Audi లగ్జరీ కారును కొనుగోలు చేసిన నటి సహద్ ఖన్నా.. ఇన్‌స్టా వీడియో వైరల్!
సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఎక్కువగా లగ్జరీ వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తారు. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ప్రముఖ మోడల్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. బాలీవుడ్, టాలీవుడ్ సహా వివిధ భాషలకు చెందిన నటులు ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ సీరియల్ నటి సహద్ ఖన్నా (chahat Khanna) ఖరీదైన ఆడీ కారును కొనుగోలు చేశారు.
బాలీవుడ్ ప్రముఖ సీరియల్స్‌లో ఒకటైన బడ్ అచ్చే లాగ్తే హై సీరియల్‌లో కీలక పాత్రను పోషించిన సహద్ ఖన్నా.. ఆడీ A6 లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ కారు డిజైన్, ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ కారు డ్యాష్‌బోర్డులో రెండు టచ్ స్క్రీన్లు ఉంటాయి. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు, మల్టీ జోన్ క్లైమెట్ కంట్రోల్, లేన్ డిపాచర్ వార్నింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఆడీ A6 సెడాన్ (Audi A6) 2.0 లీటర్ టర్బోఛార్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 245ps శక్తి మరియు 370Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు ఈ కారులో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ కారులో అనేక కీలక ఫీచర్లున్నాయి.
ఈ కారు 5 సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ సెడాన్ 73 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు లీటర్‌కు 14.11 kmpl మైలేజ్‌ని ఇస్తుంది. మరియు 530 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఫాగ్ లైట్లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
ఆడి a6 కారు గరిష్ట వేగం 250 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారు 4939mm పొడవు, 2110mm వెడల్పు, 1470mm ఎత్తును కలిగి ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165mmతో వస్తుంది. దీంతోపాటు అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ బటన్‌ను కలిగి ఉంటుంది.
ఆడి a6 సెడాన్ ధర రూ.61.56 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఆడి సెడాన్‌ను పూజ చేస్తున్న వీడియోను సహద్ ఖన్నా తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. పూజ అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం ఇన్‌స్టా వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 40 వేలకు పైగా లైక్ చేశారు.
సహద్ ఖన్నా చిన్నతనంలోనే అంటే 2002 సంవత్సరంలోనే ప్రకటనలో తొలిసారిగా నటించారు. ప్రసిద్ధ క్యాడ్‌బరీ చాక్లెట్ ప్రకటనలో కనిపించారు. అనంతరం ఓ టీవీ షోలో నటించారు. ఆ తర్వాత టీవీ సీరియల్స్‌లో వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రముఖ సీరియల్ నటుల్లో ఒకరిగా ఉన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








