సూపర్‌ కార్ల టూర్‌.. నటి గాయత్రి జోషి దంపతులకు గాయాలు.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ సినిమా స్వదేశ్‌ నటి గాయత్రీ జోషి లంబోర్గిని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జరిగినప్పుడు భర్త, ప్రముఖ వ్యాపారవేత్త వికాస్‌ ఒబెరాయ్‌ కూడా ఆమె వెంట ఉన్నారు. ఈ ఘటన ఇటలీలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ రోడ్డు ప్రమాదాలంలో నటి గాయత్రి జోషి, వ్యాపారవేత్త వికాస్‌ ఒబెరాయ్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయాన్ని నటి గాయత్రీ జోషి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటలీలో జరిగిన సూపర్‌కార్ల ర్యాలీలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మరణించారు.

 Actress Gayatri joshi and businessman vikas oberoi car accident

ప్రమాదానికి సంబంధించిన వీడియో ఆధారంగా ఇటలీలోని ఓ ఇరుకైన రోడ్డుపై సూపర్‌ కార్ల టూర్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా ఒక్కో సూపర్‌ కార్లు వేగంగా దూసుకొస్తున్నాయి. అదే రోడ్డులో ఓ క్యాంపర్‌ వ్యాన్‌ కూడా ప్రయాణం చేస్తోంది. అయితే కొంత నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. కొన్ని కార్లు క్యాంపర్‌ వ్యాన్‌ను దాటి ముందుకెళ్లాయి.

అదే రోడ్డుపై లంబోర్గిని హురాకాన్‌లో గాయత్రి, వికాస్‌లు ప్రయాణం చేస్తున్నారు. అంతలో ఓ ఫెరారీ కారు.. ఈ వాహనాలను ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే అనుకోకుండా లంబోర్గిని కారును ఓ పక్క నుండి ఢీకొట్టింది. దీంతో లంబోర్గిని కారు అదుపుతప్పి క్యాంపర్‌వాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాంప్‌వాన్‌ బోల్తా పడగా.. ఫెరారీ కారులో మంటలు చేలరేగాయి.

 Actress Gayatri joshi and businessman vikas oberoi car accident

ఈ ప్రమాదంలో ఫెరారీలో ప్రయాణం చేస్తున్న స్విట్జర్లాండ్‌కు చెందిన మెలిస్సా క్రౌత్లీ, మార్కస్‌ క్రౌట్లీ దంపతులు మృతిచెందారు. బోల్తాపడిన క్యాంపర్‌వ్యాన్‌లోని దంపతులకు కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రాంతం నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాద సమయంలో నటి గాయత్రి, వికాస్‌లు ప్రయాణం చేస్తున్న లంబోర్గిని హురాకాన్‌ కారులో అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్‌ అలెర్ట్‌, చైల్డ్‌ లాక్‌, ఓవర్‌ స్పీడ్‌ వార్నింగ్, యాంటీ థెప్ట్‌ ఇంజిన్ ఇమ్మొబిలైజర్‌, స్వీడ్‌ సెన్సింగ్‌ డోర్‌ లాక్, ఎమర్జెన్సీబ్రేక్‌ లైట్‌, సెంట్రల్‌ లాకింగ్‌ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

 Actress Gayatri joshi and businessman vikas oberoi car accident

ఈ ప్రమాదానికి అధిక వేగం, సహా ఇరుకైన రోడ్లపై సూపర్‌కార్‌ టూర్‌ నిర్వహించడం కూడా కారణం. ఇలాంటి టూర్‌లు వినియోగంలో లేని రహదారులు లేదా ప్రత్యేకమైన మైదానాల్లో, లేదా అధికారులు అనుమతిలో ట్రాఫిక్‌ను నియంత్రించి ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. లేకుండా ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 5, 2023, 11:06 [IST]
English summary
Actress gayatri joshi and businessman vikas oberoi car accident in italy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+