ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో హాట్ బ్యూటీ.. లగ్జరీ డ్రీం కారును సొంతం చేసుకున్న ఆకాంక్ష పూరి
బాలీవుడ్ నటి నటులకు ఎక్కువగా లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం, మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయిందంటే చాలు దాని గురించి వాకబు చేసి తమకు నచ్చే విధంగా ఉన్నట్లయితే వెంటనే కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ ఆకాంక్ష పూరి (akanksha puri) ఈ మధ్య కొత్తగా ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈమె కొన్నటువంటి కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్ (landrover defender). డీలర్ నిర్వహించిన వేడుకలో ఆకాంక్ష తన కొత్త SUVని డెలివరీ తీసుకుంటున్నట్లు ఒక వీడియోలో కనిపించింది. 'కార్ హోల్‌సేల్ బజార్' అనే షోరూమ్ నిర్వహణ ప్రమోషనల్ వీడియో కోసం ఈ డెలివరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది.
ఆమె లగ్జరీ కారు కొనుగోలు సంఘటనతో పాటు, ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆకాంక్ష పూరి స్టైల్, ఆమె స్పందన, వీడియో క్లిప్ ఇవన్నీ ఈ వైరల్ కంటెంట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. ఒక కార్ డెలివరీ ఈ స్థాయిలో గ్రాండ్‌గా జరుగుతుందని ఎవరు ఊహించగలరు? షోరూమ్ మొత్తం ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కారును డెలివరీని ఎప్పటికి గుర్తిండిపోయేలా క్రాకర్స్ కాలుస్తూ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంలో నటి ధరించిన దుస్తులు షోరూమ్ సిబ్బందితో పాటు హాజరైన వారందరినీ ఆకట్టుకున్నాయి. లగ్జరీ, స్టైల్, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డిఫెండర్ కారును సొంతం చేసుకుని తన కలను నెరవేర్చుకున్నారు. ఆ వీడియోను చూసినట్లయితే ఆకాంక్ష తన కొత్త SUV డెలివరీ కోసం డీలర్‌షిప్‌కి రాగానే, అక్కడున్న సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. తన BMWలో ఎంట్రీ ఇచ్చి, కొత్త కారును తీసుకోవడానికి సంతోషంగా ముందుకు వచ్చింది.
ఈ ప్రత్యేక సందర్భంలో ఆమె ఆనందంతో కేక్ కట్ చేసి, అక్కడున్న వారితో తన సంతోషాన్ని పంచుకుంది స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునే డిఫెండర్ దగ్గర ఆమె కొన్ని ఫోటోలకు స్టైలిష్‌గా పోజులిచ్చింది. ఆకాంక్షతో పాటు, అనేక టాప్ ఇండియన్ సెలబ్రిటీలు ఈ లగ్జరీ SUVని తమ గ్యారేజ్‌లో ఉంచుకున్నారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ డిఫెండర్‌నే ఉపయోగిస్తున్నారు.

ఈ లెజెండరీ SUV 90 (షార్ట్ వీల్‌బేస్), 110 (స్టాండర్డ్ వీల్‌బేస్), 130 (లాంగ్ వీల్‌బేస్)లో అందుబాటులో ఉండగా, నటి 110 మోడల్‌ను ఎంచుకుంది. భారతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర వచ్చేసి రూ. 1.03 కోట్లు. అయితే ఇది కేవలం ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. నగరాలను బట్టి ఆన్‌రోడ్ ధర మరింత ఎక్కువగా ఉంటుందని అందరు గమనించాలి. ఈ డిఫెండర్ 110 మూడు ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది.
ఈ కారు సెలబ్రిటీల ఇష్టాలకు అనుగుణంగా డజన్ల కొద్ది లగ్జరీ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ SUV లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బలమైన నిర్మాణం, అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యం, అత్యాధునిక సాంకేతికతలతో ఇది ప్రతిఒక్కరి కలల కారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ తారలు, క్రికెటర్లు తమ గ్యారేజీలో దీన్ని ఉంచుకోవడం గర్వంగా భావిస్తారు.

ఇప్పుడు, ఈ ప్రీమియం SUV ను తన కార్ల కలెక్షన్‌లోకి ఆకాంక్ష పూరి చేరింది. ఇది గుంతలు, ఎత్తుపల్లాలు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణాన్ని సాగిస్తుంది. దీని శక్తివంతమైన ఇంజిన్, అద్భుతమైన సస్పెన్షన్ వ్యవస్థ, ప్రయాణికుల సేఫ్టీ కోసం అత్యుత్తమైన ప్రమాణాలాతో ఈ కారు ప్రసిద్ధ ఎస్‌యూవీగా మార్చేశాయి. దేశంలోని ధనవంతులకు ఇది బాగా ఇష్టమైన మోడల్.


Click it and Unblock the Notifications








