రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసిన షాహిద్‌ కపూర్‌.. !

బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎక్కువగా లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు మార్కెట్‌లోకి వచ్చిన కొత్త కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఫలితంగా అనేక లగ్జరీ కార్లను తమ గ్యారేజీల్లో కలిగి ఉంటారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు షాహిద్‌ కపూర్‌ (Actor shahid kapoor) కొత్త మెర్సిడెస్‌ లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు.

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు షాహిద్‌ కపూర్ మెర్సిడెస్‌ మేబ్యాక్‌ GLS600 (Mercedes Mayback GLS600) కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ.3 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంటుందని తెలుస్తోంది. షాహిద్ కపూర్‌ ఈ కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

mercedes maybach GLS 600 car

మెర్సిడెస్‌ కారును అనేక మంది సెలబ్రిటీలు కొనుగోలు చేశారు. కృతి సనన్‌, నీతూ కపూర్‌, ఆయుష్మాన్‌ ఖురానా, రణవీర్‌ సింగ్‌ వంటి నటులు మెర్సెడిసె మేబ్యాక్‌ GLS600 కారును కలిగి ఉన్నారు.
నటుడు షాహిద్‌ కపూర్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ S400, మెర్సిడెస్‌ బెంజ్‌ GL-క్లాస్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ ML- క్లాస్‌, రేంజ్‌ రోవర్‌ Vogue, హార్లే డేవిడ్‌సన్‌ ఫాట్‌బాయ్‌, పోర్షే Cayenne GTS వంటి లగ్జరీ కార్లను కలిగి ఉంది.

షాహిద్‌ కపూర్‌ కొనుగోలుచేసిన మెర్సిడెస్ బెంజ్‌ GLS 600 కారు.. CBU మోడల్‌గా భారత్‌లో దిగుమతి చేయబడింది. ఈ వాహనం పరిమిత యూనిట్లు మాత్రమే భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌ డిమాండ్‌ మేరకు 4-సీటర్‌ లేదా 5-సీటర్‌ మోడల్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ మేబ్యాక్‌ GLS600 కారు అధునాతన సాంకేతికత మరియు అనేక సౌకర్యాలతో వస్తుంది. మరియు విలాసవంతమైన డిజైన్‌ సహా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

actor shahid kapoor mercedes maybach GLS 600 SUV

షాహిద్‌ కపూర్‌ కొనుగోలు చేసిన కారు 4- సీటర్ వెర్షన్‌గా తెలుస్తోంది. ఎక్స్‌క్లూజివ్‌ లెదర్‌తో లభిస్తుంది. వెనుక కూర్చున్న ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దీంతోపాటు అడాప్టివ్‌ డిజిటల్‌ LED హెడ్‌లైట్లు, డోర్‌ హ్యాండిల్స్‌, ఫింగర్‌ ప్రింట్‌ రీడర్ మరియు పనోరమిక్‌ సన్‌రూఫ్‌ కూడా ఉన్నాయి. ఈ కారు విండో లైన్, స్లాట్‌ గ్రిల్‌, డిజైన్‌ యాక్సెంట్‌లు, రూఫ్‌ రెయిల్‌, స్పోర్టీ ఎగ్జస్ట్‌ నోట్‌లను కలిగి ఉంది.

ఈ మెర్సిడెస్‌ మేబ్యాక్‌ GLS600 SUV 4.0 లీటర్‌ V8 పెట్రోల్‌ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ 9G-ట్రానిక్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 542bhp శక్తి మరియు 730Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 21bhp శక్తి, 249Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ EQ బూస్ట్ స్టార్టర్ జనరేటర్‌ను కలిగి ఉంటుంది. ఈ SUV గరిష్ఠ వేగం 250 kmphగా ఉంది.

mercedes maybach GLS 600 SUV

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 20, 2023, 17:45 [IST]
English summary
Actor shahid kapoor buys 3 crore luxury mercedes maybach gls 600 suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+