బొమ్మ కార్ల నుంచి.. లగ్జరీ కార్లు.. తమిళ హీరో విజయ్ జీవితం ఎందరికో ఆదర్శం
కోలివుడ్‌లో ప్రస్తుతం అతిపెద్ద స్టార్ హీరోగా నటుడు విజయ్ (దళపతి) ఉన్నారు. సూపర్ హిట్ సినిమాలతో నేషనల్ లెవల్‌లో తనకంటూ ఓ గుర్తింపు సాధించారు. తమిళనాడు యువతతో పాటు తెలుగులో విజయ్ క్రేజ్ చెప్పలేనిది. తాజాగా ఈ హీరో 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సంవత్సరం ఆయనకు సరికొత్త ఇన్నింగ్స్ అని చెప్పాలి ఎందుకంటే ఆయన తమిళనాట రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఇన్ని రోజులు సినిమాలు, సామాజిక సేవల్లో పాల్గొన్న ఈ సూపర్ హీరో ఇప్పుడు సరికొత్త ఇన్నింగ్స్‌ని ఆరంభించాడు. వచ్చే ఎన్నికల్లో విజయ్ స్థాపించిన పార్టీ పోటీచేయనుంది. ఈ ప్రముఖ నటుడికి చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆ లిస్ట్ మీకోసం..
తన చిన్నతనం నుంచే కార్లపై విజయ్ ఇష్టాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా తన బాల్యంలోనే విజయ్ బొమ్మ కార్లు కొనడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత పెద్దయ్యాక సినీ ఇండస్ట్రీలో మంచి స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి తన సంపాదనతో ఇష్టమైన కార్లు కొనడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం విజయ్ దగ్గర వింటేజ్ కార్ల నుంచి మోడరన్ మినీ కూపర్ వరకు అన్నీ ఉన్నాయి.

1990వ దశకంలో విజయం సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే రాణిస్తున్నాడు. అప్పటి టాటా మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న కార్లలో టాటా ఎస్టేట్ కారుపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉన్నాడు. విజయ్ కొనుగోలు చేసిన మొదటి కారుగా టాటా ఎస్టేట్ నిలిచింది. దీనిని రూ.2.52 లక్షలకు కొనుగోలు చేశాడు. దేశంలో ప్రజాదరణ పొందిన కార్లలో ఎస్టేట్ ఒకటిగా ఉంది. ప్రస్తుతం టాటా కంపెనీ భారతదేశంలోని ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటి.
అప్పట్లో ఖరీదైన లగ్జరీ కారుగా కనిపించిన నటుడు విజయ్ తన స్నేహితులతో కలిసి టాటా ఎస్టేట్ కారులో చెన్నైలో తిరుగుతూ కనిపించిన వీడియోలు ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించి పాత ప్రీమియర్ 118 NE కారు కొన్నాడు. ఇది పాత క్లాసిక్ కారు కావడంతో విజయ్ ఈ ప్రీమియర్ కారును రూ.6 లక్షలకు కొనుగోలు చేశాడు.

విజయ్ ఈ ప్రీమియర్ కారు కొన్న తర్వాత రేంజ్ పెరగడం మొదలైంది. ఆ తర్వాత ఖరీదైన టాటా సియెర్రా కారును రూ .15 లక్షలకు, టయోటా ఇన్నోవా క్రిస్టాను రూ .20 లక్షలకు కొనుగోలు చేశారు. ఇన్నోవా విజయ్‌కి ఇష్టమైన కారుగా ఉంది. కొన్నేళ్లుగా తన రోజువారీ రవాణా కోసం ఇన్నోవా క్రిస్టాను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఇన్నోవాను వాడే ఆ రోజుల్లో విజయ్ సినీ ప్రయాణం ఓ స్థాయికి వెళ్లింది. దీంతో అతను క్రేజీ అమాంతం పెరిగిపోయింది. తక్కువ సమయంలోనే విజయ్ తన మార్క్ యాక్టింగ్‌తో తమిళంలో కింగ్ మేకర్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి ఇంకా ఖరీదైన కొత్త లగ్జరీ కార్లను కొనడం ప్రారంభించాడు. లగ్జరీ కార్ల పార్కింగ్ కోసం విజయ్ తన ఇంటి పైకప్పులో కొంత భాగాన్ని కేటాయించాడు.

కార్లను లిఫ్ట్ ద్వారా మేడపైకి తీసుకెళ్తారు. తన వద్ద ఉన్న లగ్జరీ కార్లలో ప్రధానమైనది రోల్స్ రాయిస్ ఘోస్ట్ అత్యంత కాస్ట్లీ కారుగా ఉంది. ఈ రోల్స్ రాయిస్ పన్ను చెల్లించే విషయంలో అతను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీనితో పాటు మరో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫాంటమ్ కూడా ఉంది. రోల్స్ రాయిస్ ధర రూ. 8-9 కోట్ల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.
విజయ్ వద్ద ఆడి A8L, నిస్సాన్ ఎక్స్-ట్రయల్, మినీ కూపర్ లగ్జరీ కారు ఉన్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ నటుడు విజయ్ వద్ద 2 రోల్స్ రాయిస్ కార్లు ఉండటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పాలి. దీన్నిబట్టి నటుడు విజయ్ కారు ప్రేమికుడో అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications








