Vijay - Trisha : సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. నీలిరంగు చీరలో మెరిసిన త్రిష.. ఆమె కారు ధర తెలిస్తే షాకే

Vijay - Trisha : తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. సినీ నటుడి నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగిన దళపతి విజయ్(Thalapathy Vijay), నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ భారీ బహిరంగ వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. అయితే, ఈ వేడుకలో రాజకీయ చర్చల కంటే ఎక్కువగా విజయ్ సన్నిహితురాలు, నటి త్రిష కృష్ణన్(Trisha Krishnan) రాక హాట్ టాపిక్ అయింది.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష(Trisha Krishnan) అత్యంత హుందాగా హాజరయ్యారు. ఆమె ధరించిన ముదురు నీలిరంగు (Navy Blue) చీర వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం 9 గంటలకే స్టేడియానికి చేరుకున్న ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు. గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల నేపథ్యంలో, ఆమె ఈ చారిత్రాత్మక వేడుకలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

actor trisha range rover car vijay swearing in ceremony updates

అందరినీ కట్టిపడేసిన తెల్లటి రేంజ్ రోవర్
త్రిష స్టేడియంలోకి ప్రవేశించిన తీరు అద్భుతంగా ఉంది. ఆమె తన లగ్జరీ తెల్లటి రేంజ్ రోవర్ కారులో దిగగానే మీడియా కెమెరాలన్నీ ఆమె వైపు మళ్లాయి. డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని వచ్చిన త్రిష, కారు దిగగానే చిరునవ్వుతో అందరికీ అభివాదం చేశారు. విజయ్ ముఖ్యమంత్రి కావాలనే కలను నిజం చేసుకున్న వేళ, త్రిష తన లగ్జరీ కారులో రాజసం ఉట్టిపడేలా రావడం అభిమానుల్లో కొత్త జోష్ నింపింది.

విలాసానికి మారుపేరు రేంజ్ రోవర్:
బ్రిటిష్ కార్ల దిగ్గజం ల్యాండ్ రోవర్ రూపొందించే రేంజ్ రోవర్ సిరీస్ అంటే సెలబ్రిటీలకు ప్రాణం. త్రిష వాడుతున్న ఈ కారు ఫుజి వైట్ రంగులో మెరిసిపోతోంది. ఇది కేవలం వాహనం మాత్రమే కాదు, హోదాకు నిదర్శనం. భారత్‌లో ఈ మోడల్ కారు ధర సుమారు రూ. 2.31 కోట్ల నుంచి ప్రారంభమై ఫీచర్లను బట్టి రూ. 4.66 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో 3 లీటర్ల శక్తివంతమైన ఇంజిన్ ఉండటమే కాకుండా, ప్రయాణికులకు అత్యున్నత సౌకర్యాన్ని అందిస్తుంది.

actor trisha range rover car vijay swearing in ceremony updates

వెల్లువలా శుభాకాంక్షలు
తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 108 స్థానాలు గెలుచుకుని, కాంగ్రెస్ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విజయ్ సాధించిన పెద్ద విజయం. ఈ వేడుకకు రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులు కూడా హాజరయ్యారు.

విజయ్ ముఖ్యమంత్రిగా సంతకం చేసిన తర్వాత సచివాలయానికి వెళ్లే సమయంలో త్రిష కూడా ఆయనతో పాటు సందడి చేయడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి ఒకే కారులో ఒక వివాహ వేడుకకు వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు నేరుగా రాజకీయ వేదికపై ఆమె కనిపిస్తుండటంతో, త్రిష రాబోయే రోజుల్లో విజయ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా, విజయ్ పొలిటికల్ ఎంట్రీ అండ్ విక్టరీలో త్రిష సందడి ఒక మరుపురాని ఘట్టంగా నిలిచిపోయింది.

Article Published On: Sunday, May 10, 2026, 13:11 [IST]
English summary
Actor trisha range rover car vijay swearing in ceremony updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+