లగ్జరీ BMW కారులో తళుక్కుమన్న నటి హన్సిక.. ఈ కారు ధర, ఫీచర్లు గురించి తెలుసా?
నటి హన్సిక బాలనటిగా (Actress hansika) సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కొద్ది కాలంలోనే తెలుగు, తమిళం సహా హిందీ సినిమాల్లోనూ నటించి పాపులర్ అయ్యారు. అయితే సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు ఎక్కువగా లగ్జరీ కార్లను ఇష్టపడతారు. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మోడళ్లలో నచ్చినవి కొనుగోలు చేస్తుంటారు.
తాజాగా నటి హన్సిక సరికొత్త BMW 6 GT లగ్జరీ కారులో కనిపించారు. ఈ కారు గురించి తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కార్స్ ఫర్ యూ తన యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ కారును ఆమె కుటుంబ సభ్యులు బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది.

అయితే ఏ సందర్భంలో బహుమతి ఇచ్చారో తెలియలేదు. బీఎండబ్ల్యూ 6 GT లగ్జరీ కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన కారు తిరిగి.. కొద్ది సమయం అనంతరం అదే ప్రాంతంలోకి వెళ్లడం వీడియోలో గమనించవచ్చు.
బీఎండబ్ల్యూ 6 GT మినరల్ వైట్ షేడ్‌ను కలిగి ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ.72.50 లక్షల నుంచి రూ.75.90 లక్షల (ఎక్స్‌షోరూం) గా ఉంటుంది. అయితే హన్సిక 630i M spot వేరియంట్ ను కలిగి ఉన్నారు.

ఈ కారు భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం విడుదల అయింది. అయితే హన్సిక M Spot సిగ్నేచర్ లేదా M Sport రెగ్యూలర్ వేరియంట్‌ను కొనుగోలు చేశారా అనేది తెలియలేదు. స్పోర్ట్ సిగ్నేచర్ వేరియంట్ ధర రూ.75.90 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.
ఈ బీఎండబ్లూ 6 GT లగ్జరీ కారు 4- జోన్ క్లైమేట్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట‌్లు, పవర్డ్ టెయిల్‌గేట్, ఎలక్ట్రో ప్లేటెడ్ కంట్రోల్‌ను కలిగి ఉంది. అలాగే 7.0 అంగుళాల పుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టస్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

భద్రతపరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్బెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ డిఫ్ లాక్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. M స్పోర్ట్ వేరియంట్ BS6 కంప్లైంట్ 2.0 లీటర్ టర్బోఛార్జడ్ ఇన్‌లైన్ 4- సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 254bhp శక్తి, 400Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








