సెలెబ్రిటీలల్లో అరుదైన నటి.. ఆడి, బెంజ్‌ కార్లను వదిలేసి మారుతి సుజుకి కారుని కొని వైరల్‌ అయ్యింది!

బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఇతర సినీ ఇండస్ట్రీలలో నటీ, నటులు కార్లను కొనుగోలు చేయడం అనేది సర్వసాధారణం. వారికి ఒక్క హిట్టు పడిందంటే చాలు లగ్జరీయస్‌ కార్లను కొనుగోలు చేస్తారు. ప్రతీ రోజు దేశంలో ఎక్కడో ఓ దగ్గర సెలెబ్రిటీలు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, లంబోర్ఘిని, ఫెరారీ వంటి కార్లు తమ గొప్పతనాన్ని చాటుతాయని సెలెబ్రిటీలు భావిస్తారు. అందులో భాగంగానే సినీ పరిశ్రమలో ఎక్కువ మంది లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు.

అయితే మారుతి సుజుకి కార్లను సినీ పరిశ్రమ పెద్దలు కొనడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే మారుతి భారతదేశంలో మధ్యతరగతి మరియు పేద వర్గాల కోసం చౌకైన కార్లను అందిస్తుంది. ధర చాలా తక్కువగా ఉండటం, అవి తమ హోదాకు సరిపోలకపోవనే ఉద్దేశంతో ధనవంతులు, సెలెబ్రిటీలు మారుతి కార్లను కొనుగోలు చేయరనే అపోహా ఉంది.

Actress and singer Abhirami Suresh Buys Maruti Suzuki Jimny

అయితే తాజాగా అందుకు భిన్నంగా సినీ పరిశ్రమకు చెందిన ఓ నటి మారుతి సుజుకి కారును కొనుగోలు చేసింది. మలయాళ నటి, సింగర్ అభిరామి సురేష్ (Abhirami Suresh) మారుతి సుజుకి జిమ్నీ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. ఇది చిత్ర పరిశ్రమలోని పలువురిని ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా అదే సమయంలో ఆమె సింప్లిసిటీని హైలైట్ చేసింది.

మారుతి సుజుకి జిమ్నీ ఆ కంపెనీ లైనప్‌లో ఫ్లాగ్‌షిప్‌ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా ఉంది. ఇది మహీంద్రా థార్‌కి ప్రత్యర్థిగా ఉంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ‌అమ్మకాలు సరిగ్గా లేవు. అయితే ఆమె జిమ్నీని కొనుగోలు చేయడం నిజంగా పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ జిమ్నీ ఎస్‌యూవీ ధర రూ.12.74 లక్షలు నుంచి టాప్ వేరియంట్ ధర రూ.14.79 లక్షల ( ఎక్స్ షోరూమ్)గా ఉంది.

మారుతి జిమ్నీ స్పెసిఫికేషన్లు: థార్ మరియు ఫోర్స్ గూర్ఖా వంటి ప్రత్యర్థులతో పోలిస్తే మారుతి సుజుకి జిమ్నీ నడపడం చాలా సులభం. రోడ్డుపై తక్కువ స్థలం ఉన్నప్పటికీ దాని చిన్న బాడీ కలిగి ఉండటం వల్ల కఠినమైన రోడ్లలోనూ సాఫీగా కదులుతుంది. ఇది పై రెండింటితో పోల్చుకుంటే బరువులో కూడా చాలా తేలికగా ఉంటుంది. అందువల్ల ఇది ఒక లైట్‌ వెయిట్‌ వెహికిల్‌గా ఉంది.

మారుతి జిమ్నీ 5-డోర్‌లో 9 ఇంచెస్‌ స్మార్ట్ ప్లే ప్రో + ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో 4డబ్ల్యూడీ (ఫోర్ వీల్స్ డ్రైవ్) కూడా ఉంది. ఇది ఆఫ్‌రోడ్‌లో హై ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది.

అంతే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ అనే 2 గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 105 bhp పవర్ మరియు 134 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి జిమ్నీ మేము ఇంతకు ముందు పేర్కొన్న మహీంద్రా థార్‌తో మాత్రమే కాకుండా, అమ్మకాల పరంగా ఫోర్స్ గూర్ఖాతో కూడా పోటీ పడుతుంది. అయితే గత కొన్ని నెలలుగా ఈ జిమ్నీ సేల్స్‌ ఆశించిన రేంజ్‌లో లేవు. కంపెనీ లైనప్‌లో ఉన్న ఏకైక ఆఫ్‌రోడర్‌ కావడంతో కంపెనీ వీటి సేల్స్‌ని కొనసాగిస్తుంది. ధరల తగ్గింపు తదితర ఆఫర్లతో ఈ ఎస్‌యూవీ సేల్స్‌ని పెంచాలని భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2024, 18:37 [IST]
English summary
Actress and singer abhirami suresh buys new maruti suzuki jimny check details here
Read more on: #celebrity car #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+