కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ 'గుల్ పనాగ్'

సాధారణంగా సెలబ్రెటీలకు లగ్జరీ కార్స్ మరియు బైకులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి వాహనాలపై అమితాసక్తి ఉండటం వల్ల కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో అర్జున్ కపూర్, కృతి సనన్ మరియు రామ్ చరణ్ తేజ్ ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్ అయిన Mercedes Benz యొక్క Maybach GLS 600 SUV కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం మనం మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు గుల్ పనాగ్ ఒక కస్టమైజ్డ్ Jawa 42 బైక్ కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

'గుల్ పనాగ్' ఒక భారతీయ నటి మాత్రమే కాదు, వాయిస్ యాక్టర్, మోడల్ మరియు మిస్ యూనివర్స్ పోటీలలో కూడా పాల్గొంది. పనాగ్ 2003 లో ధూప్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. తరువాత ఆమె జుర్మ్ మరియు టీవీ సిరీస్ కాష్మీర్ వంటి చిత్రాలలో కూడా నటించి బాగా పాపులర్ అయ్యింది.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

గుల్ పనాగ్ ఎక్కువగా బైక్స్ మరియు కార్లను నడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఇందులో భాగంగానే ఈమె తన గ్యారేజీలో కొత్త Jawa 42 రెట్రో బైక్‌ను చేర్చింది. పనాగ్ కొనుగోలు చేసిన కొత్త బైక్ లుమోస్ లైమ్ కలర్‌లో ఉంది. ఈ కొత్త బైక్ కి సంబంధించిన ఫోటోలు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

ఇక్కడ కనిపించే ఫోటోలలో మీరు ఈ కొత్త బైక్ గమనించినట్లయితే, ఇది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ యొక్క రంగురంగుల చారలు Jawa లోగో పక్కన చూడవచ్చు. అంతే కాకుండా ఈ లోగో ఫ్యూయెల్ ట్యాంక్ మరియు సైడ్ ప్యానెల్స్‌లో కూడా గమనించవచ్చు.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్‌ పైన గుల్ పనాగ్ పేరు మరియు తన పుట్టిన సంవత్సరం కూడా ఉంది. గుల్ పనాగ్ వారి కొత్త జావా 42 బైక్‌లో కొన్ని అధికారిక జావా టూల్స్‌ని ఉపయోగించడాన్ని చూడవచ్చు. బైక్‌లో మ్యాట్ బ్లాక్ క్రాష్ గార్డ్, షార్ట్ ఫ్లై స్క్రీన్, హెడ్ లైట్ గ్రిల్ మరియు హామర్ హెడ్ స్పాయిలర్ ఉన్నాయి.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

ఈ కొత్త Jawa 42 బైక్ 293 సిసి ఫ్యూయెల్ ఇంజెక్షన్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 27.3 బిహెచ్‌పి పవర్ మరియు 27.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

Jawa Motorcycle (జావా మోటార్‌సైకిల్స్) తన కొత్త 2020 కొత్త Jawa 42 బైక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించింది. ఈ బైక్ ధర రూ. 1.69 లక్షల నుండి రూ. 1.83 లక్షల అరకు ఉంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

జావా పెరాక్ అనేది జావా మోటార్‌సైకిల్స్ యొక్క ప్రధాన బైక్. ఈ బైక్ భారతదేశంలో విక్రయించబడే మంచి బాబర్ స్టైల్ బైక్. ఈ బైక్ ఆకర్షణీయంగా డిజైన్ చేయబడిన సింగిల్ సీటర్ బైక్. పెరాక్ బైక్‌లో 334 సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ కూడా లిక్విడ్ కూల్డ్. జావా పెరాక్ బైక్ కలిగి ఉన్న 334 సీసీ ఇంజన్ 30.64 బిహెచ్‌పి పవర్ మరియు 32.74 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఈ బైక్ ధర రూ. 2.06 లక్షలు.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

గుల్ పనాగ్ కొత్త జావా 42 బైక్‌తో పాటు అనేక ఇతర బైకులు ఉన్నాయి. ఇందులో Royal Enfield Bullet Electra, BMW F 650 Funduro మరియు Triumph Bonneville T 120 బైక్ ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే గుల్ పనాగ్ కి బైకులపై ఎంత మక్కువ ఉందొ అర్థమవుతుంది.

కొత్త Jawa 42 బైక్ కొనుగోలు చేసిన బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్

ఇదిలా ఉండగా గుల్ పనాగ్ తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నందున, గుల్ పనాగ్ తన పాఠశాల విద్యను తమిళనాడు పాఠశాలలతో సహా 14 విభిన్న పాఠశాలల్లో పూర్తి చేశారు. 2014 లో చండీగఢ్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసింది. 1999 లో గుల్ పనాగ్ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అదే పోటీలో ఆమె మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కూడా గెలుచుకుంది. గుల్ పనాగ్ టెలివిజన్‌లో అనేక వాణిజ్య ప్రకటనలలో కనిపించారు.

Most Read Articles

English summary
Actress gul panag buys custom jawa 42 bike details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X