మాస్ విలన్ ఈ కారుకు ఫిదా అయిపోయారు.. ఈ కారులో అంత స్పెషల్ ఏముందో మరి?

సినిమా తారలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తల లగ్జరీ లైఫ్‌స్టైల్ వేరే విధంగా ఉంటుంది. వారు ఖరీదైన కార్లలో తిరగడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కోట్లు విలువ చేసే కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించిన ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ కొత్తగా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ ఆటో ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఆయన కొనుగోలు చేసిన కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఆ కారు గురించిన వివరాలను ఈ కింది కథనంలో తెలుసుకుందాం.

నటుడు రాహుల్ దేవ్ కొన్నటువంటి మోడల్ పేరు 'ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 (Land Rover Defender 110)'. ఇది ఒక ప్రసిద్ధ ఎస్‌యూవీ(suv). ఈ కారును ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వాడుతున్నారు. వారి సరసన ఇప్పుడు రాహుల్ దేవ్ కూడా చేరారు. ఈ ఎస్‌యూవీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తే, డిఫెండర్‌కు సెలబ్రిటీ సర్క్యూట్‌లో పెరుగుతున్నడిమాండ్ వెనుక కారణం, అది తన గట్టి ఆఫ్-రోడ్ శక్తిని కనబరుస్తుంది.

Actor Rahul Dev Buy New Car

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర విషయానికి వస్తే, రూ. 1.05 కోట్లు. ఇది ప్రారంభ ధర మాత్రమే. అదే ఇదే సిరీస్‌లో ఉన్నటువంటి టాప్ వేరియంట్ విషయానికి వస్తే దాదాపు రూ.2.79 కోట్ల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే నగరాలను బట్టి ధరలో మార్పులు ఉంటాయి. రాహుల్ దేవ్ కొన్నటువంటి కారు తెల్ల కలర్‌లో ఆకట్టుకుంటంది. చూపరులను కట్టిపడేసే లుక్‌తో కనిపిస్తుంది.

దీని ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్, 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉంది, ఇది మంచి పనితీరు కనిపిస్తుంది. అదే సమయంలో, 3.0-లీటర్ డీజిల్ వేరియంట్, తక్కువ ఇంధన వినియోగంతో నడవగలిగేలా శక్తిని అందిస్తుంది. అలాగే 5.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్ రూపంలో ఉంటుంది. ఇది అద్భుతమైన శక్తిని విడుదల చేస్తూ, మీ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చుతుంది.

Rahul Dev Buy Brand New Land Rover Defender

ఈ కారులో ఉన్నటువంటి ఫీచర్స్‌ను చూసినట్లయితే, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అంతేకాక, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది డ్రైవర్‌కు అవసరమైన అన్ని సమాచారాన్ని చూపిస్తుంది. వాతావరణ పరిస్థితులను ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో ఎప్పటికప్పుడు ఆపరేటింగ్ చేయవచ్చు. హెడ్-అప్ డిస్ప్లే ద్వారా డ్రైవర్ తన దృష్టిని సౌకర్యంగా రోడ్డుపై పెట్టగలడు. కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయి.

=====================================================================================================================================================================Instagram Code 2: Twitter Tab

ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మెరిడియన్ ప్రీమియం స్పీకర్ సిస్టమ్ కూడా ఉంది. ఫ్రంట్ సీట్లు ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేసుకునే అవకాశంతో వ్యక్తిగత సౌలభ్యం పెరుగుతుంది. అంతేకాదు, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్ స్మూత్ రైడ్‌ను కల్పిస్తూ, ఎలాంటి ప్రదేశమైనా కూడా ఒక విశ్రాంతి తీసుకునే విధంగా ప్రయాణాన్ని మార్చుతుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును సినీ పరిశ్రమలో టాప్ నటులు వాడుతున్నారు.

Land Rover Defender Suv

వారిలో సంజయ్ దత్, కరీనా కపూర్, అర్జున్ కపూర్, సన్నీ డియోల్, ముఖేష్ అంబానీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అనేక మంది కారును కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా రాహుల్ దేవ్ చేరారు. ప్రస్తుతం ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, 110, 130 వెర్షన్లతో సహా అనేక వేరియంట్లలో లభిస్తుంది. రాహుల్ దేవ్ తెల్లటి కలర్‌లో మెరిసిపోతున్న 110 కారును ఎంచుకున్నారు.

డిఫెండర్ 90 అనేది 3-డోర్ల వేరియంట్ అయితే, 110 ఐదు-డోర్, మూడు-వరుసల సీటింగ్, విశాలమైన స్థలంను కలిగి ఉంటుంది. రాహుల్ దేవ్ ప్రసిద్ధ ఎస్‌యూవీ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. లోపల థీమ్ అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. రాహుల్ దేవ్ ఇటీవల తన కొత్త డిఫెండర్ SUV డెలివరీ పొందిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. వీడియోలో ఆయన తన ఆనందాన్ని తెలియజేస్తున్నారు.

కారును ముందుగా డెలివరీ చేసినందుకు ల్యాండ్ రోవర్ డీలర్‌షిప్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇది డీలర్ సేవలపై ఆయనకున్న సంతృప్తిని స్పష్టంగా చూపిస్తుంది. కారుకు కొన్ని చోట్ల బాడీ కలర్ ఇన్సర్ట్‌లు ఉండటం వలన కార్ డిజైన్‌లో ఒక ప్రత్యేకతను కలిగిస్తుంది.

అయితే, ఆయన ఎంచుకున్న వేరియంట్ పెట్రోల్ లేదా డీజిల్ అనే విషయం వీడియో ద్వారా స్పష్టంగా తెలియకపోయినా, లగ్జరీ ఫీచర్లు, ఆయన వ్యక్తిగత స్టైల్‌ను బట్టి చూస్తే పెట్రోల్ వేరియంట్ అయి ఉండవచ్చని ఊహించవచ్చు. ముఖ్యంగా V8 మోడల్‌ను సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రముఖులకు అవసరమయ్యే ప్రతీ అవసరాలను కూడా డిఫెండర్‌ తీర్చగలదు. ఇంటీరియర్‌ డిజైన్ లగ్జరీ ఫీల్‌ను కలిగిస్తే, శక్తివంతమైన ఇంజిన్ ఎంపికలు దీనిలో ఉంటాయి.

అలాగే, 5, 6, లేదా 7 సీటింగ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం వలన కుటుంబానికి, ఇతర ప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుంది. ఇలా ఎన్నో విభిన్న అవసరాలకు సరిపోయే ఫీచర్లున్న ఈ SUV, సెలబ్రిటీల కోసం మాత్రమే కాకుండా, పనితీరు, ప్రీమియం అనుభవం కోసం చూస్తున్న ఎవరికైనా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ వాహనాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.

ఇక రాహుల్ దేవ్ విషయానికి వస్తే, 1990లలో మోడలింగ్ పరిశ్రమలో రాహుల్ దేవ్ ఒక ముఖ్యమైన పేరు. అతను టాటా, రేమండ్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ప్రచార కర్తగా కూడా ఉన్నారు. తరువాత ఆయన 2002లో మోడలింగ్‌కు గుడ్‌బై చెప్పి పూర్తి స్థాయిలో నటన వైపు మళ్లాడు. తన నటనా ప్రయాణంలో, రాహుల్ దేవ్ విభిన్న భాషల్లో, విభిన్న పాత్రలతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దేశంలోని చాలా భాషల్లో నటించారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 6, 2025, 13:27 [IST]
English summary
Actor rahul dev buy brand new land rover defender suv here the video
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+