మహీంద్రా కారులో హాట్ బ్యూటీ.. ఎయిర్‌పోర్ట్ మొత్తం ఆమెనే చూశారుగా! ట్రెండింగ్‌లో వీడియో
సినిమా తారలు ఎప్పుడూ ఫ్యాషన్ లుక్‌లోనే కనిపిస్తుంటారు. వారు ఎక్కడికి వెళ్లినా కెమెరాలు కూడా వారిని ఫాలో అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా విమానాశ్రయాల వద్ద వారి లుక్‌కి సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇదే తరహాలో ఇప్పుడు నటీ కంగనా శర్మ కూడా కెమెరాల కంట పడ్డారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌తో మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించారు. తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న కంగనా ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద కెమెరాల కంట పడ్డారు. హీంద్రా కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన SUV XUV700లో కంగనా శర్మ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కారు ప్రస్తుతం ఆటో ఔత్సాహికులను బాగా ఆకట్టుకుంటుంది.
కంగనా శర్మ కారణంగా మహీంద్రా XUV700 గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇది 7 సీటర్ మోడల్. దీని డీజిల్ ఇంజిన్ 2025 ఆర్థిక సంవత్సరంలో బాగా అమ్ముడుపోయింది. గణంకాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అమ్ముడైన XUV700 SUVలలో 75 శాతం డీజిల్ ఇంజన్లే ఉన్నాయి, మిగిలిన 25 శాతం మంది మాత్రమే పెట్రోల్ వెర్షన్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచారు.

మహీంద్రా XUV700 భారత మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ SUVగా పేరు తెచ్చుకుంది. ఇది M1, M2, M2 Pro, M3, M3 Pro లాంటి ప్రారంభ వేరియంట్ల నుండి AX5, AX5 లగ్జరీ, AX7, AX7 లగ్జరీ లాంటి హై-ఎండ్ మోడళ్ల వరకు దాదాపు 46 వేరియంట్లు అందుబాటులో ఉంది. ఇందులో 22 పెట్రోల్, 24 డీజిల్ వేరియంట్లు ఉండడం గమనార్హం. అవసరాలకి తగిన విధంగా పలు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది.
XUV700 రెండు శక్తివంతమైన ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఒకటి 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, రెండోది 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ వేరియంట్ 200 bhp పవర్‌ను విడుదల చేస్తుంది, అలాగే గరిష్టంగా 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక స్పోర్టీ ఫీల్‌తో డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇంకా, డీజిల్ ఇంజిన్ రెండు వేర్వేరు ట్యూనింగ్స్‌లో లభిస్తుంది. ఇది స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. దీని డీజిల్ వేరియంట్ బేస్ మోడళ్లను కంపెనీ 155 bhp పవర్, 360 Nm టార్క్ అందించేలా ట్యూన్ చేసింది. ఇవి సాధారణ ప్రయాణాలకు సరిపడేలా, తక్కువ ధరలో మంచి పనితీరును అందిస్తాయి. అయితే టాప్ వేరియంట్ల విషయానికి వస్తే, 185 bhp పవర్, 420 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
భారత మార్కెట్లో మహీంద్రా XUV700 ప్రారంభ ధర ప్రస్తుతం రూ. 14.49 లక్షలు. అదే సమయంలో, ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ. 25.14 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే స్వల్పంగా ఎక్కువగా ఉంటాయి. ఈ కారు మార్కెట్లోకి విడుదల అయి 4 ఏళ్లు కాలేదు. కానీ అప్పటికి 2.50 లక్షల మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు.

ఇటీవలే 2.50 లక్షల యూనిట్ల మైలురాయిని దాటింది. XUV700 SUV గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దల సేఫ్టీకి సంబంధించి 5-స్టార్ రేటింగ్, పిల్లల రక్షణకు 4-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్-సెన్సిటివ్ డోర్ లాక్‌లు, ISOFIX వంటి సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంది. ఇది ఇండియాలో టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజార్, MG హెక్టర్ ప్లస్ వంటి కార్లతో పోటీపడుతుంది.


Click it and Unblock the Notifications








