దేవర సినిమా హీరోయిన్‌పై ఘోరంగా ట్రోలింగ్‌.. కోట్లు విలువ చేసే కారు ఉంటే ఏ లాభం అంటూ ఎగతాళి! (వీడియో)

నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ప్రస్తుతం యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంది. తల్లిదండ్రులకు తగిన తనయురాలిగా ఇండస్ట్రీలో అతి కాలంలోనే మంచి ఫేమ్‌ని సాధించింది. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని దూసుకెళ్తుంది. తన తండ్రి పేరుని కానీ, తన తల్లి దివంగత శ్రీదేవీ ఫేమ్‌ని కానీ ఎక్కడా వినియోగించకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని కోరుకుంటుంది. ఈమె జూ.ఎన్టీఆర్‌ (Jr.NTR) హీరోగా తెరకెక్కుతున్న దేవర (Devara) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఆమె చేసిన వింత పని ఆమెను మరోసారి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

జాన్వీ కపూర్ వద్ద రూ.3.10 కోట్లు విలువ చేసే లెక్సస్‌ ఎల్‌ఎమ్‌ 350 హెచ్‌ (Lexus LM 350 H) లగ్జరీ కారును కొనుగోలు చేసింది. సినీ సెలెబ్రిటీలు, క్రికెటర్స్‌, పొలిటకల్ స్టార్స్‌ ఈ లగ్జరీ కారుని కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ రణ్ బీర్ కపూర్, తమిళ సూపర్ స్టార్ విజయ్‌, క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య ఈ లెక్సస్‌ కారుని కొనుగోలు చేసిన జాబితాలో ఉన్నారు.

Janhvi Kapoor Luxury Car

స్లైడింగ్ డోర్లతో వచ్చే ఈ కారు ఒక ఫ్లోటింగ్ లగ్జరీ ప్యాలెస్‌లా ఉంటుంది. అయితే జాన్వీ కపూర్ కొనుగోలు చేయడంపై కొందరు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఈ విషయం ఆమెకు ఏమీ తెలియదు. ఎందుకంటే ఈ ట్రోల్స్‌ అంతా సోషల్‌ మీడియాలో జరుగుతుంది. జాన్వీ తన లగ్జరీ ఎంపీవీలోని ఈ స్లైడింగ్ డోర్ క్లోజ్ చేయడానికి కష్టపడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఆ వీడియో ప్రకారం భారీ ఖరీదైన కారు ఓనర్ అయినప్పటికీ డోర్ ఎలా క్లోజ్ చేయాలో కూడా తెలియకపోవడాన్ని కొందరు ఎగతాళి చేస్తున్నారు. ఈ అల్ట్రా లగ్జరీ కారు డోర్ క్లోజ్ చేయడానికి జాన్వీ కపూర్ కష్టపడుతున్న ఈ వీడియోను కార్స్ ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ విడుదల చేసింది. ముంబయిలోని ఓ డబ్బింగ్ స్టూడియో నుంచి బయటకు వచ్చిన ఆమె తన లగ్జరీ ఎంపీవీ వెనుక సీట్లో కూర్చుంది.

Janhvi Kapoor Luxury Car

అయితే ఈ లగ్జరీ కారుకి ఇతర కార్ల వలె డోర్ ఉండదు. దీనిలోని స్లైడింగ్ డోర్లు మారుతి ఓమ్నీని పోలి ఉంటాయి. అయితే వాటిని క్లోజ్‌ చేయడానికి, తెరవడానికి ఎలక్ట్రానిక్ స్విఛ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. జాన్వీ కారు ఎక్కేలోపే ఆమె డ్రైవర్ వెనుక స్లైడింగ్ డోర్ తెరిచి ఉంచాడు. జాహ్నవి కూడా పైకి ఎక్కి కూర్చున్న తర్వాత ఫోటోలు తీయడానికి మీడియా వారు కోరారు.

అయితే అదే సమయంలో ఆమె కారు డోర్ క్లోజ్ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది క్లోజ్ కాలేదు. అప్పుడు జాన్వీ కపూర్ పూర్తిగా అయోమయంలో పడినట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇందులో డోర్ ఆటోమేటిక్ అని, బటన్లు, సెన్సర్లను ఉపయోగించి మూసివేయాలని మీడియా ప్రతినిధులు నటికి గట్టిగా అరుస్తూ చెప్పడంతో చిరునవ్వుతో సమాధానమిచ్చింది. ఆ తర్వాత డ్రైవర్ తన దగ్గర ఉన్న బటన్‌ ద్వారా డోర్ క్లోజ్ చేశాడు.

ఈ ఘటన జరిగిన క్షణాల్లో జాన్వీని ట్రోల్స్ చేయడం ఆరంభం అయ్యింది. లగ్జరీ కార్ల డోర్ ఎలా క్లోజ్ చేయాలో కూడా తెలియకుంటే ఎందుకు కొంటున్నారని కొందరు ప్రశ్నించారు. అయితే ఇకొందరు ఆమెకు సపోర్ట్‌ చేస్తు కామెంట్స్‌ చేశారు. సాధారణంగా మనుషులు ఇలాంటి తప్పులు చేయడం సహజమని., ఇలాంటి పరిస్థితులను ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉందని మరి కొందరు వాదించారు.

ఈ లగ్జరీ కారు ఆన్‌రోడ్‌ ధర రూ.3.10 కోట్లుగా ఉంది. ఈ లెక్సస్ ఎల్ఎమ్300హెచ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ గ్యారేజీలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ కారుగా ఉంది. ఈ లగ్జరీ ఎమ్‌పివిలో 48 ఇంచెస్‌ టీవీ, వెనుక భాగంలో ఫస్ట్ క్లాస్ ఎయిర్‌లైన్ తరహా రెక్లైనర్ సీట్లు, ప్రీమియం సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 23-స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 3, 2024, 14:06 [IST]
English summary
Actress janhvi kapoor struggled to close luxury lexus lm 300h door
Read more on: #india #celebrity car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+