BMW లగ్జరీ కారులో హీరో విజయ్ ప్రయాణం.. ఈ కారులో ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
దక్షిణాది సినిమా పరిశ్రమ ప్రముఖ నటుల్లో విజయ (Actor Vijay) ఒకరు. హీరో విజయ్ నటించిన చాలా సినిమాలు ఘన విజయం సాధించాయి. తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను విజయ్ సంపాదించుకున్నారు. నటనతోనే కాకుండా సింప్లీసిటీతో విజయ్ ఎంతో మందిని ఆకట్టుకున్నారు. విజయ్ హీరోగా నటించిన లియో ఇటీవల విడుదల అయింది.
హీరో విజయ్ అనేక లగ్జరీ కార్లను (Actor Vijay car collection) కలిగి ఉన్నారు. తాజా లియో చిత్ర నిర్మాత కుమారుడి వివాహం చెన్నైలో జరిగింది. ఈ పెళ్లికి హీరో విజయం లగ్జరీ BMW 5 సిరీస్ 530DM స్పోర్ట్స్ (BMW 530D M Sports) కారులో వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కారు గురించి పలువురు చర్చించుకుంటున్నారు.

చెన్నై నగరంలో.. : బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారును చెన్నై నగరంలో ప్రయాణించేందుకు విజయ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ఇటీవల షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లినప్పుడు ఈ కారులో ప్రయాణం చేశారు.
నటుడు విజయ్ ప్రయాణించిన BMW 530D M స్పోర్ట్స్ కారు బీఎండబ్ల్యూ నుంచి విడుదలైన అత్యుత్తమ కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు 2993cc 6 సిలిండర్ ఇన్‌లైన్ 4 వాల్స్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 3L b57 టర్బోఛార్జడ్ i6 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

17.4 కి.మీ మైలేజీ : ఈ ఇంజిన్ గరిష్ఠంగా 261 bhp శక్తిని మరియు 620Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బీఎండబ్ల్యూ కారు కేవలం 5.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. మరియు కారు గరిష్ఠంగా 250 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ బీఎండబ్ల్యూ 530D M స్పో్ర్ట్స్ కారు లీటరుకు 17.4 కి.మీ మైలేజీని ఇస్తుందని తెలుస్తోంది.
ఆ వేగం దాటితే బీప్ సౌండ్.. : ఈ కారు అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ వాహనం 80 కి.మీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే బీప్ సౌండ్ చేస్తూ అప్రమత్తం చేస్తుంది. అదే కారు నిరంతర వేగం పెంచుతూ 120 కి.మీ వేగం దాటితే కారు వేగాన్ని నియంత్రించగలిగేలా బీప్ శబ్దం వినబడుతూనే ఉంటుంది.

దీంతోపాటు అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. యూరో NCAPలో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ కారులో ఎమర్జెన్సీ బ్రేక్ లైట్ ఫ్లాష్, రియర్ ట్రి పాయింట్ సీట్ బెల్ట్, రియర్ ప్యాసింజర్ హెడ్ రెస్డ్, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు మరియు సీట్ బెల్ట్ వార్నింగ్ వంటి అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.
దీంతోపాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్- EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం-ESP, హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన ABS ( యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్). 4-జోన్ ఆటోమేటిక్ AC, 360 డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్, అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

హీరో విజయ్ ఈ కారును 2020 సంవత్సరంలో కొనుగోలు చేశారు. అంటే సుమారుగా 3 సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. విజయ్ కారు కార్బన్ మెటాలిక్ రంగును కలిగి ఉంది. ఈ కారు ఆల్పైన్ వైట్ కలర్‌లోనూ లభిస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.75 లక్షలుగా (ఎక్స్‌షోరూం) గా ఉంది.


Click it and Unblock the Notifications








