చూపు తిప్పుకోలేని అందం.. bmw కారు దిగుతూ చీరలో దివిలా మెరిసిన హీరోయిన్.. ఇంతకి ఆమె ఎవరో గెస్ చేయండి

ఇండియాలో సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం అన్న సంగతి అందరికి తెలిసిందే. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయితే చాలు, వెంటనే దాని గురించి వాకబు చేసుకుని నచ్చినట్లయితే తమ గ్యారేజీలోకి చేర్చుకుంటారు. ఇటీవల కాలంలో పలువురు కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లతో కెమెరాల కంట పడుతున్న వీడియోలు సోషల్ మీడయాలో తెగ కనిపిస్తున్నాయి. తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమంలో ఇటీవల కాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న దిశా పటాని ఖరీదైన BMW కంపెనీకి చెందిన కారుతో కనిపించారు. ఆమె కారు మోడల్ BMW 7 సిరీస్‌. ఇది కేవలం కార్‌ మాత్రమే కాదు, ప్రస్టేజ్, క్లాస్, టెక్నాలజీకి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సిరీస్‌కు ఉన్న ఆదరణ సామాన్యుల నుంచే కాదు, దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తుల నుంచి కూడా వస్తోంది.

BMW 7 సిరీస్ లగ్జరీ కారును రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలే కాదు, సినీ ప్రపంచానికి చెందిన తారలు కూడా పెద్ద ఎత్తున దీన్ని వినియోగిస్తున్నారు. ఈ ప్రీమియమ్ సెడాన్‌కి దేశంలో క్రేజ్‌ వేరే స్థాయిలో ఉంటుంది.భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ. వీరిద్దరూ గతంలో అప్‌డేట్ చేసిన BMW 7 సిరీస్ లగ్జరీ కార్లను వినియోగించారు. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటులుకూడా దీన్ని వాడుతున్నారు.

Disha Patani Spotted Cars

వారిలో షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి వాళ్లు BMW 7 సిరీస్ రెగ్యులర్ వెర్షన్‌ను తమ డేలీ డ్రైవ్‌ల కోసం ఉపయోగిస్తున్నారు. లగ్జరీ కార్‌ను మన దేశంలోని ఎందరో సెలబ్రిటీలు తమ స్టైల్ స్టేట్మెంట్‌గా ఉపయోగిస్తున్నారు. అలాంటి ప్రముఖుల జాబితాలో తాజాగా దిశా పటానీ పేరు కూడా నిలిచింది. పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ కారును కలిగి ఉంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ఆమె లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను మరింత హైలైట్ చేస్తోంది. ఈ వీడియోలో దిశా పటానీ సంప్రదాయ చీరకట్టులో BMW 7 సిరీస్ కారులో నుంచి దిగుతుండటం చూడొచ్చు. ఆమె కారు దిగగానే, వెంటనే ఇద్దరు సహాయకురాళ్లు ఆమె చీరను సెట్ చేస్తూ, జుట్టును సర్దుతున్నారు. ఆమె అక్కడి వారిని తన అందంతో పాటు, BMW 7 సిరీస్ లగ్జరీ కారుతో అలరించింది.

Disha Patani Spotted With Bmw 7 Series

దీని తరువాత, దిశా పటాని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆమె ఏదో ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చినప్పుడు తీసిన వీడియో వైరల్ అవుతుంది. దిశా పటానీతో పాటు కనిపించిన కారు BMW 7 సిరీస్ వ్యక్తిగత అవసరాలకు వాడుతుంటారు. కారు రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించగా, నవంబర్ 2023లో ఆమె పేరుతో రిజిస్టర్ చేసినట్లు స్పష్టమైంది. ఇది BMW 7 సిరీస్‌కు చెందిన 740d M స్పోర్ట్ వేరియంట్‌ కారు.

BMW 7 సిరీస్‌కు చెందిన 740d M స్పోర్ట్ వేరియంట్‌ కారు భారత మార్కెట్లో ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 1.87 కోట్లుగా ఉండగా, ఆన్-రోడ్ ధర సుమారు రూ. 2.40 కోట్ల వరకు చేరుతుంది. ఇది దిశా 3.0-లీటర్ 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, గరిష్టంగా 286 PS పవర్, 650 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జత చేశారు.

Disha Patani Cars Details

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 17, 2025, 13:17 [IST]
English summary
Actress disha patani spotted with bmw 7 series 740d m sport its wirth rs 2 40 crore
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+