BikeWo తో చేతులు కలిపిన విక్టరీ వెంకటేష్.. ఎందుకంటే?

తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర కథానాయకులలో ఒకరుగా ఉంటూ, కుటుంభ కథా చిత్రాలు నటిచడంలో తనకుతానే సాటిగా నిలిచిన విక్టరీ వెంకటేష్ ఇప్పుడు కొత్త బిజినెస్ లోకి అడుగుపెడుతున్నట్లు తెలిసింది. హైద‌రాబాద్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహిక‌ల్ స్టార్ట‌ప్ కంపెనీ అయిన 'బైక్ వో' (BikeWo) లో హీరో వెంక‌టేష్ పెట్టుబ‌డులు పెట్టాడు. అంతే కాకుండా BikeWo యొక్క ప్రధాన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమితులయ్యారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

BikeWo తో చేతులు కలిపిన విక్టరీ వెంకటేష్.. ఎందుకంటే?

సాధారణంగా సినీ హీరోలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటి సారి కాదు, ఇంతకు ముందు కూడా చాలామంది ఇలాంటి పెట్టుబడులు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ వరుసలో విక్టరీ వేంకటేష్ కూడా చేరారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగడానికి ప్రధాన కారణం పెరిగిన ఇంధన ధరలు.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో వినియోగంలో ఉన్నప్పుడు వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ వంటివి చాలా అవసరం. కావున చాలా కంపెనీలు ఈ విభాగంలో పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే BikeWo ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఇందులో వెంకటేష్ కూడా పెట్టుబడిదారుడిగా మారారు.

BikeWo తో చేతులు కలిపిన విక్టరీ వెంకటేష్.. ఎందుకంటే?

హీరో వేంకటేష్ సహకారంతో BikeWo తన EV సర్వీసింగ్ మరియు ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో విస్తరించాలని యోచిస్తోంది. అదే సమయంలో వెంకటేష్ దీనికి బ్రాండ్‌ అంబాసిడర్ గా ఉంటూ దీనిని మరింత విస్తరించడానికి తోడ్పడతాడు. ఇందులో మార్కెటింగ్, ఔట్రీచ్ మరియు బ్రాండ్ ప్రమోషన్ వంటి కార్యకలాపాలు ఉంటాయి, వీటికి వెంకటేష్ యొక్క సహకారం చాలావరకు ఉంటుంది.

కంపెనీ యొక్క నివేదికల ప్రకారం, దేశంలో 2025 నాటికి 20,000 EV ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ యొక్క లక్ష్యం కూడా ఇదే. దీనికోసం కంపెనీ ఆహర్నిశలు కష్టపడుతుంది, తద్వారా కంపెనీ సులభంగా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది.

BikeWo తో చేతులు కలిపిన విక్టరీ వెంకటేష్.. ఎందుకంటే?

ఈ మ‌ధ్య కాలంలో పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉప‌యోగం భారీ స్థాయిలో పెరిగింది. భ‌విష్య‌త్తులో కూడా వినియోగం పెరిగే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల ఈవీ బైక్ ల‌కు ఛార్జీంగ్, స‌ర్విసింగ్ సెంట‌ర్లకు డిమాండ్ భారీగా పెరిగే అవ‌కాశం ఉంటుంది.

ఈ సందర్భంగా BikeWo సహ వ్యవస్థాపకుడు & చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ.. Bikewo యొక్క పెట్టుబడిదారు మరియు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవర్‌గ్రీన్ లెజెండ్ వెంకటేష్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. BikeWo పై వెంకటేష్‌కి ఉన్న విశ్వాసం మరియు నమ్మకం మాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయి, అయితే వీరి సహకారముతో మేము మరింత వేగంగా ముందుకు సాగుతాము. మేము అనేక వ్యూహాత్మక అంశాలలో అతనితో కలిసి పని చేస్తాము.

BikeWo తో చేతులు కలిపిన విక్టరీ వెంకటేష్.. ఎందుకంటే?

బ్యాటరీ ఎక్స్చేంజ్ మరియు ఛార్జింగ్ పాయింట్‌లతో EV కోసం మౌలిక సదుపాయాలను సృష్టించడం మరియు వ్యవస్థాపకతను ప్రారంభించడం ద్వారా యువ భారతీయులకు అనుకూలంగా ఉండటమే కాకుండా ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది, కావున కంపెనీ ఎంతో నిబద్దతతో ఎప్పటికప్పుడు తన నెట్‌వర్క్‌ విస్తరిస్తూ ఉంటుంది.

BikeWo తో చేతులు కలిపిన విక్టరీ వెంకటేష్.. ఎందుకంటే?

అదే సమయంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. EV బైక్ సెక్టార్‌ను మరింత క్రమబద్ధీకరించి, మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందించే BikeWo ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. BikeWo అనేది EV 2W ఛార్జింగ్ కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. కంపెనీ యొక్క వృద్ధికి నా వంతు తప్పకుండా కృషి చేస్తాను అని అన్నారు.

BikeWo తో చేతులు కలిపిన విక్టరీ వెంకటేష్.. ఎందుకంటే?

BikeWo కంపెనీ విషయానికి వస్తే, దీనిని విద్యాసాగర్ రెడ్డి స్థాపించారు. ఇతనికి దాదాపు సేల్స్ మరియు బిజినెస్ డెవలప్‌మెంట్‌లో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2021లో దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ కంపెనీ టెక్నాలజీని పెంచడానికి మరియు పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

BikeWo తో చేతులు కలిపిన విక్టరీ వెంకటేష్.. ఎందుకంటే?

BikeWo తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న కాలంలో అత్యధిక సంఖ్యలో ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆ సమయంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి కొంత సంకోచిస్తున్నారు, అయితే రాబోయే రోజుల్లో ఈ సమస్య ఉండే అవకాశం ఉండదు.కావున రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగం మరింత పెరుగుతుంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వాలు కూడా చాలా ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎక్కువ రాయితీలను కూడా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు పొందవచ్చు.

Most Read Articles

English summary
Actor venkatesh daggubati invest in ev company
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X