లగ్జరీ బెంజ్ కారును కొనుగోలు చేసిన నటి ఇషా తల్వార్.. ఈ కారు ప్రత్యేకతలు, ఫీచర్లు తెలుసా?
ఇషా తల్వార్.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2012 మలయాళ చిత్రం ద్వారా సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు 25 సినిమాల్లో నటించారు. తాజాగా నటి ఇషా తల్వార్ (Actress isha Talwar) మెర్సిడెస్ బెంజ్ GLC ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో మెర్సిడెస్ బెంజ్ GLC SUV (Mercedes Benz GLC SUV) ధర రూ.73.50 లక్షలు (ఎక్స్‌షోరూం) నుంచి రూ.74.50 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ కారు GLC 300 4matic మరియు GLC 220D 4matic వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఎస్‌యూవీ 5 సీటర్ ఆప్షన్‌తో వస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ GLC.. 2- లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 258ps శక్తి, 400Nm గరిష్ఠ టార్క్‌ను కలిగి ఉంటుంది. అదే 2-లీటర్ డీజిల్ ఇంజిన్ 197 ps శక్తి మరియు 440Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.
మెర్సిడెస్ బెంజ్ GLC మైలేజీ : ఈ SUV 2 వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ SUV వేరియంట్‌ను బట్టి 14.7 kmpl నుంచి 19.4 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 240 కి.మీ గా ఉంది.

ఈ కారులో అనేక ఆకట్టుకొనే ఫీచర్లున్నాయి. 11.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ AC మరియు యాంబియంట్ లైటింగ్‌ను పొందుతుంది. వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, హెడ్ అప్ స్క్రీన్, 15 స్పీకర్ బర్మెస్టర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల సరౌండ్ వ్య్యూ కెమెరా ఫీచర్లున్నాయి.
భద్రతాపరంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), యూక్టివ్ బ్రేక్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. మెర్సిడెస్ బెంజ్ GLC SUV.. ఆడీ Q5, BMW X3, వోల్వో కార్లు పోటీగా ఉన్నాయి.

నటి ఇషా తల్వార్ మెర్సిడెస్ ఈ క్లాస్‌తోపాటు టయోటా ఇన్నోవా కార్లను కలిగి ఉన్నారు. మెర్సిడెస్ ఈ క్లాస్ ధర సుమారుగా రూ.80 లక్షలుగా ఉంది. అదే టయోటా ఇన్నోవో ధర రూ.17 లక్షలుగా ఉంది. తాజాగా GLC కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలను కలిగి ఉన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








