లగ్జరీ కారు దిగుమతి స్కామ్: స్టాలిన్ ఇంట్లో సిబిఐ సోదాలు

By Ravi

ఇప్పుడిప్పుడే హీరోగా అటు తమిళంలోను ఇటు తెలుగులోను పేరు తెచ్చుకుంటున్న తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. లగ్జరీ కార్లంటే మోజు పడే స్టాలిన్ విదేశాల నుంచి హమ్మర్ కారును దిగుమతి చేసుకున్నాడు. అయితే, ఈ కారును దిగుమతి చేసుకునే సమయంలో లెక్కల్లో తప్పులు చూపి, ప్రభుత్వానికి పన్ను ఎగవేసి పంగనామం పెట్టారు.

ఈ విషయం కాస్తా సిబిఐకు తెలియడంతో స్టాలిన్ ఇంటిపై ఆకస్మిక తనిఖీలను చేసింది. దీంతో అసలు బండారం బయటపడింది. కేవలం ఉదనియధిని ఇంటిని మాత్రమే కాకుండా, మరొక తమిళ నటుడు విజయ్ ఇంటిని కూడా సిబిఐ అధికారులు సోదా చేసినట్లు సమాచారం. విజయ్ వద్ద కూడా విలాసవంతమైన కార్లు చాలానే ఉన్నాయి. విజయ్ ఇటీవలే ఓ రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసినదే.

ఉదయనిధి స్టాలిన్ 'హమ్మర్ హెచ్3' లగ్జరీ కారు ఉంది. అంతేకాకుండా, ఇతని వద్ద మాసేరటి జిటిఓ, పోర్షే కెయిూన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో కొందరు ప్రముఖులు ఇలా విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకొని తప్పుడు పేపర్లతో దిగుమతి సుంఖాలను ఎగవేసిన కేసులు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం డైరక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ వీరి కూపీ లాగే పనిలో నిమగ్నమై ఉంది.

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

లగ్జరీ కారు దిగుమతి స్కామ్‌లో ఉదయనిధి స్టాలిన్ ఇంటిపై గురువారం సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

విజయ్ కారు

విజయ్ కారు

ఈ కుంభకోణంలో తమిళ నటుడు విజయ్ ఇంటిని కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. విజయ్ ఇటీవలే ఓ రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కోట్ల రూపాయల విలుల చేసే హమ్మర్ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, ప్రభుత్వాన్ని దిగుమతి సుంఖాన్ని ఎగివేసినట్లు అభియోగాలు వస్తున్నాయి.

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

హమ్మర్ జనరల్స్ మోటార్స్ అందిస్తున్న అత్యంత శక్తివంతమై ఎస్‌యూవీ బ్రాండ్. అయితే, గడచిన 2009లో సంభవించిన ఆర్థిక మాంద్యం కారణంగా ప్రస్తుతం ఈ మోడల్‌ను జనరల్ మోటార్స్ ఉత్పత్తి చేయటం లేదు.

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

ధోనీ, హర్బజన్ సింగ్, సునీల్ శెట్టి, కమల్ హాస్, కర్ణాటక మాజీ ఎంపి శ్రీరాములు తదితర ప్రముఖుల వద్ద కూడా ఈ ఎస్‌యూవీలు కొలువుదీరి ఉన్నాయి.

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ వద్ద మాసేరటి జిటిఓ, పోర్షే కెయిూన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం.

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

ఉదయనిధి స్టాలిన్ కారు

మాసేరటి జిటిఓ

మాసేరటి జిటిఓ

మాసేరటి జిటిఓ

మాసేరటి జిటిఓ

మాసేరటి జిటిఓ

మాసేరటి జిటిఓ

పోర్షే కెయిూన్

పోర్షే కెయిూన్

పోర్షే కెయిూన్

పోర్షే కెయిూన్

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

Most Read Articles

English summary
Vijay and producer-turned-actor Udhayanidhi Stalin's lavish cars have reportedly come under CBI scanner. A team of 7 CBI officers conducted a raid at DMK leader Mk.Stalin's house today. It appears the raid is in connection with import of a car. Udayanidhi Stalin allegedly imported Hummer by evading duty Stalin clan have seen to be using Hummer, maserati gto, Porsche cayenne and a bmw x5 cars.
Story first published: Thursday, March 21, 2013, 14:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X