ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్‌లో ధోనీ నివాసానికి రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియో
ఇద్దరు సెలబ్రిటీస్ ఒక్క చోట కలిస్తే ఫ్యాన్స్‌కు ఫుల్ పండగే.. కానీ ఇద్దరూ వేర్వేరు రంగాలకు చెందిన వారైతే.. అదీ ఒకరు సినిమా, మరొకరు క్రికెట్ అయితే ఇక సోషల్ మీడియాలో లైకుల వర్షం, కామెంట్ల జల్లు కురవాల్సిందే.. వారే ఒకరు రామ్ చరణ్(Ram Charan), మరొకరు ఎంఎస్ ధోనీ(MS Dhoni)..
దేశంలో ఈ రెండు రంగాలకు దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆయన నివాసంలో కలిశారు. అయితే రామ్ చరణ్ ధోని ఇంటికి ల్యాండ్ రోవర్ కారులో వెళ్లారు. అదే ఇక్కడ అసలు విషయం.

2023 ప్రపంచ కప్ 50-ఓవర్ల క్రికెట్ సిరీస్ చాలా అంచనాల మధ్య భారతదేశంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని కొత్త హెయిర్ స్టైల్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ధోనీ కొత్త హెయిర్ స్టైల్‌లో ఉన్న ఫోటోలు ఇటీవలి రోజుల్లో ఇంటర్నెట్‌లో తెగ షేర్ అయ్యాయి.
ఈ క్రమంలో ఇంతలో MS ధోనీకి సంబంధించిన కొత్త వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ధోని మాత్రమే కాకుండా రామ్ చరణ్ కూడా ఉన్నారు. రామ్ చరణ్ ఇటీవల ముంబయిలోని మహేంద్ర సింగ్ ధోని ఇంటికి వెళ్లారు. కొద్ది సేపు ధోనీతో చర్చించిన అనంతరం చెర్రీ బయటకు వచ్చారు. ఈ విషయాన్ని ఇద్దరూ ఇంటర్నెట్‌లో ఫొటోతో పంచుకున్నారు.

ధోనీ నివాసానికి నటుడు రామ్ చరణ్ తన ల్యాండ్ రోవర్ డిఫెండర్(Land Rover Defender) కారులో వెళ్లారు. రామ్ చరణ్ డిఫెండర్ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయినట్లు సమాచారం. కాగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. భారత మార్కెట్లోనూ దీనికి చాలా క్రేజ్ ఉంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కార్ల విక్రయం భారత్‌లో కొనసాగుతోంది.
అయితే సెలబ్రిటీస్ ఎక్కువగా సినీ తారలు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కొనుగోలు చేస్తున్నారు. బాక్స్ ఆకారంలో, క్లాసీగా కనిపించే డిఫెండర్ కార్లు కేవలం సినిమా నటులే కాకుండా చాలా మంది హీరోయిన్లు సొంతం చేసుకున్నారు. డిఫెండర్ కార్ల హైలైట్ ఏంటంటే.. విలాసవంతమైన రైడ్ మాత్రమే కాకుండా ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ కార్ల అమ్మకాల్లో ఇటీవల గణనీయమైన సంఖ్యను నమోదు చేసిన బ్రిటిష్ కార్ల దిగ్గజం ల్యాండ్ రోవర్ ఈ ఏడాది నుంచి భారత మార్కెట్లో డిఫెండర్ కార్లలో కొత్త ఇంజిన్ ఎంపికలను ప్రవేశపెట్టింది. బ్రిటిష్ లగ్జరీ కార్ తయారీదారు ఈ సంవత్సరం ప్రారంభంలో మోడల్‌కు కొత్త ఇంజన్ ఎంపికలను జోడించారు. ఇందులో 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ ఉంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ కెపాసిటీ పరంగా ఇది 291mm యొక్క భారీ గ్రౌండ్ క్లియరెన్స్, 38-డిగ్రీల అప్రోచ్ యాంగిల్, 40-డిగ్రీల డిపార్చర్ యాంగిల్‌ను కలిగి ఉంది. ఇంకా 900mm నీటి లోతులో ఈ SUV ప్రయాణించగలదు. ఇది 300 కిలోల పైకప్పు లోడ్ సామర్థ్యాన్ని మరియు 3,500 కిలోల భారీ టోయింగ్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

ఇక రామ్‌చరణ్ కార్ల గ్యారేజీని పరిశీలిస్తే.. ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8ని ధర రూ. 2 కోట్లు, చెర్రీ, ఉపాసనల పెళ్లి సందర్భంగా అత్తమామలు ఈ కారును గిఫ్ట్‌గా ఇచ్చారని సమాచారం. రేంజ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ మరో హైలైట్. దీని ధర దాదాపు రూ. 3.5 కోట్లు.
రామ్ చరణ్ వద్ద ఒక ఫెరారీ పోర్టోఫినో కారు కూడా ఉంది. దీని ధర రూ. 3.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 600 PS శక్తిని మరియు 760 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ కారు గరిష్ఠంగా గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








