అత్తారింటికి దారేదిలో హోండా సిబిఆర్ 250ఆర్‌పై పవన్ కళ్యాన్

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘అత్తారింటికి దారేది' చిత్రం నేడు ప్రేక్షకుల ముందు వస్తున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా నిర్మాతలను కష్టాల్లో ముంచెత్తిన పైసరీ భూతంతో, సదరు సినిమాను ఇదివరకు అనుకున్న తేదీనే (సెప్టెంబర్ 27, 2012) విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ అత్తారింటికి దారేది చిత్రం ప్రథమార్థం ఇంటర్నెట్‌లో లీక్ అయినప్పటికీ, ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఏ మాత్రం ఆసక్తి తగ్గినట్లు కనిపించడం లేదు.

ప్రేక్షకులు తమ అభిమాన హీరో నటించిన సినిమాను చూసేందుకు ఈ రోజు పొద్దున్నుంచే థియేటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మన హీరో డ్రైవర్ పాత్ర పోషిస్తారని వినికిడి ఉంది.

అత్తారింటికి దారేది మూవీ రివ్యూ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

సరే ఇదంతా అటుంచితే, గబ్బర్ చిత్రంలో జీప్‌తో హల్ చల్ చేసిన మన హీరో పవన్ కళ్యాన్, అత్తారింటికి దారేది చిత్రంలో హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైక్‌పై కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సీన్‌కు సంబంధించి వర్కింగ్ స్టిల్స్, పోస్టర్స్‌ను మనం చూశాం. వీటిని బట్టి చూస్తుంటే, ఈ చిత్రంలో మంచి బైక్ చేజింగ్ సీన్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని టాప్ హీరోల టాలీవుడ్ సినిమాల్లో మాదిరిగానే, ఈ చిత్రంలో మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి పలు లగ్జరీ కార్లను హైలైట్ చేసే ఆస్కారం ఉంది.

మరి ఈ చిత్రం గబ్బర్ సింగ్ మాదిరిగానే పవన్ కళ్యాన్‌కు మరొక సూపర్ డూపర్ హిట్‌ను తెచ్చిపెడుతుందో లేదో అనేది మరికొద్ది గంటల్లోనే తెలిసిపోనుంది. దయచేసి అత్తారింటికి దారేది సినిమా కేవలం థియేటర్లలో మాత్రమే చూడండి, పైరసీ ప్రోత్సహించకండి. (హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.)

సిబిఆర్ 250ఆర్‌పై పవన్ ఛేజింగ్

అత్తారింటికి దారేది చిత్రంలో హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను రైడ్ చేస్తూ, ఛేజింగ్ సీన్‌లో కనిపించనున్నాడు హీరో పవన్ కళ్యాన్.

సిబిఆర్ 250ఆర్‌పై పవన్ ఛేజింగ్

అత్తారింటికి దారేది చిత్రం వర్కింగ్ స్టిల్స్, చిత్రంలో హీరోయిన్ సమంతను కూడా చూడొచ్చు. అంటే, ఈ ఛేజింగ్ సీన్‌‌లో సమంత కూడా ఉందన్నమాట.

సిబిఆర్ 250ఆర్‌పై పవన్ ఛేజింగ్

అత్తారింటికి దారేది చిత్రం వర్కింగ్ స్టిల్స్, చిత్రంలో హీరోయిన్, సమంత, డైరక్టర్ త్రివిక్రమ్‌లను చూడొచ్చు.

సిబిఆర్ 250ఆర్‌పై పవన్ ఛేజింగ్

హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌లో ఉపయోగించిన ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 25 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 23 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2013 హోండా సిబిఆర్ 250ఆర్ కలర్ ఆప్షన్స్

2013 హోండా సిబిఆర్ 250ఆర్ కలర్ ఆప్షన్స్

  • స్పోర్ట్స్ రెడ్
  • స్పోర్ట్స్ బ్లాక్
  • పెరల్ సన్‌బీమ్ వైట్
  • రెప్సోల్
  • హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ రెడ్

    హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ రెడ్

    • స్టాండర్డ్ - రూ.1.56 లక్షలు
    • ఏబిఎస్ - రూ.1.85 లక్షలు
    • హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బ్లాక్

      హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బ్లాక్

      • స్టాండర్డ్ - రూ.1.56 లక్షలు
      • ఏబిఎస్ - రూ.1.85 లక్షలు
      • హోండా సిబిఆర్ 250ఆర్ పెరల్ సన్‌బీమ్ వైట్

        హోండా సిబిఆర్ 250ఆర్ పెరల్ సన్‌బీమ్ వైట్

        • స్టాండర్డ్ - రూ.1.57 లక్షలు
        • ఏబిఎస్ - రూ.1.86 లక్షలు
        • హోండా సిబిఆర్ 250ఆర్ రెప్సోల్

          హోండా సిబిఆర్ 250ఆర్ రెప్సోల్

          • ఏబిఎస్ - రూ.1.92 లక్షలు

            (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, డీలర్‌ను బట్టి, ప్రాంతాన్ని బట్టి ధరలు మారే ఆస్కారం ఉంది)

More from DriveSpark

Article Published On: Friday, September 27, 2013, 10:45 [IST]
English summary
Tollywood actor power star Pawan Kalyan rides a brand new Honda CBR 250R sports bike in his latest film Attarintiki Daredi, Which will be releasing today. This film is said to be about a millionaire settled in US. He learns the differences in his family in India due to his grandfather. He quits his luxurious life in America and comes to India. He becomes a driver at his aunt's house to sort out the family issues.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+