హెల్మెట్ ముఖ్యం బిగులూ.. సేఫ్ డ్రైవింగ్ కోసం బైకర్లకు హెల్మెట్స్ పంపిణీ చేసిన సోనూసూద్
ప్రపంచంలోనే అత్యధికంగా టూ వీలర్స్ ఉన్న దేశం భారత్. రెండో స్థానంలో ఇండొనేషియా ఉంది. ఆఫీసు, వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువగా టూ వీలర్‌నే సౌకర్యంగా భావిస్తారు. అయితే బైక్ లేదా స్కూటర్ రైడర్ చేసేటప్పుడు భద్రత దృష్ట్యా హెల్మెట్(Helmet) తప్పనిసరి. ఇందుకు సంబంధించి తాజాగా సోనూసూద్(Sonu Sood) వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
మనదేశంలో ద్విచక్ర వాహనదారులు(Two Wheelers In India) అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారిలో హెల్మెట్ ధరించేవారు చాలా తక్కువ. కేవలం 34 శాతం మందే హెల్మెట్ ధరిస్తున్నారంటే.. టూ వీలర్ కొనుగోలు మీద ఉన్న ఆసక్తి హెల్మెట్ వాడకంపైన చూపించరు. ఈ కారణంగా దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు తరచూ ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తుంటారు. హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు హెల్మెట్ లేని వారికి helmet అందించారు. కాగా ఇటీవల మహారాష్ట్రలో నటుడు సోనూసూద్ ఇలాంటి ఓ కార్యక్రమంలో పాల్గొని బైకర్లకు అవగాహన కల్పించారు.
దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, కరోనా(Covid 19) సమయంలో సోనూసూద్ అభాగ్యులకు చేసిన సేవలు ఎనలేనివి. దీంతో ఆయన చాలా మంది గుండెల్లో హీరోగా నిలిచిపోయారు. అంతే కాకుండా కొందరు అభిమానులు పాదయాత్ర చేసుకుంటూ ఆయన ఇంటికి వెళ్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా మరోసారి సోనూసూద్.. సొసైటీ పట్ల తన బాధ్యతను చాటుకున్నారు.

హెల్మెట్ వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో నటుడు సోనూసూద్ పాల్గొన్నారు. ఈ ప్రచారానికి మహారాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో సోనూసూద్, ట్రాఫిక్ ఏడీజీపీ డాక్టర్ రవీందర్ సింగల్ రోడ్డుపై సిగ్నల్ వైపు వెళ్లడాన్ని చూడవచ్చు.
అనంతరం రోడ్డుపైకి వచ్చి.. హెల్మెట్ లేకుండా బైక్, స్కూటర్ నడుపుతున్న వారిని ఆపారు. వారికి సోనూసూద్, ట్రాఫిక్ ఏడీజీపీతో కలిసి హెల్మెట్‌లను పంపిణీ చేశారు. సేఫ్టీ గేర్ లేకుండా రైడింగ్ చేస్తూ పట్టుబడిన వారందరినీ క్యూలో నిలబెట్టి.. హెల్మెట్‌లను పంపిణీ చేశారు. అంతే కాకుండా వారికి సోనూసూద్ తగిన సూచనలు చేశారు. సోనూసూద్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

హెల్మెట్ పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత, సోనూసూద్, రవీందర్ సింఘాల్ ఫొ టోగ్రాఫర్లకు పోజులిచ్చారు. అనంతరం వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.హెల్మెట్ ధరించకపోవడం దేశంలో అతిపెద్ద సమస్య అని సోనూసూద్ అన్నారు. రైడర్లు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి హెల్మెట్ తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సోనూసూద్ గౌరవంగా పేర్కొన్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరుల తప్పును వేలెత్తి చూపడం చాలా సులభమని.. కానీ భద్రత విషయంలో మనం కూడా ఎంత బాధ్యతగా ఉన్నామో పరిశీలించుకోవాలని సోనూసూద్ సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. హెల్మెట్‌ను కేవలం తలపై పెట్టుకోవడమే కాకుండా పట్టీ సరిగా బిగించుకుందో లేదో కూడా చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

కేవలం ద్విచక్ర వాహనదారులు మాత్రమే కాదు.. ఇతర వాహనదారులు కూడా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మహారాష్ట్ర ట్రాఫిక్ ఏడీజీపీ రవీంద్ర సింఘాల్ అన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనంపై రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications








