భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

'సోనూసూద్' ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరికి సుపరిచయమే, కరోనా మహమ్మరి గత సంవత్సరం ప్రరపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు తీయడమే కాకూండా ఎంతోమంది ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా అన్ని దేశాలతో పాటు భారతదేశంలో కూడా కరోనా నివారణకు లాక్ డౌన్ విధించబడింది.

భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

కరోనా లాక్ డౌన్ సమయంలో దాదాపు అన్ని వాహన సదుపాయాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఎంతోమంది పేద ప్రజలు సుదూర ప్రాంతాలలో చిక్కుకుని స్వస్థలాలకు రావడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంకొంతమంది ప్రజలు తమ స్వగ్రామాలకు వేళా కిలోమీటర్లు కాలినడకన బయలుదేరి చేరుకున్నారు. ఇలాంటి సంఘటనలు చూసి చలించిపోయిన ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ఎతోమంది పాలిట దేవుడిగా నిలిచాడు.

భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

సినిమాల్లో విలన్ గా నటించిన సోనూసూద్ నిత్యజీవితంలో రియల్ హీరోగా నిలిచాడు. సోనూసూద్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే, అయితే ఇటీవల కాలంలో సోనూ హైదరాబాద్ నగరంలో చాల సింపుల్ గా సైకిల్ పై సినిమా సెట్ కి వెళ్ళాడు. అది చూసిన చిరంజీవితో సహా చిత్ర బృంటం మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారు.

MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్

భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోకాపేటలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్లో జరుగుతుంది. దీని కోసం పార్క్ హయత్‏లో బస చేసిన సోనూసూద్ బుధవారం ఉదయం అక్కడి నుంచి లొకేషన్ వరకు సైకిల్ తొక్కుతూ వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక్కడ వీడియోలో సోనూసూద్ సైకిల్ పై వెళ్లడం కూడా మీరు చూడవచ్చు.

భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

సాధారణంగా చాలామంది ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కుతుంటారు. సైక్లింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఇటీవల కాలంలో తమిళ్ స్టార్ విజయ్ తమిళనాడులో జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి తన ఇంటి నుంచి పోలింగ్ బూత్ కి సైకిల్ పై వెళ్ళాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.

MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?

భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

ఇదే కాకుండా ఇంతకు ముందు రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఇంటి నుంచి సినిమా సెట్ కి సైకిల్ పై వెళ్లిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం మనం ఇదివరకటి కథనంలోనే తెలుసుకున్నాము.

అయితే ఇప్పుడు సోనూసూద్ సైకిల్ పై వెళ్లిన చిత్రాలు కూడా వైరల్ అవుతున్నాయి. సోనూసూద్ దాదాపు 25 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించినట్లు తెలిసింది. కాలుష్యాన్ని తగ్గించాలన్న సందేశంతో పాటు ఇలా సైక్లింగ్‌ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండొచ్చని చెప్పకనే చెప్తున్నారు హీరో సోనూసూద్‌.

MOST READ:ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

అతడి సింప్లిసిటీకి, ఫిట్‌నెస్‌ మీద ఉన్న శ్రద్ధకు నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా మే 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.

Most Read Articles

English summary
Sonu Sood Pedals 25 Km To Acharya Sets. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X