా మోహన్‌లాల్‌ స్నేహితుడు హెడ్జ్‌ ఈక్విటీస్‌ ఎండీ అయిన అలెక్స్‌ బాబు ఆయనకు ఎలక్ట్రిక్‌ కారును బహుకరించారు.

ప్రస్తుతం విద్యుత్‌ కార్లను అనేక మంది ప్రముఖులు కొనుగోలు చేస్తున్నారు. వారితోపాటు చాలా మంది కూడా ఎలక్ట్రిక్‌ కార్లను వినియోగించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా మోహన్‌లాల్‌ పుట్టినరోజున ఆయన గ్యారేజీలో తొలి ఈవీ కియా EV6 చేరింది. ఈ ఎలక్ట్రిక్‌ కారును గత సంవత్సరం భారత్‌లో కియా తన ఏకైక ఎలక్ట్రిక్‌ కారుగా విడుదల చేసింది.

mohanlal received kia EV6 car on birthday

కియా EV6ని కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌గా దిగుమతి చేసుకుంటోంది. అయితే భారత్‌లో తొలుత 100 కార్లను విక్రయించాలని ప్లాన్‌ చేసింది. అయితే తొలిరోజునే ఈ కార్లకు మంచి స్పందన వచ్చింది. ఏకంగా 355 కార్లకు బుకింగ్‌లు వచ్చాయి.

కియా EV6 కారు డిజైన్‌ విషయానికి వస్తే ఫ్రంట్‌లో అద్బుతమైన DRLలను అందించారు. దాంతోపాటు మంచి LED హెడ్‌లైట్లను అందించారు. ఈ కారు ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. యాచ్‌ బ్లూ, అరోరా బ్లాక్‌ పెర్ల్‌, రన్‌వే రెడ్‌, స్నో వైట్ మరియు మూన్‌స్కేప్‌ రంగుల్లో ఈవీ6 ఉంది. నటుడు మోహన్‌లాల్‌కు పుట్టినరోజున బహుమతిగా వచ్చిన కియా ఈవీ6 కారు అరోరా బ్లాక్‌ షేడ్‌.. ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది.

mohanlal received kia EV6 car on birthday

కియా ఈవీ6 కారు బయటవైపు ఎంత ప్రీమియం లుక్‌ను కలిగి ఉందో.. కారు లోపలి భాగం కూడా అలానే ఉంటుంది. లోపల అంతా బ్లాక్ కలర్‌ స్వెడ్‌ సీట్లు, వేగన్‌ లెదర్‌ బోల్స్టర్‌ను కలిగి ఉంది. దాంతోపాటు 64 కలర్‌ అంబియంట్‌ లైటింగ్‌, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రండ్‌ సీట్లు, వేగాన్‌ లెదర్‌తో కూడిన స్టీరింగ్‌ వీల్‌, యాంటీ గ్లేర్‌ రేర్‌ వ్య్వూ కలిగి ఉంది.

టిల్ట్‌ మరియు టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌ వీల్‌, స్ఫోర్టీ అల్లాయ్‌ పెడల్స్‌, డ్యూయల్‌ జోన్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, మల్టిపుల్ డ్రైవర్‌ మోడ్‌, స్మార్ట్‌ కీ, పుస్‌ బటన్‌ స్టార్ట్‌ / స్టాప్‌, సుమారు 10 విధాలుగా సర్దుబాటు చేయగల డ్రైవర్‌ సీట్, ఇంకా ఇలాంటి ఫీచర్లు ఈ ఈవీ6 కారులో ఉన్నాయి.

వీటితో పాటు రీ జనరేటివ్‌ బ్రేకింగ్‌ పెడల్‌ షెల్టర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్‌ బ్రేక్‌, ఆటో హోల్డ్‌ ఫంక్షన్‌, LED లైట్లు, 12.3 అంగుళాల కర్వడ్‌ స్క్రీన్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్లు సహా ఎన్నో ఆధునిక ఫీచర్లు కియా EV6 సొంతం.

కియా EV6 కారు సింగిల్‌ 77.6 kWh లిథియం అయాన్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు ఒక్కసారి ఛార్జింగ్‌తో 528 km రేంజ్‌ ఇస్తుంది. ఆల్ట్రా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో బ్యాటరీ వస్తుంది. ఫలితంగా కేవలం 4-5 నిమిషాల్లో 100 km రేంజ్‌ ఇస్తుంది.

మరో అద్బుతమైన ఫీచర్‌ ఈ కియా కారు సొంతం. 350kW ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లోనే EV6 కారు.. 10 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్‌ అవ్వనుంది. అదే 50kW ఛార్జర్‌ను వినియోగిస్తే 10 శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు సుమారు 73 నిమిషాలు పట్టనుంది.

RWD సింగిల్‌ మోటార్‌ యూనిట్‌ 225 bhp శక్తిని మరియు 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈవీ6 కేవలం 3.5 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకోగలదని కియా వెల్లడించింది. కియా EV6 కారు ప్రారంభ ధర రూ. 60.95 లక్షలు (ఎక్స్‌ షోరూం). మోహన్‌లాల్‌కు పుట్టినరోజున ఈ బహుమతి రాగా, ఈ ఎలక్ట్రిక్‌ కారును భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌, ఎంఎస్‌ ధోని కొనుగోలు చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, May 22, 2023, 19:53 [IST]
English summary
Actor mohanlal received kia ev6 electric car by his friend on his birthday
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+