చీరకట్టులో బైక్ రైడ్ చేసిన ప్రముఖ నటి.. మండిపడుతున్న నెటిజన్లు - ఎందుకంటే?

ఇటీవలే డుకాటీ మాన్‌స్టర్ సూపర్ బైక్ కొనుగోలు చేసిన ప్రముఖ నటి 'డైసీ బోపన్న' రైడింగ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కన్నడ మరియు తమిళ సినిమాల్లో నటిస్తూ ఎక్కువమంది అభిమానులను కలిగి ఉన్న నటి 'డైసీ బోపన్న' (Daisy Bopanna) హెల్మెట్ లేకుండా 'డుకాటీ మాన్‌స్టర్' (Ducati Monster) రైడింగ్ చేసింది. ఈ వీడియోను స్వయంగా నటి బోపన్న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇందులో హెల్మెట్ లేకుండా.. సంప్రదాయ భారతీయ దుస్తుతులతో కనిపించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Daisy Bopanna Riding Ducati Monster Bike Without Helmet

వీడియో షేర్ చేస్తూ.. యే హోతీ హై సాల్ కి షురూయాద్.. డుకాటీ కే సాత్.. అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బోపన్న తన స్నేహితురాలితో కలిసి బైకుపై రైడింగ్ చేయడం చూడవచ్చు. ప్రారంభంలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మాదిరిగా ఉన్న ప్రదేశంలో రైడింగ్ చేశారు. ఆ తరువాత పబ్లిక్ రోడ్డు మీద రైడింగ్ చేయడం చూడవచ్చు. ఇందులో బైకుపై ఉన్న ఇరువురూ హెల్మెట్ ధరించలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొందరు దయచేసి హెల్మెట్ ధరించండి అంటూ పేర్కొన్నారు. మీ జీవితాలు ఈ రీల్ కంటే చాలా విలువైనవి అని అన్నారు. అంతే కాకుండా కొందరు ముంబై పోలీసులను ట్యాగ్ చేసి, హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేసిన నటి మీద చర్యలు తీసుకోవాలని అన్నారు.

Daisy Bopanna Riding Ducati Monster Bike Without Helmet

గుడి పడ్వా సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి బహుశా ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా పబ్లిక్ రోడ్డు మీద ఒక సెలబ్రిటీ హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం చాలా తప్పు. ఇది ఎంతోమంది ఆమె అనుచరులను తప్పుదోవ పట్టిస్తుంది. ఇక గుడి పడ్వా అనేది మరాఠి మరియు కొంకణి హిందువులకు చాంద్రమాన కొత్త సంవత్సర ప్రారంభం అని తెలుస్తోంది.

ఇక డుకాటీ కంపెనీకి చెందిన మాన్‌స్టర్ విషయానికి వస్తే.. దీనికి 25 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. డుకాటీ నేక్డ్ స్పోర్ట్స్ బైకులను అందిస్తుంది. ఇక్కడ డైసీ బోపన్న కొనుగోలు చేసిన డుకాటీ బైక్ ప్రస్తుత తరం మోడల్ అని తెలుస్తోంది. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి దాని మునుపటి మోడల్ కంటే సన్నగా కనిపిస్తుంది.

సుమారు రూ. 12.5 లక్షల విలువైన డుకాటీ బైక్ 937 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 110 బిహెచ్‌పి పవర్ మరియు 93 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, వీల్ కంట్రోల్ వంటి ఫీచర్స్ పొందుతుంది. డుకాటీ మాన్‌స్టర్ యూఎస్డీ ఫోర్క్‌లు, అడ్జస్టబుల్ మోనోషాక్‌ వంటి వాటిని పొందుతుంది.

డుకాటీ బైకులను ఇప్పటికే చాలామంది సెలబిట్రీలు కూడా కూడా తమ గ్యారేజిలో చేర్చారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ మొదలైన వారు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో డైసీ బోపన్న కూడా చేరారు. అయితే హెల్మెట్ లేకుండా పబ్లిక్ రోడ్డు మీద ప్రయాణించడం సురక్షితం కాదు. అనుకోని ప్రమాదం జరిగితే.. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. హెల్మెట్ ధరిస్తే.. ఆ ప్రమాదం నుంచి కొంతవరకు బయటపడవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 16, 2024, 9:11 [IST]
English summary
Actress daisy bopanna riding ducati monster bike without helmet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+