జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

సాధారణంగా సెలబ్రెటీలు, క్రికెటర్లు మొదలైన వారు తమ గ్యారేజీలు ఖరీదైన మరియు విలాసవంతమైన లగ్జరీ కార్లను కలిగి ఉంటారు అనే విషయం తెలిసిందే. వీరు ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వారికి వాహనాలపై ఉన్న వ్యామోహమనే చెప్పాలి. అయితే ఇటీవల ప్రముఖ నటుడు రాకేష్ బాపట్ ఒక జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

నటుడు 'రాకేష్ బాపట్' టీవీ సీరియల్స్ లో నటించాడు, అంతే కాకూండా సినిమాలలో కూడా తనదైన ముద్రను వేసుకున్నాడు. ఇటీవల ఇతడు ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి (Audi) యొక్క క్యూ7 SUV కొనుగోలు చేసాడు. ఇటీవల ఈ SUV భారతీయ మార్కెట్లో విడుదలయ్యింది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

ఆడి క్యూ7 అనేది తన సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సెవెన్-సీటర్ SUV లలో ఒకటి. కావున ఎక్కువమంది ప్రముఖులు ఈ SUV ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే చాలామంది ఈ SUV ని తమ కార్ గ్యారేజీలో చేర్చుతారు. ఇప్పుడు రాకేష్ బాపట్ గ్యారేజీలో కూడా ఈ లేటెస్ట్ SUV చేరిపోయింది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

రాకేష్ బాపట్ కొనుగోలు చేసిన ఈ కొత్త ఆడి క్యూ7 SUV కి సంబంధించిన ఫోటోలు డెక్కన్‌వీల్స్ వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడ్డాయి. రాకేష్ ఈ ఆడి క్యూ7 డెలివరీని దక్కన్ వీల్స్ నుండి డెలివరీ చేసుకున్నాడు. ఈ SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కావున సినీతారలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

అయితే ఇప్పుడు రాకేష్ బాపట్ కొనుగోలు చేసిన ఆడి క్యూ7 మునుపటి తరానికి చెందిన మోడల్, ఇది లేటెస్ట్ మోడల్ కాదు. అయితే ఈ పాత కారుని అతడు ఎందుకు కొనుగోలు చేసాడు అనేది ఖచ్చితంగా తెలియదు. బహుశా కొత్త దానికంటే పాత కారు తక్కువ ధరకు లభ్యమవుతుంది కొనుగోలు చేశారా.. లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియదు.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

ఆడి ఇండియా భారతీయ మార్కెట్లో చాలా రోజులకు ముందు నుంచి నిలిపివేసింది. అయితే ఇటీవల కంపెనీ తన లేటెస్ట్ వెర్షన్ 2022 మోడల్ విడుదల చేసింది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

ఈ మధ్య కాలంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు 'సునీల్ శెట్టి' కుమార్తె మరియు నటి 'అతియా శెట్టి' ఇటీవల సరికొత్త 2022 ఆడి క్యూ7 కొనుగోలు చేసింది. ఈ కొత్త SUV ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 79.99 లక్షలు. ఇందులో టాప్ మోడల్ ధర రూ. 88.33 లక్షలు.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

ఆడి క్యూ7 అనే కొత్త SUV భారతదేశంలో ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున ఇందులో 2,995సిసి వి6 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ అందుబటులో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారు గరిష్టంగా 250 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో ఈ SUV కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

ఆడి క్యూ7 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టం కలిగి ఉండటమే కాకుండా.. ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్-రోడ్ మరియు ఇండివిజువల్ అనే 7 డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల్ని మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రియర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇది కాకుండా, ఇది మెమరీ ఫంక్షన్‌తో కూడిన హీట్, పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్‌లు, డైరెక్ట్ టైర్-ప్రెజర్ మానిటర్, యాంబియంట్ లైటింగ్‌ వంటి వాటిని కూడా స్టాండర్డ్ గా పొందుతుంది. ఇందులోని 7-సీటర్ మోడల్ మూడవ వరుసలో ఎలక్ట్రిక్ ఫోల్డింగ్‌తో పాటు 4 జోన్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ బూట్ లిడ్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

ఇందులోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, రియర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ ORVMలు, అప్‌డేటెడ్ టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు క్యాబిన్ లైటింగ్, 12-వే పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్‌ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

క్యూ7 SUV పొడవు 5,063 మిమీ, వెడల్పు 1,970 మిమీ మరియు ఎత్తు 1,741 మిమీ వరకు ఉంటుంది. అదే విధంగా ఇది 2,995 మిమీ వీల్‌బేస్ ఇవ్వబడింది. ఇది 865 లీటర్ల భారీ బూట్‌స్పేస్‌ను పొందుతుంది, వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా బూట్ స్పేస్ 2,050 లీటర్ల వరకు పెంచుకోవచ్చు .

జర్మన్ బ్రాండ్ కారు కొన్న భారతీయ నటుడు 'రాకేష్ బాపట్': పూర్తి వివరాలు

కొత్త క్యూ7 SUV 'మై ఆడి కనెక్ట్' యాప్‌తో పాటు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ప్రోడక్ట్ విజువలైజర్ వంటి ఆధునిక టెక్నాలజీలను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV మూడు వరుసల సీటర్, కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున ఇది 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్లిమ్ మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్ యూనిట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్, విండోస్‌పై క్రోమ్ గార్నిష్ మరియు క్రోమ్ లైన్డ్ డోర్‌లను పొందుతుంది.

అంతే కాకుండా ఇది మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందింది, వీటిని బూట్ డోర్ వద్ద స్లిమ్ క్రోమ్ స్ట్రిప్ జత చేస్తుంది. వెనుక బంపర్‌కు క్రోమ్-టిప్డ్ ఎగ్జాస్ట్ మరియు స్కిడ్ ప్లేట్ కూడా ఉన్నాయి. కొత్త ఆడి క్యూ7 మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి వైట్, బ్లాక్, బ్లూ, గ్రే మరియు సిల్వర్ కలర్స్.

Most Read Articles

English summary
Actor raqesh bapat buys audi q7 suv features details
Story first published: Saturday, February 19, 2022, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X