ఆయన పేరే కింగ్.. అందుకే కోట్ల విలువైన కారును సొంతం చేసుకున్నారు.. దీని కోసం ఆర్టీఓ ఆఫీస్‌లో సడన్ ఎంట్రీ..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో కింగ్ నాగార్జున లైఫ్‌స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. ఒకవైపు సినిమాల ద్వారానే కాకుండా ఇతర పెట్టుబడుల నుంచి కూడా ఆదాయాన్ని సంపాదిస్తుంటారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ బాగా రన్ అవుతుంది. కొత్త నటులను ఎంకరేజ్ చేయడంతో పాటు బడ్జెట్‌తో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఆయన ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటారు. టాలీవుడ్ పరిశ్రమలో 65 ఏళ్ల వయసులో కూడా యాక్టివ్‌గా ఉంటూ, అందమైన హీరోగా తెలుగులోనే కాకుండా ఇండియా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన సెలబ్రిటీగా ఉన్నారు. ఇటూ సినిమాలు, మరోవైపు పెట్టుబడులను నిర్వహిస్తూ చాలా బిజీగా ఉంటారు. అలాంటి ఆయన ఇటీవల హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌లో సడన్‌గా ప్రత్యక్షమయ్యారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం నవంబర్ 27న నాగార్జున rto కార్యాలయానికి వచ్చారు. పెద్ద నటుడు, సెలబ్రిటీ అక్కడ కనిపించడంతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
నాగార్జున ఇటీవల కొత్తగా లగ్జరీ కారు లెక్సస్ ఎల్‌ఎమ్(Lexus Lm)ను కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ.2.50 కోట్ల వరకు ఉంటుంది. ఆయనకు మామూలుగా లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే నాగార్జున గ్యారేజీలో అధునాతనమైన చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. కొత్తగా మార్కెట్లోకి ఏదైనా మోడల్ విడుదల అయిందంటే చాలు వెంటనే దాన్ని కొనేసి గ్యారేజీలో పెట్టుకుంటారు.

ఆయనతో పాటు కొడుకులు నాగచైతన్య, అఖిల్‌కు కూడా సూపర్ స్పోర్ట్స్, లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. వీరి ఇంట్లో దాదాపు అన్ని టాప్ బ్రాండ్‌లకు చెందిన కార్లే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ కొత్త కారు రాకతో వాటి సంఖ్య కొంత పెరిగింది. నాగార్జున కొనుగోలు చేసినటువంటి లెక్సస్ చాలా అధునాతనమైనది. ఇది విలాసవంతమైన ఇంటీరియర్‌తో, కేవలం ధనవంతులు మాత్రమే కొనగలిగే ధరలో అందుబాటులో ఉంది.
ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఆఫీస్‌కు చేరుకున్న వెంటనే అభిమానులు ఒక్కసారిగా చుట్టు గుమిగూడారు. కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అక్కిడి అధికారులు ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పనిని వేగంగా పూర్తి చేయడానికి సహకరించారు.

తన కొత్త లెక్సస్ LM కారు రిజిస్ట్రేషన్ కోసం ఫోటో దిగి, మిగిలిన కాగితాల ప్రాసెస్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది నాగార్జునతో ఫోటోలు దిగారు. బయటకు వస్తున్న సమయంలో కూడా అభిమానులతో ఫోటోలు దిగారు. టాలీవుడ్ కింగ్ ఒక్కసారిగా అక్కడ కనిపించడంతో అభిమానుల తాకిడి ఎక్కువ అయింది. రిజిస్ట్రేషన్ పని పూర్తయిన తర్వాత ఫోటోలు దిగి వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు.
నాగార్జున కొనుగోలు చేసిన లగ్జరీ లెక్సస్LM కారు లోపల ఒక భూలోక స్వర్గంగా ఉంటుంది. ఇది 4 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.దీని ఇంజిన్ విషయానికి వస్తే, 2.5-లీటర్(పెట్రోల్ + ఎలక్ట్రిక్ ) హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 250 PS హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. E-CVT గేర్‌బాక్స్ ఆల్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉంది.

లెక్సస్ LM లగ్జరీ కార్‌లో భద్రత పరంగా అత్యుత్తమైన ప్రమాణాలను కలిగి ఉంది. ప్రయాణికుల రక్షణ కోసం 8 ఎయిర్‌బ్యాగ్‌లను లోపల అందించారు. ఇంకా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి. ఈ కారులో రోడ్డుపై వెళ్తుంటే పెద్ద ఇంద్రభవనgలో వెళుతున్నట్లుగా ఉంటుంది. క్యాబిన్‌లో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications








