బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్‌

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోగా అడుగులు వేస్తున్న, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అయిన 'సాయి ధరమ్‌ తేజ్‌' రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వార్త "సాయి ధరమ్‌ తేజ్‌" అభిమానులను షాక్ కి గురి చేసింది. ఇంతకీ సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడటానికి కారణం ఏంటి, అతని పరిస్థితి ఏంటి అనే విషయాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

నివేదికల ప్రకారం, హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లారు. బైక్‌పై వేగంగా వస్తున్న సమయంలో అదుపు తప్పి కంట్రోల్ అవ్వకపోవడం వల్ల, ఈ ప్రమాదం జరిగింది.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

ఈ ప్రమాదంలో సాయి ధరమ్‌ తేజ్‌ కుడికన్ను మరియు ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురయిన వెంటనే సమీపంలో ప్రాధమిక చికిత్స చేయించి, తరువాత అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

ఇప్పటికే సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. అయితే చిరంజీవి , పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , నిహారిక, మెగాస్టార్ సతీమణి సురేఖ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆసుపత్రికి వెళ్లి తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు తేజ్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

సాయి ధరమ్‌ తేజ్‌ Triumph Speed Triple 1200 RS (ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్) బైక్ ఉపయోగించినట్లు సమాచారం. దేశీయ మార్కెట్లోని ప్రముఖ సూపర్ బైకులలో ఒకటి ఈ Triumph Speed Triple 1200 RS. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాదు, రైడర్ లకు మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

అయితే భారతదేశంలో చాలా వారు రోడ్లు సాధారణ స్థాయి వేగానికి సరిపోయే విధంగా ఉన్నాయి. కావున ఈ రోడ్లపై పరిమిత వేగంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సాయి ధరమ్‌ తేజ్‌ తన బైక్ పై వేగంగా వెళ్లడమే కాకుండా ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసినప్పుడు ముందు రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల కిందికి పడినట్లు తెలిసింది.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

సాయి ధరమ్‌ తేజ్‌ బైక్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించాడు, హెల్మెట్ ధరించడం వల్ల గాయాలతో హాస్పిటల్ లో చేరాడు. ఒకవేళా హెల్మెట్ ధరించకుండా ఉండి ఉంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేది. ఈ ప్రమాదంలో తాను దరించిన హెల్మెట్ తన ప్రాణాలను కాపాడింది.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

ఇక Triumph Speed Triple 1200 RS బైక్ విషయానికి వస్తే, దీని ధర ఇండియన్ ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 16.95 లక్షలు.ఈ కొత్త బైక్ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇంద్దులో 'మైట్రయంఫ్' కనెక్ట్ టెక్నాలజీ, కొత్త స్విచ్ గేర్, కీలెస్ ఇగ్నీషియస్ మరియు ఇంటిగ్రేటెడ్ గోప్రో కంట్రోల్స్ తో 5 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

Triumph Speed Triple 1200 RS బైక్ సరికొత్త 1160 సిసి త్రీ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 178 బిహెచ్‌పి మరియు 9000 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. బై డైరెక్షనల్ క్విక్ స్విఫ్టర్ కూడా ఇందులో ఉంటుంది.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

Triumph Speed Triple 1200 RS బైక్ లో ఓహ్లిన్స్ ఫ్రంట్ మరియు రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది ముందు భాగంలో 43 మిమీ ఎన్‌ఐఎక్స్ 30 అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు మరియు వెనుకవైపు టిటిఎక్స్ 36 మోనో-షాక్ సెటప్ రూపంలో వస్తుంది. రెండు సస్పెన్షన్ సెటప్‌లు పూర్తి-అడ్జస్టబుల్ తో వస్తాయి. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సాయి ధరమ్‌ తేజ్‌ తెలుగులో పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమాతో సినీ పరిశ్రమలో మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. ఇతనికి అతి అతక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే తమ అభిమాన హీరోకి ప్రమాదం జరగటం వల్ల అందరూ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు, కాని అతని ఆరోగ్యం నిలకడగా ఉండటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్‌

భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షల మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం మితిమీరిన వేగం, హెల్మెట్ ధరించకపోవడం మరియు డ్రంక్ అండ్ డ్రైవ్. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాయి. అయినప్పటికీ ప్రమాదాల సంఖ్యను తగ్గించలేకపోతున్నారు.

Most Read Articles

English summary
Actor sai dharam met with bike accident injury details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X